Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీ సిల్వాసా పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ సిల్వాసా పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ సిల్వాసా పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ సిల్వాసా పర్యటన


దాద్రా నాగర్ హవేలీ లోని సిల్వాసాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేడు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. ప్రాభంభోత్సవాలు జరిపారు. దాద్రా నాగర్ హవేలీ లోని సయిలిలో ప్రధాని వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు.

దాద్రా నాగర్ హవేలీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీని ఆవిష్కరించారు. ఎం-ఆరోగ్య మొబైల్ యాప్ ప్రారంభించారు. దాద్రా నాగర్ హవేలీలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం, వేరుచేయడం, ఘన వ్యర్ధాలను వినియోగంలోకి తెచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులకు గోల్డ్ కార్డులు మరియు వన అధికార పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ప్రధానమంత్రి ఈరోజు ఇక్కడ రూ. 1400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం లేదా ప్రారంభించడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ సంధాయకత , మౌలిక సదుపాయాల ఆరోగ్యం , విద్య మొదలగు అంశాలకు సంబంధించినవి.

పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని మరియు కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

దేశ పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే మంత్రంతో పంచేస్తున్నామని ఆయన అన్నారు.

డామన్ మరియు డయ్యు , దాద్రా నాగర్ హవేలీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు బహిరంగ మలవిసర్జనలేని ప్రాంతాలుగా ప్రకటితమయ్యాయని ఆయన వెల్లడించారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో కిరోసిన్ వాడటం లేదని ఆయన ప్రకటించారు. ఈనాడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి ఇంటికి వంటగ్యాస్, విద్యుత్, మంచినీటి కనెక్షన్ ఉందని కూడా ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో పేదలందరికీ ఇళ్ళను కేటాయించడం జరిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రయోజనాలు పొందడం కోసం రెండు కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలకు గోల్డ్ కార్డులు జారీచేసినట్లు ఆయన తెలిపారు.

గడచిన మూడేళ్ళలో రూ. 9000 కోట్ల విలువైన పెట్టుబడులు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్టడం జరిగిందని దానివల్ల వరుసగా అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికి దారితీసిందని తెలిపారు. వైద్య కళాశాలకు పునాదిరాయి వేయడంతో దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతాలకు మొదటి వైద్య కళాశాల వచ్చినట్లయిందని ప్రధాని అన్నారు. ఈ విద్య సంవత్సరంలోనే వైద్య కళాశాల ప్రారంభానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి కేవలం 15 మెడికల్ సీట్లు ఉన్నాయని, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఇకనుంచి సీట్ల సంఖ్య 150కి పెరుగుతుందని అన్నారు. మెడికల్ కాలేజీ రాకతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు లభిస్తాయని అన్నారు.

ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతూ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్ట్ అని, ఈ పథకం ద్వారా ప్రతి రొజూ 10వేల మంది పేదలు లబ్ధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. పథకం ప్రారంభమైన తరువాత కేవలం 100 రోజుల్లో ఏడు లక్షల మంది పేదలు ప్రయోజనం పొందారని అన్నారు.

నగరాలు, పల్లెల్లోని పేదలకు శాశ్వత గృహవసతి కల్పించేందుకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టి అమలుచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు గత ప్రభుత్వం అయిదేళ్ళలో 25 లక్షల గృహాలను నిర్మిస్తే తమ అప్రభుత్వం ఐదేళ్ళలో ఒక కోటి 25 లక్షల గృహాలను నిర్మించిందని అన్నారు.

ఒక్క దాద్రా నాగర్ హవేలీ లోనే 13వేల మంది మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వన్ ధన్ యోజన కింద అటవీ ఉత్పత్తుల విలువను పెంచే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సంస్కృతీ పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టామని అన్నారు.

దాద్రా నాగర్ హవేలీలో పర్యాటక రంగ వికాసానికిఎంతో ఆస్కారముందని, ఈ ప్రాంతాన్ని పర్యాటక చిత్రపటంలోకి తేవడానికి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి నీలి విప్లవ పనులు చేపట్టామన్నారు. మత్స్యపరిశ్రమ వృద్దికి , ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 7500 కోట్లతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామన్నారు. 125 కోట్లమంది భారతీయులు తన కుటుంబమని, వారి సంక్షేమానికి పనిచేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు.

***