Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌లేశియా పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ దాతుక్ సెరి అన్వర్ ఇబ్రాహిమ్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో మ‌లేశియా పార్ల‌మెంటు స‌భ్యుడు మరియు పికెఆర్ పార్టీ (the Parti Keadilan Rakyat Party of Malaysia) నేత శ్రీ దాతుక్ సెరి అన్వర్ ఇబ్రాహిమ్ నేడు న్యూ ఢిల్లీ లో స‌మావేశ‌మ‌య్యారు. 

  PM India

శ్రీ ఇబ్రాహిమ్ వెంట మ‌లేశియా పార్ల‌మెంటు స‌భ్యులు ఇద్ద‌రు.. గౌర‌వ‌నీయులు శ్రీ కేశ‌వ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, శ్రీ సంతార కుమార్ రామానాయుడు.. ఉన్నారు.

పికెఆర్ పార్టీ కి అధ్య‌క్షుని గా శ్రీ ఇబ్రాహిమ్ ఇటీవ‌ల ఎన్నికైనందుకు ప్ర‌ధాన మంత్రి ఆయన ను అభినందించారు.  2018వ సంవ‌త్స‌రం మే నెల లో తాము ఉభయులు స‌మావేశం అయిన సంగతి ని ప్ర‌ధాన మంత్రి ఆప్యాయం గా గుర్తు కు తెచ్చుకున్నారు.  మ‌లేశియా ప్ర‌ధాని మాన్య‌ శ్రీ తున్ డాక్ట‌ర్ మ‌హ‌తీర్ మ‌హ్మ‌ద్ కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ద్వైపాక్షిక అంశాల ను, ప్రాంతీయ అంశాల‌ ను మ‌రియు ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడిప‌డి ఉన్న ప్ర‌పంచ అంశాల‌ను గురించి ఇరువురు నేత‌ లు చ‌ర్చించారు.

**