Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఐటి భువ‌నేశ్వ‌ర్ ప్రారంభ కార్య‌క్ర‌మం మరియు ఒడిశా లో ఐఐఎస్ఇఆర్, త‌దిత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ కు శంకు స్థాప‌న సందర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఐఐటి భువ‌నేశ్వ‌ర్ ప్రారంభ కార్య‌క్ర‌మం మరియు ఒడిశా లో ఐఐఎస్ఇఆర్, త‌దిత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ కు శంకు స్థాప‌న సందర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఐఐటి భువ‌నేశ్వ‌ర్ ప్రారంభ కార్య‌క్ర‌మం మరియు ఒడిశా లో ఐఐఎస్ఇఆర్, త‌దిత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ కు శంకు స్థాప‌న సందర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఐఐటి భువ‌నేశ్వ‌ర్ ప్రారంభ కార్య‌క్ర‌మం మరియు ఒడిశా లో ఐఐఎస్ఇఆర్, త‌దిత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ కు శంకు స్థాప‌న సందర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఇక్క‌డ‌ కు విచ్చేసిన నా సోద‌రులు, సోద‌రీమ‌ణులు మరియు నా యువ మిత్రులారా,
 
ఒడిశా అభివృద్ధి కోసం అంకిత భావం తో కృషి చేయాల‌న్న మన సంక‌ల్పం నేడు మ‌రొక మైలు రాయి ని చేరుకొంది.  కొద్దిసేప‌టి క్రితమే 14 వేల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా విలువైన అనేక ప‌థ‌కాలు ప్రారంభం కావ‌డ‌మో లేదా వాటి శంకు స్థాప‌న‌లు కావడ‌మో జరిగింది.  వీటి లో విద్య‌, ఆరోగ్యం, గ్యాస్‌, రోడ్లు, ఇంకా సాంస్కృతిక ప్రాముఖ్యం క‌లిగిన ప్రాజెక్టు లు క‌లసి ఉన్నాయి.  మ‌రి ఈ ప్రాజెక్టుల‌న్నీ కూడా ఒడిశా పురోగ‌మ‌నం లో ఒక కీల‌క‌మైన‌టువంటి భూమిక‌ ను పోషించ‌నున్నాయి.  ఇవి ఒడిశా లో నివ‌సిస్తున్న ప్ర‌తి ఒక్క వ్య‌క్తి యొక్క జీవితాన్ని మ‌రింత మెరుగ్గా, స‌ర‌ళ‌త‌రం గా తీర్చిదిద్ద‌నున్నాయి.  అభివృద్ధి ప‌థ‌కాలకు గాను ఒడిశా ప్ర‌జ‌ల‌ ను నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

ఒడిశా తో స‌హా భార‌త‌దేశం యొక్క తూర్పు ప్రాంతం ప‌ట్ల ఒక కేంద్ర ప్ర‌భుత్వం ఇంత‌టి శ్ర‌ద్ధ‌ ను తీసుకోవ‌డ‌మ‌నేది దేశ చ‌రిత్ర లోనే ఇది ఒకటో సారి.  దేశాన్ని స‌మ‌తుల్య‌మైన‌టువంటి రీతి లో అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్య క్ర‌మాన్ని నిర్దేశించుకొంటూ గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో మౌలిక స‌దుపాయాలు, మ‌రి ఇత‌ర ముఖ్య‌మైన సౌక‌ర్యాలకు సంబంధించిన ప‌లు ప‌థ‌కాల‌ ను అదే ప‌ని గా విస్త‌రించ‌డమైంది.  తూర్పు ఆసియా కు, ఇంకా ద‌క్షిణ ఆసియా కు ఒక ముఖ ద్వారం గా భార‌త‌దేశం యొక్క తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి ప‌ర‌చే దిశ‌ గా కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు పోతోంది.

కేంద్ర ప్ర‌భుత్వం ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్’ మంత్రాన్ని అనుస‌రిస్తూ, ఒడిశా లో ప్ర‌తి ఒక్క వ్య‌క్తి ని, ప్ర‌తి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధిప‌ర‌చాల‌ని సంక‌ల్పం చెప్పుకొంది.
 
మిత్రులారా,

ఈ రోజు న ఐఐటి భువ‌నేశ్వ‌ర్ ను ఒడిశా లోని ప్రతిభావంతుల కు, అలాగే యువ‌జ‌నుల‌ కు అంకితం చేసే అవకాశం నాకు ల‌భించింది.  దీని ని నిర్మించ‌డం కోసం 1,260 కోట్ల రూపాయ‌లు వెచ్చించ‌డం జ‌రిగింది.  ఈ భ‌వ్య‌మైన‌టు వంటి విద్యా సంస్థ ఆవ‌ర‌ణ ఒడిశా యువ‌తీయువ‌కుల స్వప్నాల‌కు ఒక కేంద్రం గానే కాక ఒడిశా యువ‌త‌ కు ఒక న‌వీన ఆదాయ మాధ్య‌మం గా నిరూపించుకోబోతోంది.  ఒడిశా లోని ఐఐటి క్యాంప‌స్ ఇప్పుడిక ఒడిశా అడ‌వుల లోని స‌మృద్ధ‌మైన వ‌న‌రుల పై ప‌రిశోధ‌న‌ ను నిర్వ‌హించ‌గ‌లుగుతుంది.  ఆదివాసీ సోద‌రుల మ‌రియు సోద‌రీమ‌ణుల యొక్క జీవితాల‌ ను మెరుగుప‌ర‌చ‌డం కోసం నూత‌న  సాంకేతిక విజ్ఞానం పై ప‌రిశోధ‌న జ‌రుగ‌నుంది.  ఈ సంస్థ ఉత్త‌మ‌మైన‌టు వంటి ప్ర‌తిభాన్విత ఇంజినీర్ల‌ను, న‌వ పారిశ్రామికవేత్తల‌ను తీర్చిదిద్ది ఒడిశా ను హై- టెక్ పారిశ్రామిక అభివృద్ధి మార్గం లో నిల‌పనుంది.  రానున్న రోజుల లో బర్ హాంపుర్ లో 1,600 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేశన్ అండ్ రిస‌ర్చ్ ను ఏర్పాటు చేసే ప‌నులు కూడా మొద‌ల‌వ‌నున్నాయి.

మిత్రులారా,

విద్య‌, ఆరోగ్యం, ఇంకా సాంకేతిక విజ్ఞానాల‌ కు సంబంధించిన అనేక సంస్థ‌ల‌ కు గ‌త నాలుగున్న‌ర సంవ‌త్సరాల కాలం లో కేంద్ర ప్ర‌భుత్వం ఆమోద ముద్ర వేసింది.  ‘న్యూ ఇండియా’ ను ఆవిష్క‌రించాల‌న్న ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త అమ‌లు లో ఇది ఒక ముంద‌డుగు.  భార‌త‌దేశాన్ని ఒక స్టార్ట్‌- అప్ హ‌బ్ గా, మ‌రి అలాగే ప్ర‌పంచం లో ఆధునిక సాంకేతిక విజ్ఞాన నిల‌యంగా మార్చ‌డం కోసం ‘న్యూ ఇండియా’ ఛ‌త్రం నీడ‌ న కృషి సాగుతోంది.  నూత‌న సంస్థ‌ లు ఒడిశా కు ఉన్న‌టువంటి జ్ఞానం, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల నెల‌వు అనే గుర్తింపు ను మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తాయ‌ని నేను ఆశిస్తున్నాను.    

మిత్రులారా,

విద్య‌ తో పాటు ప్ర‌జ‌ల ఆరోగ్యం ప‌ట్ల కూడా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ను తీసుకొంటోంది.  ఈ స్ఫూర్తి తో ఖోర్దా భువ‌నేశ్వ‌ర్ లో ఉన్న ఇఎస్ఐసి ఆసుప‌త్రి ని విస్త‌రించే ప‌నుల‌ను పూర్తి చేయ‌డ‌మైంది.

నేడు ఆధునిక స‌దుపాయాల‌ తో సిద్ధ‌మైన ఈ ఆసుప‌త్రి ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌డ‌మైంది.  పాత ఆసుప‌త్రి సామ‌ర్ధ్యాన్ని రెట్టింపు చేయ‌డ‌మైంది.  ప్ర‌స్తుతం దీని యొక్క సామ‌ర్ధ్యాన్ని 100 ప‌డ‌క‌ల‌ కు పెంచ‌డం జ‌రిగింది.  దేశ సుదూర వన్య ప్రాంతాల లో ఆవాసం ఏర్ప‌ర‌చుకున్న ఆదివాసీ కుటుంబాల‌ కు చికిత్స విష‌య‌మై ఎటువంటి సంఘ‌ర్ష‌ణ చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త లేకుండా చూడాల‌నేది ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా ఉంది.  దీని ని దృష్టిలో పెట్టుకొని ‘ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న’ లో భాగంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంట‌ర్ లను ఏర్పాటు చేసే ప‌నులు శ‌ర వేగంగా పురోగ‌మిస్తున్నాయి.  దాదాపు 1150 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంట‌ర్ ల ను ఒడిశా లో ఏర్ప‌ర‌చేందుకు ఆమోదం తెల‌ప‌డమైంది.  ఈ కేంద్రాల‌న్నీ రానున్న ఒక‌టి రెండు సంవ‌త్స‌రాల‌ లో సిద్ధ‌మయ్యేటప్పటికి  దేశ‌వ్యాప్తం గాను, ఒడిశా లో ఆరోగ్య సదుపాయాల సంబంధిత విప్ల‌వాత్మ‌క‌ ప‌రివ‌ర్త‌న చోటు చేసుకోగలదు. 

మిత్రులారా,

ఒడిశా లో ఆరోగ్య స‌దుపాయాల తో పాటు, ర‌హ‌దారి సంధానాన్ని కేంద్ర ప్ర‌భుత్వం శీఘ్ర గతి న బాగా ప‌టిష్ఠపరుస్తోంది.  రాష్ట్రం లోని మారుమూల ప్రాంతాల‌న్నింటి ని ర‌హ‌దారుల తో జోడించేందుకు త‌గిన ప‌థ‌కాల‌ ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది.  ప‌ల్లెల లో, న‌గ‌రాల లో ర‌హ‌దారుల నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేయ‌డ‌ం జరుగుతోంది.  ఒడిశా లో ప‌ది వేల కిలో మీట‌ర్ల వ‌ర‌కు నేశ‌న‌ల్ హైవే ల పొడ‌వు ను పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం న‌డుం క‌ట్టింది.  ఈ రోజు న ర‌హ‌దారుల కు, ఇంకా హైవేల‌ కు సంబంధించిన నాలుగు ప్రాజెక్టుల‌ కు శంకుస్థాప‌న చేయ‌డ‌మైంది.  ఈ ప‌థ‌కాల‌ లో చాందీఖోలే- భ‌ద్ర‌క్ సెక్ష‌న్ ను, టాంగీ -పోయిటోలా సెక్ష‌న్ ను ఆరు దోవ‌లు కలిగిన‌వి గా చేయ‌డం, క‌ట‌క్- ఆంగుల్ సెక్ష‌న్ ను విస్త‌రించ‌డం తో పాటు, ఖండ‌గిరి ఫ్ల‌య్ ఓవ‌ర్ నిర్మాణం వంటివి క‌లిసి ఉన్నాయి.  ఇవి ఒడిశా అభివృద్ధి లో ఒక కీల‌క‌మైన పాత్ర‌ ను పోషించ‌నున్నాయి.  ఈ ప్రాజెక్టుల‌ కు సుమారు 4,500 కోట్ల రూపాయ‌లు అవుతాయి.  ఈ స‌దుపాయాలు ప్ర‌జ‌ల ర‌వాణా ను సుల‌భ‌త‌రం చేయగలవు; అంతేకాదు, వ్యాపారం లో సైదోడు గా కూడా నిలువగలవు.

మిత్రులారా,

ఒడిశా లో మౌలిక స‌దుపాయాలను విస్త‌రిస్తుండ‌టం తో వ్యాపారానికి నూత‌న మార్గాలు, ఇంకా అవ‌కాశాలు సైతం విస్త‌రిస్తున్నాయి.  చ‌మురు, ఇంకా స‌హ‌జ వాయువు రంగం లో ఒడిశా భ‌విష్య‌త్తు ప్రకాశవంతం గా ఉంది.  పారాదీప్- హైద‌రాబాద్ గొట్ట‌పు మార్గం ఒడిశా కు ఒక కొత్త గుర్తింపు ను ప్ర‌సాదించ‌నుంది.  ఇది ఒడిశా యువ‌త‌ కు బోలెడ‌న్ని ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నుంది.  సుమారు 1200 కిలో మీట‌ర్ల పొడ‌వు న ఉండే గొట్ట‌పు మార్గం ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఒడిశా ల పెట్రోలియ‌మ్ అవ‌సరాల‌ ను తీర్చ‌గ‌లుగుతుంది.  పారాదీప్ శుద్ధి కార్మాగారం ఉత్ప‌త్తి చేసిన పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్ మ‌రియు విమానాల‌కు కావ‌ల‌సిన ఇంధ‌నం అనేక న‌గ‌రాల‌ మ‌రియు గ్రామాల ఆవ‌శ్య‌క‌త‌ ను తీర్చ‌గ‌లుగుతుంది.  ఈ ప్రాజెక్టు విలువ దాదాపుగా 4,000 కోట్ల రూపాయ‌లు.  భార‌త‌దేశ తూర్పు ప్రాంతం లో ఒడిశా ఒక పెట్రోలియ‌మ్ హ‌బ్ గా మారేందుకు ఈ ప్రాజెక్టు స‌హాయ‌కారి కాగ‌ల‌దు.  ఈ గొట్ట‌పు మార్గం నిర్మాణం అనంత‌రం, మ‌రి అలాగే, బర్ హాంపుర్‌, విశాఖ‌ప‌ట్టణం, రాజ‌మండ్రి, ఇంకా విజ‌య‌వాడ ల‌లో డెలివ‌రీ పంపింగ్ స్టేశన్ ల నిర్మాణం పూర్తి అయిన త‌రువాత భార‌త‌దేశ తూర్పు ప్రాంతానికి ఒక పెట్రోలియ‌మ్ హ‌బ్ గా ఒడిశా రూపుదిద్దుకోగలదు.

మిత్రులారా,

నిరుపేద కుటుంబాల‌ కు పొగ రాని ఇంధ‌నాన్ని, స్వ‌చ్ఛ‌మైన ఇంధనాన్ని స‌మ‌కూర్చడం కోసం ప్ర‌భుత్వం అంకితమూ ఉంది.  దేశం అంత‌టా ప్ర‌తి ఒక్క కుటుంబానికి ఎల్‌పిజి సిలిండ‌ర్ల ను అంద‌జేసే స్థితి కి మనం  అత్యంత స‌మీపానికి వచ్చేశాం.  ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం గొట్ట‌పు మార్గం ద్వారా కుటుంబాల‌ కు గ్యాస్ ను స‌మ‌కూర్చేందుకు ఒక పెద్ద ప్ర‌చారోద్య‌మాన్ని మొద‌లుపెట్టింది.  ప్ర‌త్యేకించి భార‌త‌దేశం తూర్పు ప్రాంతం లో గ్యాస్ ను గొట్ట‌పు మార్గాల ద్వారా స‌మ‌కూర్చేందుకు ఉద్దేశించిన‌టువంటి ప్ర‌ధాన మంత్రి ఊర్జా గంగా యోజ‌న‌ శ‌ర‌వేగంగా పురోగ‌మిస్తోంది.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నుండి ఒడిశా కు పిఎన్ జి గొట్ట‌పు మార్గాల నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేయ‌డానికి గాను వేల కోట్ల రూపాయ‌ల‌ ను వ్య‌యం చేయ‌డం జ‌రుగుతోంది.  ఇందులో భాగం గా జ‌గ‌దీశ్ పుర్- హ‌ల్దియా-బొకారో -ధామ్ రా గొట్ట‌పు మార్గానికి ఈ రోజున శంకుస్థాప‌న చేయ‌డం జ‌రిగింది.  ఈ ప్రాజెక్టు దాదాపు 3,500 కోట్ల రూపాయ‌ల‌ తో నిర్మాణం పూర్తి చేసుకొందీ అంటే గనక ఒడిశా లోని 5 జిల్లాల తో పాటు ఝార్‌ ఖండ్ లోని 6 జిల్లాలు గ్యాస్ యొక్క గొట్ట‌పు మార్గాల‌ తో సంధానం అవుతాయి.

మిత్రులారా,

సాంస్కృతిక అభివృద్ధి జ‌రిగేటంత వ‌ర‌కు వ‌న‌రుల అభివృద్ధి అనేది అసంపూర్తి గా మిగిలిపోతుంది.  ‘పైకా’ క్రాంతి కి 200 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భం గా ఒక ప్ర‌త్యేక స్మార‌క త‌పాలా బిళ్ళ‌ ను, ఒక నాణేన్ని ఈ రోజు న జారీ చేయ‌డం జ‌రిగింది.  ‘పైకా’ తిరుగుబాటు స్వాతంత్య్రం యొక్క ఒకటో యుద్ధం లో ఒక కీల‌క‌ భూమిక ను పోషించింది.  అంతేకాకుండా ప్ర‌భుత్వం పైకా తిరుగుబాటు యొక్క నాయ‌కుడు అయిన‌టువంటి బ‌క్శీ జ‌గ‌బంధు పేరిట ఉత్క‌ళ్ యూనివ‌ర్సిటీ లో ఒక చైర్ ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.  ఈ పీఠం  పైకా, ఇంకా ఆదివాసీ ల ఉద్య‌మాల తో స‌హా అన్ని జాతీయవాద ఉద్య‌మాల‌ కు సంబంధించిన అంశాల పై ఒక ప‌రిశోధ‌న కేంద్రం గానే కాకుండా ఒడిశా లోని ఆదివాసీ స‌మాజానికి చెందిన సామాజిక, ఆర్థిక మార్పు ల‌ను అర్థం చేసుకోవ‌డం లో కూడా ఒక ముఖ్య పాత్ర ను పోషించ‌గలదు.

మిత్రులారా,

పైకా తిరుగుబాటు యొక్క నాయ‌కుల‌ ను గౌర‌వించుకోవ‌డం తో పాటు, ఒడిశా కు చెందిన సుసంపన్న ఆధ్యాత్మిక వార‌స‌త్వాన్ని ప్ర‌పంచం ముందు నిలిపే కృషి జ‌రుగుతోంది.  క‌ట‌క్ జిల్లా లో ల‌లిత్ గిరి లో పురావ‌స్తు సంగ్ర‌హాల‌యాన్ని ప్రారంభించే అవ‌కాశం సైతం నాకు ఈ రోజు దక్కింది.  ఇందులో పూర్వ‌ బౌద్ధ యుగ ప్రాచీన అవ‌శేషాలను ఉంచడమైంది.  ఇది బౌద్ధాన్ని అనుస‌రించే వారిని ఆక‌ర్షించ‌డం తో పాటు ప‌రిశోధ‌క విద్యార్థుల‌ ను, యాత్రికుల‌ ను, ఇత‌రుల‌ ను కూడా ఆక‌ట్టుకోగలదు.  ఒడిశా కు చెందిన ప‌ర్యాట‌క రంగ ప‌రిశ్ర‌మ‌ ద్వారా దీనికి మరింత శక్తి అంది, ఇక్క‌డి యువ‌త‌ కు కొత్త ఉద్యోగ అవ‌కాశాలు పుట్టుకు రాగ‌ల‌వు.

మిత్రులారా,

కేంద్ర ప్ర‌భుత్వం ఒడిశా స‌ర్వ‌తోముఖ అభివృద్ధి కి  అంకితమైంది.  ఒడిశా లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి మ‌రియు ప్ర‌జ‌ల అభివృద్ధి కి అనేక చ‌ర్య‌ లను చేపట్టటం జ‌రుగుతోంది.  ఈ ప‌ని నిరంత‌రమూ కొన‌సాగుతుందని మీకు నేను  హామీ ని ఇవ్వ‌ద‌ల‌చాను.  మ‌నం క‌ల‌సిక‌ట్టు గా ముందుకు కదలి,  ఒక ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం లో ప్ర‌ముఖ చోద‌క శ‌క్తి గా ఒడిశా నిల‌చేట‌ట్లు ఉమ్మ‌డి కృషి ని చేద్దాం.  ఈ ఆశ‌ తో నేను మ‌రొక్క‌ మారు ఒడిశా లోని వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు గాను ప్ర‌జ‌ల‌ కు హృద‌యపూర్వ‌క అభినంద‌న‌ల‌ ను తెలియ‌ జేస్తున్నాను.  జయ్ జ‌గ‌న్నాథ్ ను స్మరించుకొంటూ మీ అంద‌రికీ ఇవే నా అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**