ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, పంజాబ్‌లో రావి నదిపై షాపుర్‌కండి డ్యామ్ (జాతీయ ప్రాజెక్టు) అమలుకు ఆమోదం తెలిపింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహాయం కింద రు 485.38 కోట్ల రూపాయలు ( నీటిపారుదల కాంపొనెంట్‌కింద) 2018-19 నుంచి 2022-23 వరకుగల ఐదు సంవత్సరాల కాలానికి అందించడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్టు అమలుతో రావి నది నుంచి ప్రస్తుతం మధోపుర్ హెడ్‌వర్క్ నుంచి పాకిస్తాన్‌కు దిగువకు నీరు వృధాగా పోవడాన్ని తగ్గించడానికి వీలు కలుగుతుంది.
వివరాలు :
…..ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో 5,000 హెక్టార్లు, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 32,173 హెక్టార్లకు నీటిపారుదల సామర్ధ్యం కల్పించబడుతుంది.
…..షాపుర్‌కండి డ్యామ్ ప్రాజెక్టకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని నాబార్డ్ ద్వారా అందిస్తారు. దీనిని ఎల్.టి.ఐ.ఎఫ్ కింద 99 పిఎంకెఎస్‌వై-ఎఐబిపి ప్రాజెక్టులకు ప్రస్తుతం చేస్తున్న అందిస్తున్న నిధులలో భాగంగా సమకూరుస్తారు.
…..ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న మానిటరింగ్ వ్యవస్థలైన సెంట్రల్ వాటర్ కమిషన్ తోపాటు, కేంద్ర జల సంఘం సభ్యుడి నాయత్వంలో, పంజాబ్, జమ్ము కాశ్మీర్‌కు సంబంధించిన ఛీఫ్ ఇంజనీర్లు ఇతర సంబంధిత అధికారులు సభ్యులుగా ఏర్పడిన కమిటీ ఈ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ఏర్పడుతుంది.
…..జలవనరుల మంత్రిత్వశాఖ సలహా కమిటీ, ఇరిగేషన్‌పై గల ఆర్‌డిఅండ్ జిఆర్, ఫ్లడ్ కంట్రోల్,మల్టీపర్పస్ ప్రాజెక్టులు రెండోసారి సవరించిన అంచనాలకు సంబంధించి 2715.70 కోట్లు (ఫిబ్రవరి, 2018 ధరల స్థాయిలో) 31.10.2018న జరిగిన 138 వ సమావేశంలో ఆమోదించడం జరిగింది.
……ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అందించే 485.38 కోట్ల రూపాయలతొ పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టును 2022 జూన్ నాటికి పూర్తి చేస్తారు.
ప్రభావం:
….రావి నది నుంచి కొంత నీరు ప్రస్తుతం మధోపూర్ హెడ్‌వర్క్స్ ద్వారా వృధాగా పాకిస్థాన్‌కు దిగువకు వెళుతోంది.మరోవైపు పంజాబ్, జమ్ము కాశ్మీర్‌లో నీటి అవసరం ఉంది.ఈ ప్రాజెక్టు అమలుతో నీటి వృధాను తగ్గించడానికి అవకాశం కలుగుతుంది.
…..ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అదనంగా పంజాబ్‌లో 5000 హెక్టార్లు, జమ్ము కాశ్మీర్‌లో 32,173 హెక్టార్లకు అదనపు నీటిపారుదల సౌకర్యం కల్పింపపబడుతుంది.
….దీనికితోడు పంజాబ్‌లోని యుబిడిసి వ్యవస్థ కింద 1.18 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించేందుకు విడుదల చేసే నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా సమర్ధవంతంగా నిర్వహించడం, నియంత్రించడం జరుగుతుంది. దీనితో ఈ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, పంజాబ్ 206 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుంది.
వ్యయం:
షాపుర్‌కండి డ్యామ్ ప్రాజెక్టు కు సంబంధించిన మిగిలిన పనుల వ్యయం1973.53 కోట్లు ( నీటిపారుదల కాంపొనెంట్ 564.63 కోట్లు, విద్యుత్ కాంపొనెంట్ 1408.90 కోట్లు). ఇందులో 485.38 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాయం కింద అందిస్తారు.
లబ్ధిదారులు :
పంజాబ్‌లో 5000 హెక్టార్ల భూమికి, జమ్ము కాశ్మీర్‌లో 32172 హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యం కల్పించబడుతుంది. ఈ పథకం అమలు వల్ల 6.2 లక్షల పనిదినాలు నైపుణ్యంలేని కార్మికులకు , 6.2 లక్షల పనిదినాలు పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు, 1.67 లక్షల పనిదినాలు నైపుణ్యం గల కార్మికులకు కల్పిస్తుంది.
నేపథ్యం :
సింధూ జలాల పంపిణీకి సంబంధించి సింధూ జలాల ఒప్పందం 1960లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, రావి, బియాస్, సట్లజ్‌నదుల నుంచి నీటిని వాడుకునేందుకు భారత్‌కు పూర్తి హక్కు లభించింది. రావి నదికి సంబంధించిన కొంత నీరు ప్రస్తుతం మధోపూర్ హెడ్ వర్క్స్‌నుంచి పాకిస్తాన్‌కు దిగువకు వృధాగా వెళుతోంది. ఈ పథకం అమలు వల్ల ఇలా నీరు వృథాగా పోవడాన్ని కొంతవరకు అరికట్టడానికి వీలు కలుగుతుంది.
1979 జనవరిలో పంజాబ్, జమ్ము కాశ్మీర్‌ల మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, రంజిత్ సాగర్ డ్యామ్(థీన్ డ్యామ్), షాపుర్ కండి డ్యామ్‌లను పంజాబ్ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. రంజిత్ సాగర్ డ్యామ్ 2000 ఆగస్టులో ప్రారంభమైంది. రావి నదిపై ప్రతిపాదించిన షాపుర్‌కండి డ్యామ్ ప్రాజెక్టు రంజిత్ సాగర్ డ్యామ్‌కు సంబంధించి 11డి.ఎస్, మధోపూర్ హెడ్‌వర్క్స్‌కింద 8 కిలోమీటర్లు ఉంది.
ఈ ప్రాజెక్టును తొలుత ప్రణాళికా సంఘం 2001 నవంబర్‌లో ఆమోదించింది. దీనిని యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ పథకం (ఎఐబిపి) కింద ఈ మంత్రిత్వశాఖ పథకంలో నీటిపారుదల పథకానికి నిధులకోసం చేర్చారు.
షాపూర్ కండి డ్యామ్ జాతీయ ప్రాజెక్టు సవరించిన అంచనాలను జలవనరుల మంత్రిత్వశాఖ, ఆర్.డి అండ్ జిఆర్ 2009 ఆగస్టు 24న 2285.81 కోట్ల కేంద్ర సహాయానికి ఆమోదించింది. 2009-10 ,2010-2011 సంవత్సరంలో 26.04 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అయితే
పంజాబ్ ప్రభుత్వం వద్ద విద్యుత్ కాంపొనెంట్‌కు సంబంధించి నిధులు అందుబాటులో లేకపోవడం, జమ్ము కాశ్మీర్‌తో అంతర్ రాష్ట్ర సమస్యల కారణంగా పనులు ముందుకుసాగలేదు. ఇందుకు సంబంధించి ద్వైపాక్షికంగా, అలాగే భారత ప్రభుత్వ స్థాయిలో వరుస సమావేశాలు జరిగాయి. చివరకు జలవనరుల మంత్రిత్వశాఖ , న్యూఢిల్లీలోని ఆర్.డి అండ్‌జిఆర్ ల నేతృత్వంలో2018 సెప్టెంబర్‌లో పంజాబ్, జమ్ము కాశ్మీర్ మధ్య ఒప్పందం కుదిరింది.
***