Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల పై ప్ర‌ధాన మంత్రి కి స‌ల‌హాలు ఇచ్చే స‌మితి (పిఎం-ఎస్‌టిఐఎసి) స‌భ్యుల తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల పై ప్ర‌ధాన మంత్రి కి స‌ల‌హాలు ఇచ్చే స‌మితి (పిఎం-ఎస్‌టిఐఎసి) స‌భ్యుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు భేటీ అయ్యి, వారి తో మాట్లాడారు. ఈ స‌మితి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణలకు సంబంధించిన అన్ని అంశాల లో ప్ర‌ధాన మంత్రి దార్శ‌నిక‌త ను అమ‌లుప‌ర‌చే తీరు ను ప‌ర్య‌వేక్షించ‌డం తో పాటు స‌ల‌హాల‌ ను కూడా ఇస్తుంటుంది.

కీల‌కమైన విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞాన రంగాల లో ప‌రిశోధ‌న ను, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ ను పెంచి పోషించ‌డం కోసం తీసుకొంటున్న వివిధ చ‌ర్య‌ల ను గురించి స‌మితి స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకువ‌చ్చారు.

విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణల ఫ‌లాలు సామాన్యుల‌ కు అందాల‌ని, భార‌త‌దేశం లో రోజువారీ స‌మ‌స్య‌ల‌ ను అవి ప‌రిష్క‌రించాల‌ని, అలాగే దేశ ప్ర‌జ‌ల జీవ‌నం లో స‌ర‌ళ‌త్వానికి మార్గాన్ని సుగ‌మం చేయాల‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భం గా విద్యా సంస్థ‌లు, ప‌రిశోధ‌న‌ & అభివృద్ధి (ఆర్ & డి) ప్ర‌యోగ‌శాల‌లు, ప‌రిశ్ర‌మ‌, ఇంకా వివిధ ప్ర‌భుత్వ విభాగాల మ‌ధ్య బ‌ల‌మైన బంధాన్ని ఏర్ప‌ర‌చే దిశ‌ గా కృషి చేయాల‌ని స‌మితి స‌భ్యులకు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. విద్యా రంగ సంస్థ‌లకు, ప‌రిశోధ‌న సంస్థ‌ లకు మ‌ధ్య గిరి గీసుకొని పని చేసే ధోర‌ణి ని రూపుమాపవలసిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

బ‌డిపిల్ల‌ల లోని విజ్ఞాన శాస్త్ర సంబంధ ప్ర‌తిభ‌ ను గుర్తించి మ‌రియు ప్రోత్స‌హించేందుకు త‌గిన వేదిక‌ల‌ ను, యంత్రాంగాల‌ ను అభివృద్ధిప‌ర‌చి వాటిని జిల్లా స్థాయి లో, ప్రాంతీయ స్థాయి లో అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ కు జోడించాల‌ంటూ ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి వ్య‌వ‌సాయ సంబంధ ఆదాయాన్ని పెంచ‌డం, సికిల్ సెల్ అనీమియా తదితర దీర్ఘకాలిక జినెరిక్ వ్యాధులకు పరిష్కారాలను అన్వేషించడం, వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ, ఇంకా సైబ‌ర్ సెక్యూరిటీ వంటి కొన్ని ప్రాధాన్య రంగాల లో పరిశోధన సాగాల‌న్నారు.

ప్ర‌ధాన మంత్రి కి ప్ర‌ధాన విజ్ఞాన శాస్త్ర స‌ల‌హాదారైన ఆచార్యులు కె. విజ‌య్ రాఘ‌వ‌న్, స‌మితి స‌భ్యులు, ఇంకా భార‌త ప్ర‌భుత్వం లోని సీనియ‌ర్ అధికారులు ఈ స‌మావేశానికి హాజ‌రయ్యారు.