Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌ర్ణాట‌క‌లోని పాదూర్ వ్యూహాత్మ‌క పెట్రోలియం రిజ‌ర్వుల‌ను విదేశాల‌లోని జాతీయ చ‌మురు కంపెనీల ద్వారా నింపేందుకు కేంద్ర కేబినెట్ అనుమ‌తి


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్, క‌ర్ణాట‌క‌లోని పాదుర్ వ్యూహాత్మ‌క పెట్రోలియం రిజ‌ర్వుల‌ను (ఎస్‌పిఆర్‌) విదేశీ జాతీయ చ‌మురు కంపెనీల ద్వారా నింపేందుకు అనుమ‌తించింది. పాదుర్ వ‌ద్ద గ‌ల వ్యూహాత్మ‌క రిజ‌ర్వు భూగ‌ర్భంలో నిర్మించిన 2.5 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల నిల్వ సామ‌ర్ధ్యంగ‌ల రాతి క‌ట్ట‌డం. నాలుగు కంపార్ట‌మెంట్‌ల‌తో నిర్మిత‌మైన ఈ పెట్ర‌లోలునిల్వ కేంద్రం ఒక్కో కంపార్ట‌మెంట్‌లో 0.625 ఎ్ం.ఎం.టి ల పెట్రోలు నిల్వ చేయ‌వ‌చ్చు. ప్ర‌భుత్వం నుంచి బ‌డ్జెట్ మ‌ద్ద‌తును త‌గ్గించేందుకు ఈ వ్యూహాత్మ‌క పెట్రోలియం రిజ‌ర్వును పిపిపి ప‌ద్ధ‌తిన నింపనున్నారు.

భార‌త వ్యూహాత్మ‌క పెట్రోలియం నిల్వ‌ల సంస్థ- ఇండియ‌న్‌ స్ట్రాట‌జిక్ పెట్రోలియం రిజ‌ర్వుల లిమిటెడ్ (ఐఎస్‌పిఆర్ ఎల్‌) భూ గ‌ర్భంలో 5.33 ఎం.ఎం.టి ల క్రూడ్ ఆయిల్ నిల్వ సామ‌ర్ద్యంగ‌ల కేంద్రాల‌ను నిర్మించి వాటిని ఉప‌యోగంలోకి తెచ్చింది. ఇవి మూడు ప్రాంతాల‌లో ఏర్పాట‌య్యాయి. విశాఖ‌పట్నంలో ఏర్పాటు చేసిన భూగ‌ర్భ నిల్వ కేంద్రంలో 1.33 ఎఎంటిల చ‌మురు నిల్వ చేయ‌డానికి, మంగుళూరులో ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రంలో 1.5 ఎం.ఎం.టిలు, క‌ర్ణాట‌క‌లోని పాదుర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన భూగ‌ర్భ నిల్వ కేంద్రంలో 2.5 ఎం.ఎం.టి ల చ‌మురు నిల్వ చేయ‌డానికి వీలుంది. వ్యూహాత్మ‌క పెట్రోలియం రిజ‌ర్వు తొలి ద‌శ కింద నిల్వ చేసే 5.33 ఎం.ఎం.టిల చ‌మురు ,2017-18 వినియోగ అంచ‌నాల ప్ర‌కారం 95 రోజుల‌పాటు భార‌త‌దేశ ముడిచ‌మురు అవ‌స‌రాలు తీర్చ‌గ‌లుగుతుంద‌ని అంచ‌నా. ఇవి కాక అద‌నంగా ఒడిషాలోని చందీఖోల్‌,క‌ర్ణాట‌క‌లోని పాదుర్‌ల‌లో అద‌నంగా 6.5 ఎం.ఎంటిల సామ‌ర్ధ్యంగ‌ల వ్యూహాత్మ‌క పెట్రోలియం రిజ‌ర్వు కేంద్రాల‌ ఏర్పాటుకు 2018 జూన్‌లో కేంద్ర ప్ర‌భుత్వం సూత్ర‌ప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇది భార‌త దేశ ఇంధ‌న భ‌ద్ర‌త‌ను 2017-18 వినియోగ అంచ‌నాల ప్ర‌కారం మ‌రో 11.5 రోజులు క‌ల్పించ‌గ‌లుగుతుంది.