Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌పాన్ లోని టోక్యో లో భార‌తీయ స‌ముదాయం తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

జ‌పాన్ లోని టోక్యో లో భార‌తీయ స‌ముదాయం తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

జ‌పాన్ లోని టోక్యో లో భార‌తీయ స‌ముదాయం తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

జ‌పాన్ లోని టోక్యో లో భార‌తీయ స‌ముదాయం తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టోక్యో లో భార‌తీయ స‌ముదాయం తో నేడు భేటీ అయ్యారు. ప్ర‌ధాన మంత్రి భార‌త‌దేశం- జ‌పాన్ భాగ‌స్వామ్యం తాలూకు అనేక అంశాల‌ను త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు.

జ‌పాన్ దేశ ప్ర‌జ‌లు మ‌రియు జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే లు త‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికి ఆత్మీయమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు శ్రీ మోదీ వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే, జ‌పాన్ లోని భార‌తీయ స‌ముదాయానికి ఆయ‌న దీపావ‌ళి పండుగ శుభాకాంక్ష‌లను వ్యక్తం చేశారు.

అక్క‌డి భార‌తీయ స‌ముదాయం జ‌పాన్ లో భార‌త‌దేశానికి రాయ‌బారులుగా ఉన్నార‌ని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, భార‌త‌దేశం లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌ల‌సిందిగాను, మాతృ భూమి తో సాంస్కృతిక బంధాన్ని కొన‌సాగించవలసిందిగాను వారికి విజ్ఞ‌ప్తి చేశారు.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాల లో ప్ర‌భుత్వం యొక్క సాఫ‌ల్యాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ, ఇండియ‌న్ సొల్యూష‌న్స్- గ్లోబ‌ల్ అప్లికేశన్స్ యొక్క ప్రేర‌ణ తో భార‌త‌దేశం అదే ప‌ని గా కృషి చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అంద‌రికీ ఆర్థిక సేవ‌లు అందించ‌డం లో భార‌త‌దేశం యొక్క న‌మూనా ను గురించి ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌త్యేకించి జెఎఎమ్ (జ‌న్ ధ‌న్ యోజ‌న‌, మొబైల్‌, ఇంకా ఆధార్‌) త్ర‌యం తో పాటు డిజిట‌ల్ లావాదేవీ లు ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంత‌టా ప్ర‌శంసాపాత్రం అవుతున్నాయ‌న్నారు.

భార‌త‌దేశం లో ఆవిష్కార‌మ‌వుతున్న‌టు వంటి ప‌టిష్ట‌మైన డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాలను గురించి, ఎంత‌గానో విజ‌య‌వంత‌మైన‌ అంత‌రిక్ష కార్య‌క్ర‌మానని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి ప‌లికారు. ఎల‌క్ట్రానిక్స్, ఇంకా ఆటోమొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ లకు ప్ర‌పంచం లో ఒక కేంద్రం గా భార‌త‌దేశాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మం తీర్చిదిద్దుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

‘న్యూ ఇండియా’ ను నిర్మించ‌డం కోసం స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ను సృష్టించడం లో జ‌పాన్ తోడ్పాటు ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. భార‌త‌దేశానికి, జ‌పాన్ కు మ‌ధ్య సంబంధాల‌ను మెరుగు ప‌ర‌చేందుకు నిరంతరమూ క‌ష్ట‌ప‌డి ప‌ని చేయవలసిందంటూ భార‌తీయ స‌ముదాయానికి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌ధా మంత్రి రెండు రోజుల యాత్ర కోసం జ‌పాన్ కు విచ్చేశారు.

***