Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ మ‌ద‌న్ లాల్ ఖురానా మృతి కి సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి


ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ మ‌ద‌న్ లాల్ ఖురానా మృతి పట్ల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘ శ్రీ మ‌ద‌న్ లాల్ ఖురానా గారి మ‌ర‌ణం న‌న్ను క‌ల‌చివేసింది. ఢిల్లీ యొక్క పురోగ‌తి కి గాను, ప్ర‌త్యేకించి చ‌క్క‌ని మౌలిక వ‌స‌తులను క‌ల్పించ‌డానికి గాను ఆయ‌న అవిశ్రాంతంగా కృషి చేశారు. అటు ఢిల్లీ ప్ర‌భుత్వం లో, ఇటు కేంద్రంలో ప్ర‌జ‌ల‌ తో స్నేహ పూర్వ‌కంగా ఉన్న ప‌రిపాల‌కుడుగా, శ్ర‌మించి ప‌ని చేసే వాడు గా ఆయ‌న సుప్ర‌సిద్ధుడు” అని ఆయ‌న ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.

ఢిల్లీ లో బిజెపి ని ప‌టిష్ఠం చేయ‌డానికి శ్రీ మ‌ద‌న్ లాల్ ఖురానా గారు చేసిన కృషి ని మనం ఎప్ప‌టికీ స్మరించుకొంటాం. దేశ విభ‌జ‌న అనంతరం ఢిల్లీ లో శ‌ర‌ణార్థుల‌కు ఆయన అపార‌మైన సేవ‌లను అందించారు. ఆయ‌న కుటుంబానికి, మ‌ద్ద‌తుదారుల‌కు నేను ప్ర‌గాఢమైన సానుభూతి ని మరియు సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాను’’ అని కూడా ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

****