Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తుమకూరు జిల్లాలో హెచ్ ఏ ఎల్ కు చెందిన నూత‌న హెలికాప్ట‌ర్ త‌యారీ యూనిట్ నిర్మాణానికి సంబంధించిన‌ శంకుస్థాప‌న ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని

క‌ర్నాట‌క రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( హెచ్ ఏ ఎల్ ) కు చెందిన నూత‌న హెలికాప్ట‌ర్ త‌యారీ యూనిట్ నిర్మాణ‌ ప‌నుల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు (జ‌న‌వ‌రి 03, 2016 న) ప్రారంభించారు. ఈ యూనిట్‌ శంకుస్థాప‌న ఫ‌ల‌కాన్ని ప్ర‌ధాని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ తుమ‌కూరులో ఏర్పాట‌వుతున్న త‌యారీ యూనిట్ సాధార‌ణ‌మైందిగా కాక‌, ప్ర‌పంచం అంతా దీనిని గుర్తించే విధంగా ఉంటుంద‌ని వివ‌రించారు.

” జై జ‌వాన్‌-జై కిసాన్ ” అంటూ పూర్వ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి ఇచ్చిన ప్ర‌సిద్ధ‌ నినాదాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు చేశారు. గ‌త 50 సంవ‌త్స‌రాల‌లో వ్య‌వ‌సాయ రంగంలో గ‌ణ‌నీయుమైన ప్ర‌గ‌తిని సాధించామ‌ని, దేశం ఇప్పుడు ఆహార ధాన్యాల విష‌యంలో స్వ‌యంస‌మృద్ధిని క‌లిగి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. భార‌త సాయుధ‌ ద‌ళాలు ఏ దేశానికి తీసిపోవ‌ని, వారు ఉప‌యోగించే ఆయుధ సంప‌త్తి సైతం ప్ర‌పంచంలో అత్యుత్త‌మంగా ఉండేట‌ట్లు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సిన స‌మ‌యం ఇప్పుడిక ఆస‌న్నం అయింద‌న్నారు. ఇందుకోసం భార‌త‌దేశం ఖ‌రీదైన‌, అంత అత్యాధునికం కాని దిగుమ‌తి చేసుకొన్న ఆయుధాల మీద ఆధార‌ప‌డ‌టాన్ని ఆధార‌ప‌డ‌టాన్ని మానుకోవాల‌ని ప్ర‌ధాని చెప్పారు.

ర‌క్ష‌ణ సంబంధిత యంత్ర సామ‌గ్రి త‌యారీకి ప్రాధాన్యం క‌ట్ట‌బెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ వెల్ల‌డించారు. తుమ‌కూరులో త‌యార‌య్యే హెలికాప్ట‌ర్లు మారుమూల ప్రాంతాల‌లో ఉండే సైనికుల‌కుఉప‌యోగ‌ప‌డుతాయ‌ని అన్నారు. ఈ యూనిట్‌లో రూపుదిద్దుకొనే హెలికాప్ట‌ర్లు 2018 క‌ల్లా సేవ‌లు అందించ‌డం మొద‌లుపెట్టాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఈ యూనిట్ తో 4,000 కుటుంబాలు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధిని పొందుతాయ‌ని తెలిపారు.

భార‌త‌దేశంలో పారిశ్రామికీక‌ర‌ణ‌ పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల వారు శ‌క్తిమంతం అయ్యే విధంగా ఉండాల‌ని రాజ్యాంగ శిల్పి డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ అభిల‌షించార‌ని, ఈ యూనిట్ ఆయ‌న క‌న్న క‌ల‌లను నెర‌వేర్చే దిశ‌లో ఒక‌ ముంద‌డుగు అని ప్ర‌ధాని అభివ‌ర్ణించారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ శ్రీ వ‌జూభాయ్ వాలా, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ సిద్ధ‌రామ‌య్య‌, కేంద్ర మంత్రులు శ్రీ మ‌నోహ‌ర్ పార్రీ‌క‌ర్‌, శ్రీ డి.వి. స‌దానంద‌ గౌడ, శ్రీ అనంత్‌ కుమార్‌, కేంద్ర స‌హాయ మంత్రి శ్రీ జి.ఎం. సిద్ధేశ్వ‌ర‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.