Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తిరుపతి లోను, బెర్హం పుర్‌ లోను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిస‌ర్చ్ (ఐఐఎస్ఇఆర్ స్ )కు శాశ్వత ప్రాంగణాల ఏర్పాటు మరియు కార్యకలాపాల ఆరంభానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్యక్ష‌తన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో, ఒఢిశా లోని బెర్హం పుర్‌ లో రెండు నూతన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిస‌ర్చ్ (ఐఐఎస్ఇఆర్ స్)కు శాశ్వత ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి మరియు అవి కార్యకలాపాలను ఆరంభించడానికి ఆమోదం తెలిపింది.  దీనికి మొత్తం వ్యయం 3074.12 కోట్ల రూపాయలు కావచ్చని (ఇందులో పునరావృత్తం కానటువంటి వ్యయం రూ. 2366.48 కోట్ల రూపాయలు మరియు ఆవృత్తమయ్యేటటువంటి వ్యయం 707.64 కోట్ల రూపాయలు ఉంటుంది) భావిస్తున్నారు.

ఏడో సిపిసి లో పేర్కొన్న లెవెల్ 14 లో ప్రతి ఒక్క ఐఐఎస్ఇఆర్ కు ఒక్కొక్కటి చొప్పున రెండు రిజిస్ట్రార్ పదవులను ఏర్పాటు చేయడానికి సైతం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

వివరాలు:

  • మొత్తం వ్యయం 3074.12  కోట్ల రూపాయలుగా మదింపు చేయడమైంది.  దీనిలో 2366.48  కోట్ల రూపాయల ను ఈ ఆయా సంస్థ లకు శాశ్వత ప్రాంగణాల ను నిర్మించడం కోసం దిగువన పేర్కొన్న ప్రకారం వెచ్చించనున్నారు.

 

ఐఐఎస్ఇఆర్ తిరుపతి

1137.16

354.18

1491.34

ఐఐఎస్ఇఆర్ బెర్హం పుర్‌

1229.32

353.46

1582.78

మొత్తం వ్యయం

2366.48

707.64

3074.12

సంస్థలు మూలధనం ఆవృత్త వ్యయం మొత్తం

 

  • రెండు ఐఐఎస్ఇఆర్ లు 1,17,000 చ.మీ విస్తీర్ణం లో నిర్మితమవుతాయి.  ప్రతి ఒక్క ఐఐఎస్ఇఆర్ లో 1855 మంది విద్యార్థుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి.
  • ఈ సంస్థ లకు శాశ్వత ప్రాంగణాల నిర్మాణం 2021వ సంవత్సరం డిసెంబర్ కల్లా పూర్తి కావలసివుంటుంది.

ప్రయోజనాలు:

పూర్వ స్నాతక స్థాయిలో, స్నాతకోత్తర స్థాయి లో, పిహెచ్‌డి లు మరియు ఇంటిగ్రేటెడ్ పిహెచ్‌డి లలో అగ్రగామి నాణ్యత కలిగిన విజ్ఞాన శాస్త్ర విద్య ను ఈ ఐఐఎస్ఇఆర్ లు అందిస్తాయి.  ఇవి విజ్ఞాన శాస్త్ర రంగం లో పరిశోధన లకు కూడా వీలు కల్పిస్తాయి.  విజ్ఞాన శాస్త్ర పరంగా అత్యత్తమ ప్రతిభావంతుల ను శాస్త్ర విభాగం లోకి ఆకర్షించడం ద్వారా మరియు భారతదేశం లో విజ్ఞాన శాస్త్ర విభాగం లో చక్కటి మానవ వనరుల కు పునాదిని సిద్ధం చేయడం ద్వారా దేశం ఒక విజ్ఞాన భరిత ఆర్థిక వ్యవస్థ గా ముందంజ వేసేందుకు తగిన మార్గాన్ని ఈ ఐఐఎస్ఇఆర్ లు  ఏర్పరచగలవు

పూర్వరంగం:

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 కు అనుగుణంగా ఐఐఎస్ఇఆర్ తిరుపతి ని 2015వ సంవత్సరం లో నెలకొల్పడమైంది.   కేంద్ర ఆర్థిక మంత్రి 2015 వ సంవత్సరం తన బడ్జెట్ ఉపన్యాసం లో చేసిన ప్రకటన కు అనుగుణంగా ఐఐఎస్ఇఆర్ బెర్హంపుర్ ను 2016వ సంవత్సరం లో ఏర్పాటు చేయడమైంది.   ప్రస్తుతం తాత్కాలిక ప్రాంగణాల లో ఈ సంస్థ లు విధులను నిర్వహిస్తున్నాయి.

 

**