నేశనల్ జూట్ మాన్యుఫాక్చరర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌జెఎంసి), దాని అనుబంధ సంస్థ బర్డ్స్ జ్యూట్ & ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (బిజెఇఎల్) ల మూసివేత కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మూసివేత ప్రక్రియ ఇదీ:-
1) 14-6-2018 డిపిఇ మార్గదర్శకాలకు అనుగుణంగా సంస్థ స్థిరాస్తులను , ప్రస్తుత ఆస్తులను విక్రయించవచ్చు. ఇవి విక్రయించగా వచ్చిన మొత్తాన్ని-
సంస్థ అప్పులను తీర్చిన అనంతరం మిగిలినమొత్తాన్ని- భారత సంఘటిత నిధి లో జమ చేస్తారు.
2) డిపిఇ వెలువరించిన 14-6-2018 నాటి మార్గదర్శకాల ప్రకారం ఒక ల్యాండ్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎల్‌ఎంఎ)ని ఆస్తుల అమ్మకానికి ఏర్పాటు చేస్తారు. ఈ ఎల్‌ఎంఎ ఆస్తులకు సంబంధించి సవివరమైన పరిశీలన జరిపి ఆ తరువాత డిపిఇ మార్గదర్శకాల ప్రకారమే వాటిని అమ్మకానికి పెడుతుంది.
3) బిజెఇఎల్‌కు చెందిన భూమిని గాని, లేదా భవనాలను గాని తన స్వంత అవసరాలకు వినియోగించుకోవాలని జౌళి మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. లేదా దానికి అనుబంధం గా ఉన్న సిపిఎస్ఇ ల కోసం అవసరమని చెప్పలేదు. అందువల్ల ఇదే విషయాన్ని ఎల్‌ఎంఎ కి తెలియజేయడం జరుగుతుంది.
ప్రయోజనాలు:
ఖాయిలా పడిన ఈ రెండు సంస్థల కార్యకలాపాల నిర్వహణ కు ప్రభుత్వం చేస్తున్న పునరావృత్త వ్యయాన్ని ఈ నిర్ణయం తగ్గిస్తుంది. ఈ ప్రతిపాదన ద్వారా నష్టదాయక కంపెనీ లను మూసివేసి, విలువైన ఆస్తులను ఉత్పాదక కార్యకలాపాల కు వాడుకోవడానికి, అభివృద్ధి, ప్రగతి కార్యకలాపాల కు నిధులను వినియోగించడానికి ఆర్థిక వనరులను అందుబాటులోకి తెస్తుంది.
రెండు సిపిఎస్ఇ లకు చెందిన భూమి ని ప్రభుత్వ వినియోగానికి, ప్రజోపయోగ సమాజ సమగ్ర అభివృద్ధి కి దోహదపడే ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించడం జరుగుతుంది.
నేపథ్యం:
1) ఎన్‌జెఎంసి సంస్థ పలు సంవత్సరాలుగా నష్టాలు ఎదుర్కొంటున్నది. 1993 నుండి బిఐఎఫ్ఆర్ రెఫరెన్సు లో ఉంది. ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తల్లా జనపనార సంచులు. వీటిని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఆహారధాన్యాలను సరఫరా చేయడం కోసం వాడుతారు. చాలా సంవత్సరాలుగా ఈ తరహా జనపనార సంచులకు గిరాకీ తగ్గిపోయింది. అలాగే కంపెనీ కార్యకలాపాలు వాణిజ్య పరంగా లాభదాయకం కాని పరిస్థితి ఏర్పడినట్టు గుర్తించారు.
2) ఎన్‌జెఎంసి కి చెందిన టిటా గఢ్ లోని కిన్నిసన్ మిల్లు, ఖార్దా లోని ఖార్దా బిల్లు, కటీహార్ లోని ఆర్‌బిహెచ్ఎం మిల్లు 2016 ఆగస్టు నుండి వాటి కార్యకలాపాలను నిలిపివేశాయి. జాబ్ కాంట్రాక్టర్ తన పని ని సక్రమంగా నిర్వర్తించడం లో విఫలం కావడం, స్థానిక కార్మికుల తో సమస్యల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇతర రూపాలలో ఔట్‌సౌర్సింగ్ ద్వారా కార్యకలాపాలు సాగించడానికి చేసిన ప్రయత్నాలూ ఫలితాన్ని ఇవ్వలేదు. సంస్థ గత పనితీరు, మార్కెట్ పరిస్థితులు, ప్లాస్టిక్, ప్రైవేటు జనపనార మిల్లుల ఉత్పత్తి సామర్ధ్యం వీటిని దృష్టి లో పెట్టుకొని ఎన్‌జెఎఎంసి తన రుణాత్మక నికర విలువను నిర్వహనా లాభాల ద్వారా తిరిగి సర్దుబాటు చేసుకునే పరిస్థితి లో లేదని గుర్తించడం జరిగింది. అలాగే ఎన్‌జెఎంజి కి సిబ్బంది, కార్మికులు రోల్స్ లో లేరు. అందువల్ల దీనిని మూసివేయడానికి నిర్ణయించడం జరిగింది.
3) బిజెఇఎల్, ఎన్‌జెఎంసి సబ్సిడరీ సంస్థ. దీనిని బిఐఎప్‌ఆర్ కు గతం లో నివేదించారు. అది పునరుద్ధరణ పథకాన్ని సూచించింది. అయితే ఈ ముసాయిదా ప్రతిపాదన లు అమలు కాలేదు. సంస్థ కు చెందిన భూమి మార్పిడి కి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఎఎస్‌సి కి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయవలసిన ప్రతినిధి ని మూడు సంవత్సరాల ఆలస్యం తరువాత నామినేట్ చేశారు. బిజిఇఎల్ కు స్టాఫ్ లేరు, ఫ్యాక్టరీ నిర్వహణ లో లేదు. దీనిని మూసివేయడం వల్ల ఏర్పడే ప్రతికూలత లు ఏమీ లేవు.