Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో కెన‌డా ప్ర‌తిప‌క్ష నేత శ్రీ‌ ఆండ్రూ షీర్ భేటీ

ప్ర‌ధాన మంత్రి తో కెన‌డా ప్ర‌తిప‌క్ష నేత శ్రీ‌ ఆండ్రూ షీర్ భేటీ

ప్ర‌ధాన మంత్రి తో కెన‌డా ప్ర‌తిప‌క్ష నేత శ్రీ‌ ఆండ్రూ షీర్ భేటీ


కెన‌డా లో క‌న్స‌ర్వేటివ్ పార్టీ నేత మ‌రియు కెన‌డా పార్ల‌మెంటు లో విప‌క్ష నాయ‌కుడు అయిన శ్రీ‌ ఎండ్రూ శీర్ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు న న్యూ ఢిల్లీ లో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, 2015 వ సంవ‌త్స‌రం లో కెన‌డా ను తాను సంద‌ర్శించిన సంద‌ర్భం లో ఉభ‌య దేశాల మ‌ధ్య సంబంధం వ్యూహాత్మ‌క‌మైన‌టు వంటి భాగ‌స్వామ్యం స్థాయి కి ఎదిగిన‌ట్లు గుర్తుకు తెచ్చుకొన్నారు. వివిధ రంగాల లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డానికి ప్రాముఖ్యం ఇవ్వాల్సి వుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇరు దేశాల మ‌ధ్య గల స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను మ‌రింతగా అభివృద్ధి ప‌ర‌చుకోవాల‌న్న అభిప్రాయాన్ని శ్రీ శీర్ వ్యక్తం చేశారు.

అక్టోబ‌ర్ నెల 7వ తేదీ మొద‌లుకొని 13 వ తేదీ వరకు భార‌త‌దేశం లో ప‌ర్య‌టించే శ్రీ శీర్ కు భారతదేశంలో ఈ ప్రవాసం ఆహ్లాదాన్ని ప్రసాదించాల‌ంటూ ప్ర‌ధాన మంత్రి ఆకాంక్షించారు.