Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డీజీపీ ల స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

డీజీపీ ల స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

డీజీపీ ల స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


క‌చ్ లోని ధోర్ దో లో గ‌త మూడు రోజులుగా జ‌రిగిన పోలీస్ డైరెక్ట‌ర్స్ జ‌న‌ర‌ల్ (డీజీపీ ల) స‌మావేశం ఈ రోజుతో ముగిసింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముగింపు ఉప‌న్యాసం ఇచ్చారు.

స‌మావేశాల సంద‌ర్భంగా నాణ్య‌మైన‌, కూలంక‌ష చ‌ర్చ‌లు చోటు చేసుకోవ‌డం తాను గ‌మ‌నించానంటూ ప్ర‌ధాని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామం పోలీసు ద‌ళానికి ఉన్న అంకిత భావాన్ని, వృత్తిప‌ర‌మైన సామ‌ర్థ్యాన్ని సూచిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ఈ స‌మావేశం నుంచి వ‌చ్చిన సిఫార‌సుల‌ను అమ‌లుప‌ర‌చ‌డానికి ఒక స్ప‌ష్ట‌మైన మార్గ‌సూచిని రూపొందించ‌వ‌ల‌సిందిగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ స‌మావేశానికి హాజ‌రైన జూనియ‌ర్‌ అధికారులు, సీనియ‌ర్ అధికారులు వారి వారి స‌ల‌హాలు, అభిప్రా‌యాలు వెల్ల‌డించ‌గ‌లిగార‌ని, త‌త్ఫ‌లితంగా వారి మ‌ధ్య ఎటువంటి అడ్డుగోడ‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఛేదించ‌డం సాధ్య‌ప‌డింద‌ని, ఇది చెప్పుకోద‌గిన విజ‌య‌మ‌ని ప్ర‌ధాని అన్నారు.

పోలీసుల విధినిర్వ‌హ‌ణ‌లో సూక్ష్మ‌గ్రాహ్య‌త అతి ముఖ్య‌మైన అంశ‌మ‌ని, సంస్థాగ‌తంగా స‌ర‌ళ‌మైన విధివిధానాల స్వ‌రూపాన్ని నిర్దేశించుకోవాల‌ని, ఇది పౌరుల ప‌ట్ల స‌రి అయిన బాధ్య‌త పోలీసు బ‌ల‌గాల‌లో ఏర్ప‌డేందుకు దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌ద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు. స్థానిక ప్ర‌జ‌ల‌‌తో పోలీసు బ‌ల‌గాలు సంబంధాల‌ను నెల‌కొల్పుకోవాల‌ని, క‌మ్యూనిటీలో సాధించిన‌ విజ‌యాల‌ను వేడుక‌గా జ‌రుపుకోవ‌డం దీనికి ఒక మార్గ‌మ‌ని తెలిపారు.

పోలీస్ స్టేషన్ లకు ప్రజలు విచ్చేసిన‌పుడు పోలీస్ అధికారులు చేసిన కృషి ప‌ట్ల వారు కూడా గౌర‌వాన్ని పెంచుకొని, ఒక గొప్ప అవ‌గాహ‌న‌ను ఏర్ప‌రుచుకొంటార‌ని ప్ర‌ధాని చెప్పారు. ఏదైనా క‌మ్యూనిటీలోని ప్ర‌జ‌లు పోలీస్ స్టేషన్ లతో తమను తాము పోల్చుకోవాలని ప్రధాని అన్నారు.

సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతిక విజ్ఞానం, సాంఘిక స‌మాచార ప్ర‌సార సాధ‌నాల (సోషల్ మీడియా) వంటి అంశాల‌ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. పోలీసు అధికారులు త‌మ ప‌నిలో నూత‌న సాంకేతిక విజ్ఞానాల‌ను ఉప‌యోగించుకోవాలని ప్ర‌ధాని సూచించారు. అంత‌ర్ రాష్ట్ర స‌రిహ‌ద్దుల వెంబ‌డి ఉండే ఇరుగు పొరుగు జిల్లాల పోలీస్ బ‌ల‌గాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర‌ ప్ర‌భావ‌శీల చ‌ర్య‌లు మ‌రిన్ని చోటు చేసుకొంటూ ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

టూరిజం పోలీసింగ్‌, విప‌త్తుల వేళ‌ల‌లో తీసుకోద‌గిన చ‌ర్య‌లు, పోలీసుల శిక్ష‌ణ విష‌యాల‌పైన కూడా ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

పోలీస్ అధికారులు నిస్వార్థంగా అందించే సేవ‌లను, కనబరిచే అంకిత‌భావాన్ని, విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల వారి చిత్త‌శుద్ధిని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. మన దేశ భ‌ద్ర‌త స్వభావం ఇదే అని ఆయ‌న అన్నారు.
విశిష్ట సేవలు చేసిన ఐబీ అధికారుల‌కు రాష్ట్రప‌తి ప‌త‌కాల‌ను ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌దానం చేశారు. అంత‌ క్రితం, స‌మావేశానికి హాజ‌రైన ప్ర‌తినిధులు పోలీస్ విశ్వ‌విద్యాలయాలు, న్యాయ సంబంధి శాస్త్రవిజ్ఞాన (ఫోరెన్సిక్‌ సైన్స్ ) విశ్వ‌విద్యాల‌యం అంశాల‌ను గురించి చ‌ర్చించారు.

ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ కిరెన్ రిజిజూ, శ్రీ హరిభాయ్ పార్థీభాయ్ చౌదరి లు పాల్గొన్నారు.