వస్తువులు మరియు సేవల పన్ను నెట్ వర్క్ (జిఎస్టిఎన్)లో ప్రభుత్వ యాజమాన్యాన్ని పెంచేందుకు మరియు ప్రస్తుత స్వరూపం లో ఈ దిగువ పేర్కొన్న విధంగా సంధి కాల ప్రణాళిక తో కూడినటువంటి మార్పు ను తీసుకు వచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
జిఎస్టిఎన్ లో ప్రభుత్వేతర సంస్థల చేతిలో ఉన్న యావత్తు 51 శాతం ఎక్విటీ ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సరి సమానంగా కొనుగోలు చేయడం తో పాటు ప్రైవేటు కంపెనీల చేతి లో ఉన్న ఎక్విటీ ని కొనుగోలు చేసే ప్రక్రియ ను మొదలుపెట్టేందుకు జిఎస్టిఎన్ బోర్డు ను అనుమతించడం.
వంద శాతం ప్రభుత్వ యాజమాన్యం లోని పునర్ వ్యవస్థీకరించబడే జిఎస్టిఎన్ లో కేంద్రం (50 శాతం) మరియు రాష్ట్రాలు (50 శాతం) ఎక్విటీ ని కలిగివుండాలి.
జిఎస్టిఎన్ బోర్డు ప్రస్తుత స్వరూపం లో మార్పునకు అనుమతిని ఇవ్వడం; ఇందులో కేంద్రం నుండి మరియు రాష్ట్రాల నుండి ముగ్గురేసి డైరెక్టర్లను చేర్చుకోవడం తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ డైరెక్టర్ల ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నామినేట్ చేస్తారు; ఒక ఛైర్మన్ ను మరియు సిఇఒ ను కూడా నియమించవలసివుంటుంది; అంటే డైరెక్టర్ల మొత్తం సంఖ్య 11 కు చేర్చాలి.