Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలో ‘‘స్వచ్ఛతే సేవ’’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పాఠశాలలో శ్రమదానం చేసిన ప్రధానమంత్రి

ఢిల్లీలో ‘‘స్వచ్ఛతే సేవ’’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా
ఓ పాఠశాలలో శ్రమదానం చేసిన ప్రధానమంత్రి

ఢిల్లీలో ‘‘స్వచ్ఛతే సేవ’’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా
ఓ పాఠశాలలో శ్రమదానం చేసిన ప్రధానమంత్రి

ఢిల్లీలో ‘‘స్వచ్ఛతే సేవ’’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా
ఓ పాఠశాలలో శ్రమదానం చేసిన ప్రధానమంత్రి


 

‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలోని ఓ పాఠశాలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రమదానం చేశారు. ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 17 ప్రాంతాల్లోని ప్రజలతో ముచ్చటించిన అనంతరం మధ్య ఢిల్లీలోని రాణి ఝాన్సీ రోడ్డులోగల బాబాసాహెబ్ అంబేద్కర్ హయ్యర్ సెకండరీ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌కు పుష్పాంజ‌లి ఘ‌టించిన త‌ర్వాత‌ పరిశుభ్రత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అటుపైన విద్యార్థులతో కాసేపు ముచ్చటించి స్వచ్ఛత ఉద్యమం దిశగా వారిలో ఉత్తేజం నింపారు. ఈ పాఠశాలకు వెళ్లివచ్చిన సమయంలో ప్రధానమంత్రి నిర్దేశిత అధికారిక భద్రత నిబంధనలకు దూరంగా సాధారణ వాహనాల నడుమ ప్రయాణించడం విశేషం. ఆయన సందర్శన కోసం ఎలాంటి ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చేయకపోవడం గమనార్హం. కాగా- షెడ్యూల్డ్ కులాల ప్రజల విద్యా, సామాజిక-ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా 1946లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పాఠశాల ప్రాంగణాన్ని కొనుగోలు చేయడం విశేషం.

*****