Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆశా, ఎఎన్ఎమ్, ఇంకా ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల తో వీడియో మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


దేశ‌ వ్యాప్తంగా ఉన్న ఎఎస్‌హెచ్ఎ (‘ఆశా’) కార్య‌క‌ర్త‌లు, ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు, మ‌రియు ఎఎన్ఎమ్ (ఆగ్జిల్యరి నర్స్ మిడ్ వైఫ్) లతో ప్ర‌ధాన మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు.  ఆరోగ్య సంబంధ సేవలను మ‌రియు పోష‌కాహార సంబంధిత సేవ‌ల‌ను మెరుగు ప‌ర‌చ‌డం తో పాటు దేశం లో ఆహార లోపం వల్ల శుష్కించడాన్ని త‌గ్గించాల‌న్న ‘పోష‌ణ్ అభియాన్’ యొక్క ల‌క్ష్యాన్ని సాధించ‌డం కోసం క‌ల‌సిక‌ట్టుగా కృషి చేయాల‌నే వారి ప్ర‌య‌త్నాల‌ను కొత్త కొత్త సాధనాల‌ను మరియు సాంకేతిక విజ్ఞానాన్ని,వినియోగించుకొంటుండడాన్ని ఆయ‌న మెచ్చుకొన్నారు.

అట్ట‌డుగు స్థాయి లో విధులను నిర్వ‌హిస్తున్న స్వాస్థ్య కార్య‌క‌ర్త‌ల స‌హ‌కారాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తించారు.  అంతేకాక బ‌ల‌మైన మ‌రియు ఆరోగ్య‌వంత‌మైన జాతి ని నిర్మించ‌డం కోసం వారు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు గాను వారికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.  ఈ నెల‌ లో పాటిస్తున్న ‘‘పోష‌ణ్ మాహ్’’లో భాగంగా ఈ ముఖాముఖి స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం జ‌రిగింది.  పోష‌కాహారం ఆవ‌శ్య‌క‌త తాలూకు సందేశాన్ని ప్ర‌తి ఒక్క కుటుంబానికి అందించాల‌నే ధ్యేయం తో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌డ‌మైంది.

నేశ‌న‌ల్ న్యూట్రిశన్ మిశన్ యొక్క ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాన మంత్రి నొక్కిపలుకుతూ, రాజస్థాన్ లోని ఝుంఝును నుండి ప్రారంభించిన‌టువంటి ‘పోష‌ణ్ అభియాన్’ యొక్క ధ్యేయ‌ం శారీరిక ఎదుగుద‌ల స్తంభ‌న‌, పాండురోగం, పోష‌కాహార లోపం మ‌రియు త‌క్కువ శారీరిక బ‌రువు తో శిశు జ‌న‌నాల వంటి స‌మ‌స్య‌ ల‌ను ప‌రిష్క‌రించ‌డ‌మే అని వివరించారు.  మ‌హిళ‌ల‌ను, బాల‌ల‌ను గ‌రిష్ట సంఖ్య‌ లో ఈ ఉద్య‌మం లోకి తీసుకు రావ‌డం అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌ని కూడా ఆయ‌న తెలిపారు.

పోష‌కాహారానికి, నాణ్యమైన స్వాస్థ్య సంర‌క్ష‌ణ కు సంబంధించిన అంశాల‌పైన ప్రభుత్వం శ్ర‌ద్ధ తీసుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  టీకాల ను ఇప్పించే కార్య‌క్ర‌మం శ‌ర వేగంగా పురోగ‌మిస్తోంద‌ని, మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు, బాల‌ల‌కు దీని ద్వారా స‌హాయం అందించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న వివ‌రించారు.

దేశ‌ వ్యాప్తంగా ఉన్న‌టువంటి స్వాస్థ్య కార్య‌క‌ర్త‌లు, ల‌బ్ధిదారులు వారి యొక్క అనుభ‌వాల‌ను ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షం లో వెల్ల‌డించారు.  మిశ‌న్ ఇంద్ర‌ధ‌నుష్ ప‌టిష్ట‌మైన రీతిలో అమ‌లు కావ‌డం కోసం మూడు ‘ఎ’ లు-  ఎఎస్‌హెచ్ఎ (‘ఆశా’) కార్యకర్తలు, ఎఎన్ఎమ్ లు, ఇంకా ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలను మరియు వారి అంకిత భావాన్ని ప్ర‌ధాన మంత్రి ప్రశంసించారు.  ఇంత‌వ‌ర‌కు 3 ల‌క్ష‌ల మందికి పైగా గ‌ర్భ‌వ‌తుల‌ తో పాటు 85 కోట్ల మంది బాల‌ల‌ కు టీకా మందును ఇప్పించ‌డం జ‌రిగింది. 

‘సుర‌క్షిత్ మాతృత్వ అభియాన్’ను గురించిన స‌మాచారాన్ని వ్యాప్తి చేయ‌వ‌ల‌సిందిగా ప్ర‌ధాన మంత్రి ఈ సంభాష‌ణ క్ర‌మం లో విజ్ఞ‌ప్తి చేశారు.

అప్పుడే పుట్టిన పిల్ల‌ల‌కు సంర‌క్ష‌ణ ను అందించే కార్య‌క్ర‌మం ఏటా దేశం లో 1.25 మిలియ‌న్ బాల‌ల‌కు ల‌బ్ది ని చేకూర్చుతూ సఫలం కావ‌డాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి పొగడారు.  ఈ ప‌థ‌కానికి ‘గృహ ఆధారిత బాల‌ల సంర‌క్ష‌ణ’ అనే కొత్త పేరు ను పెట్ట‌డ‌మైంది.  ఇందులో భాగంగా ఆశా కార్య‌క‌ర్త ఇదివ‌ర‌కు  (శిశు) జ‌న‌నం అనంత‌రం తొలి 42 రోజులలో 6 సార్లు సంద‌ర్శిస్తుండ‌గా ఇక  తొలి 15 నెలల పాటు 11 సార్లు శిశువు యొక్క యోగక్షేమాలను తెలుసుకోవలసివుంటుందని ప్రధాన మంత్రి అన్నారు.

ఆరోగ్యానికి, దేశ వృద్ధికి మ‌ధ్య వుండే లంకె ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.  దేశంలో బాల‌లు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్పుడు ఆ దేశ వృద్ధి సైతం త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు.  ఏ శిశువుకైనా మొద‌టి వేయి రోజుల జీవ‌నం ఎంతో కీల‌కంగా ఉంటుంది.  పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారం, నియతాహార‌పు అల‌వాట్లు అనేవి శిశువు యొక్క శ‌రీరం ఏ విధంగా ఉంటుంద‌నేది, చ‌ద‌వడం లోను, వ్రాయ‌డం లోను మ‌రి అలాగే మాన‌సికం గాను ఆ శిశువు ఎంత బ‌లంగా ఉంటుంద‌నేది నిర్ణ‌యిస్తాయి.  దేశ పౌరుడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ దేశం అభివృద్ధి చెంద‌కుండా ఏ ఒక్క‌రూ ఆపలేరు.  ఈ కార‌ణంగా ప్రారంభిక స‌హ‌స్ర దినాల లో దేశం యొక్క భ‌విష్య‌త్తు భ‌ద్రం గా ఉండేటట్టు ఒక దృఢ‌మైన యంత్రాంగాన్ని అభివృద్ధి ప‌ర‌చేందుకు కృషి జ‌రుగుతోంది.

డ‌బ్ల్యుహెచ్ఒ నివేదిక ప్ర‌కారం ‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్’ లో భాగంగా శౌచాల‌యాల ఉప‌యోగం 3 ల‌క్ష‌ల మంది పౌరుల జీవనాన్ని కాపాడే స‌త్తాను క‌లిగివుందనేది గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం గా ఉంది.  ప‌రిశుభ్ర‌త దిశ‌ గా సాటి పౌరులలో వ్యక్తమైన అంకిత భావాన్ని ప్ర‌ధాన మంత్రి మ‌రొక్క‌మారు కొనియాడారు.

‘ఆయుష్మాన్ భార‌త్’ ప్ర‌థ‌మ ల‌బ్దిదారు చిరంజీవి క‌రిష్మ‌ ను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  చిరంజీవి క‌రిష్మ ‘ఆయుష్మాన్ పాపాయి’ గా కూడా పేరెన్నిక గన్నారు.  ఆ చిన్నారి ఈ నెల 23వ తేదీ నాడు రాంచీ లో ప్రారంభం కానున్న ‘ఆయుష్మాన్ భార‌త్’ ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌బోతున్న 10 కోట్ల కు పైగా కుటుంబాల‌కు ఒక ఆశా సంకేతం గా మారార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 

ఆశా కార్య‌క‌ర్త‌ల కు సాధార‌ణంగా ఇస్తున్న‌టువంటి ప్రోత్సాహ‌కాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం రెట్టింపు చేసిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు.  దీనికి తోడు ఆశా కార్య‌క‌ర్త‌లంద‌రికీ, వారి స‌హాయ‌కుల‌కు ‘ప్ర‌ధాన మంత్రి జీవ‌న జ్యోతి బీమా యోజ‌న‌’, ఇంకా ‘ప్రైమ్ మినిస్ట‌ర్ సుర‌క్ష బీమా యోజ‌న’ ల‌లో భాగం గా ఉచిత బీమా ర‌క్ష‌ణ‌ ను కూడా అందించ‌నున్నారు.

ఆంగ‌న్‌ వాడీ కార్య‌క‌ర్త‌ ల‌కు ఇచ్చే గౌర‌వ వేతనం లో సైతం గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు.  ఇంత‌వ‌ర‌కు 3000 రూపాయలు అందుకొంటున్న‌ వారు ఇక మీద‌ట 4,500 రూపాయ‌లు అందుకోనున్నారు.  ఇదే మాదిరి గా 2200 రూపాయ‌లు అందుకొంటున్న‌వారంతా ఇప్పుడు 3500 రూపాయ‌లు అందుకోనున్నారు.  ఆంగ‌న్ వాడీ స‌హాయ‌కుల‌కు కూడా వారి గౌర‌వ భృతి ని 1500 రూపాయ‌ల నుండి 2250 రూపాయ‌ల‌కు పెంచ‌డ‌మైంది.

**