Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ కుల‌దీప్ న‌య్య‌ర్ క‌న్నుమూత‌ ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


చిరకాలానుభవం కలిగిన ప‌త్రికార‌చ‌యిత‌, రాజ్య స‌భ పూర్వ స‌భ్యుడు శ్రీ కుల‌దీప్ న‌య్య‌ర్ క‌న్నుమూత ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

“కుల‌దీప్ న‌య్య‌ర్ గారు మ‌నమెరిగిన ప్రముఖ మేధావులలో ఒకరు. ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను నిర్మొహ‌మాటం గా, నిర్భ‌యం గా వెలిబుచ్చే వారు. ఆయ‌న ర‌చ‌న‌లు ప‌లు ద‌శాబ్దాల పాటు విస్తరించి వున్నాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ని వ్యతిరేకిస్తూ ఆయ‌న అవ‌లంబించినటువంటి దృఢమైన వైఖ‌రి, ఆయ‌న చేసిన ప్ర‌జాసేవ, ఒక ఉత్త‌మ భార‌త‌దేశం కోసమై ఆయ‌న క‌న‌బ‌ర‌చినటువంటి నిబ‌ద్ధ‌త క‌ల‌కాలమూ గుర్తుండిపోతాయి. ఆయ‌న మ‌ర‌ణం తో దుఃఖితుడినయ్యాను. ఆయన కు ఇదే నా సంతాపం’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

***