Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేతాజీ ద‌స్త్రాల‌ బ‌హిర్గ‌తం దిశ‌గా ముఖ్య‌మైన మైలురాయి

నేతాజీ ద‌స్త్రాల‌ బ‌హిర్గ‌తం దిశ‌గా ముఖ్య‌మైన మైలురాయి


నేతాజీకి చెందిన తొలి విడ‌త ద‌స్ర్తాల‌ను భార‌త జాతీయ ప్రాచీన గ్రంథాల‌యం (నేష‌న‌ల్ ఆర్కైవ్ స్ ఆఫ్ ఇండియా) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌కు ప్ర‌ధాని ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి శ్రీ నృపేంద్ర మిశ్రా ఈ రోజు అధికారికంగా అప్ప‌గించారు. దీంతో 23 జ‌న‌వ‌రి, 2016 నుంచి ఆరంభమ‌య్యే ఈ ద‌స్ర్తాల వెల్ల‌డికి ఇక రంగం సిద్ధం అవుతున్న‌ట్లే.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బంధువుల‌ను అక్టోబ‌రు 14, 2015 నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న అధికారిక నివాస భ‌వ‌నం లోప‌లికి సాద‌రంగాను, స‌గ‌ర్వంగాను ఆహ్వానించారు. ఈ ప‌ని చేస్తున్న తొలి ప్ర‌ధానిని తానే కావ‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు వారికి ఆయ‌న తెలియ‌జేశారు. ఇదే సంద‌ర్భంగా వారు త‌న వ‌ద్ద వ్య‌క్తం చేసిన అభిప్రాయాలను, ఆకాంక్ష‌లను తాను, త‌న ప్ర‌భుత్వం పూర్తిగా పంచుకుంటున్న‌ట్లు కూడా వారికి ప్ర‌ధాని హామీ ఇచ్చారు.

సొంత చరిత్రను విస్మ‌రించిన వారి వ‌ల్ల చ‌రిత్ర రూపుదిద్దుకోదు అని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా అన్నారు. చ‌రిత్ర‌ను నిర్బంధించ‌డంలో గాని, లేదా ఊపిరి స‌ల‌ప‌కుండా గొంతు నుల‌మ‌టంలో గాని త‌మ ప్ర‌భుత్వానికి విశ్వాసం లేద‌ని, నేతాజీ కి సంబంధించిన స‌మాచారాన్ని భార‌త‌దేశ ప్ర‌జ‌ల ముందు తెర‌చి ఉంచ‌డానికి త‌మ స‌ర్కారు క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. నేతాజీకి చెందిన ద‌స్త్రాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డి చేయ‌డంతో పాటు ఇదే అంశంపై ఇత‌ర దేశాల‌తో అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి కూడా శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని నేతాజీ కుటుంబానికి ఆయ‌న హామీనిచ్చారు. నేతాజీ జ‌యంతి రోజైన 23 జ‌న‌వ‌రి, 2016 న ఫైళ్లను బ‌హిరంగంగా విడుద‌ల చేయ‌డం జ‌రుగుతుంద‌ని కూడా ఆయ‌న వారికి వాగ్దానం చేశారు.

ఈ వాగ్దానాన్ని నిల‌బెట్టుకొనే క్ర‌మంలో ప్ర‌భుత్వం ర‌హ‌స్య ప‌త్రాల వెల్ల‌డికి సంబంధించిన విధి విధానాల‌ను, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది.

ఇదే ప‌నిలో భాగంగా, తొలి ద‌ఫాలో 33 పీఎమ్ఓ ఫైళ్ల‌ను ప‌రిష్క‌రించి, త‌దుప‌రి ఘ‌ట్టం ప‌రిశీల‌న‌కు గాను ఈ రోజు భార‌త జాతీయ ప్రాచీన గ్రంథాల‌యానికి స్వాధీనం చేశారు. భార‌త జాతీయ ప్రాచీన గ్రంథాల‌యం వీటిని ప‌దిల‌ప‌ర‌చి, డిజిట‌లీక‌రిస్తుంది. అలాగే, పీఎమ్ఓ లోని 58 ఫైళ్ల‌లో ప్రతి ఒక్కదానిని కూడా తుది విడుద‌ల కోసం సిద్ధంగా ఉంచుతుంది. మ‌రో ప‌క్క‌, హోం వ్య‌వ‌హారాల శాఖ‌, విదేశ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌లు త‌మ అధీనంలోని ఫైళ్ల విడుద‌ల‌కు సంబంధించిన చ‌ర్య‌ల‌ను వేటిక‌వే చేప‌డుతున్నాయి.

ఇది నేతాజీకి సంబంధించిన ఫైళ్ల‌ను గోప‌నీయ‌త నుంచి బ‌హిర్గ‌తం చేయాల‌న్న‌ భార‌త ప్ర‌జ‌ల చిర‌కాల డిమాండును నెర‌వేర్చే దిశ‌గా వేసిన ముఖ్య‌మైన ముంద‌డుగు అని చెప్పాలి.