Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా, బంగ్లాదేశ్ ల మ‌ధ్య‌ ఎంక్లేవ్ ల బ‌దిలీ పున‌రావాసం, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప్యాకేజికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం


ఇండియా, బంగ్లాదేశ్ లకు చెందిన ప్రజలు ఇరు దేశాల‌ స‌రిహ‌ద్దుల్లో ప‌లు ప్రాంతాల్లో నివ‌సిస్తున్నారు. ఈ ప్రాంతాల‌ను ఎంక్లేవ్ ల‌ని పిలుస్తారు. ఇండియా భూభాగంలో బంగ్లాదేశీయులు, బంగ్లాదేశ్ భూభాగంలో భార‌తీయులు నివ‌సిస్తున్నారు. ఈ ఇరువురు ఎవ‌రి దేశాల్లో వారు ఉండేలాగా ఉభ‌య‌ దేశాలు చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన పున‌రావాస ప్యాకేజీకి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్ బిహార్ జిల్లాలోని, ఇండియాలోని బంగ్లాదేశీ ఎంక్లేవ్ ల మౌలిక‌ వ‌స‌తుల అభివృద్ధి, పున‌రావాసానికి నిధుల‌ను వెచ్చిస్తారు.

దీనికి సంబంధించిన వివిధ కార్య‌క్ర‌మాల అమ‌లుకు అయ్యే ఖ‌ర్చు 1,005.99 కోట్ల రూపాయ‌లు. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్ బిహార్ జిల్లాలోను, ఇండియాలోను ఉన్న‌ బంగ్లాదేశ్ ఎంక్లేవ్ ల‌లో మౌలిక వ‌స‌తుల ఏర్పాటు, మౌలిక వ‌స‌తుల బ‌లోపేతానికి అయ్యే నిర్ణీత ఖ‌ర్చు 898.50 కోట్ల రూపాయ‌ల్నిఈ నిధుల‌ నుంచే తీసుకుంటారు. పున‌రావాసానికి అటూ ఇటూగా 107.49 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉంది. వాస్త‌వంగా ఇండియాకు తిరిగి వ‌చ్చే కుటుంబాల సంఖ్య మీద ఈ మొత్తం ఆధార‌ప‌డి ఉంటుంది.

దీనికి సంబంధించిన అన్ని ప‌నుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం గానీ లేదా దానికి సంబంధించిన ఇత‌ర సంస్థ‌లు గానీ 3- 4 సంవ‌త్స‌రాల కాల ప‌రిమితిలో పూర్తి చేస్తాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిధుల‌ను గ్రాంటుగా విడుద‌ల చేస్తుంది.

ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వాన్నుంచి వ‌చ్చిన రెండు ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు కేంద్ర ప్రభుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టింది. బంగ్లాదేశ్‌, ఇండియాల మ‌ధ్య‌ ఎంక్లేవ్ ల బదిలీ త‌ర్వాత బంగ్లాదేశీ ఎంక్లేవ్ లలోను, కూచ్ బిహార్ జిల్లాలోను పునరావాస ప్యాకేజిని అమ‌లు చేయాల‌ని, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కార్య‌క్ర‌మాని చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది..

మౌలిక వ‌సతుల అభివృద్ధి, పున‌రావాస స‌హాయంలాంటి పున‌రావాస చ‌ర్య‌ల వ‌ల్ల ఇరు దేశాల ప్రాంతాల‌, ప్ర‌జ‌ల క‌ల‌యిక ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సులువుగా కొన‌సాగుతుంది.