Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“मैं नि:शब्द हूं, शून्य में हूं, लेकिन भावनाओं का ज्वार उमड़ रहा है। हम सभी के श्रद्धेय अटल जी हमारे बीच नहीं रहे। अपने जीवन का प्रत्येक पल उन्होंने राष्ट्र को समर्पित कर दिया था। उनका जाना, एक युग का अंत है।

लेकिन वो हमें कहकर गए हैं- “मौत की उमर क्या है? दो पल भी नहीं, ज़िन्दगी सिलसिला, आज कल की नहीं मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊँगा, कूच से क्यों डरूं?”

अटल जी आज हमारे बीच में नहीं रहे, लेकिन उनकी प्रेरणा, उनका मार्गदर्शन, हर भारतीय को, हर भाजपा कार्यकर्ता को हमेशा मिलता रहेगा। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और उनके हर स्नेही को ये दुःख सहन करने की शक्ति दे। ओम शांति !

మ‌న ప్రియ‌త‌మ అట‌ల్ గారి మ‌ర‌ణం తో భార‌త‌దేశం శోకం లో మునిగిపోయింది.  ఆయ‌న క‌న్నుమూత ఒక యుగాంతాన్ని సూచిస్తోంది.  ఆయ‌న దేశం కోసం జీవించారు;  అంతేకాక దేశానికి ద‌శాబ్దాల త‌ర‌బ‌డి శ్ర‌ద్ధా పూర్వ‌కంగా సేవలందించారు.  ఈ దు:ఖదాయక ఘడియలలో ఆయ‌న కుటుంబం, బిజెపి కార్య‌క‌ర్త‌లు మ‌రియు ల‌క్ష‌లాది ప్ర‌శంస‌కుల‌ బాధ లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఓం శాంతి.

భార‌త‌దేశానికి 21వ శ‌తాబ్దం లో ఒక శ‌క్తివంత‌మైన, స‌మృద్ధ‌మైన, ఇంకా స‌మ్మిళిత‌మైన  పునాదుల‌ను వేసింది అట‌ల్ గారి మార్గ‌ద‌ర్శ‌క నాయ‌క‌త్వ‌మే.  వివిధ రంగాల‌లో భ‌విష్య‌త్తు ను ద‌ర్శించినటువంటి ఆయ‌న యొక్క విధానాలు భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క పౌరుడి జీవితాన్ని స్ప‌ర్శించాయి.  

అట‌ల్ గారి మృతి వ్య‌క్తిగ‌తంగా నాకు భ‌ర్తీ చేయ‌లేన‌టువంటి న‌ష్టాన్ని మిగిల్చింది.  ఆయ‌న తో నాకు అసంఖ్యాక‌మైన, ఆప్యాయ‌మైన జ్ఞాప‌కాలు ఉన్నాయి.  నా వంటి కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌నే ప్రేర‌ణ‌గా నిలచారు.  ఆయ‌న‌కు ఉన్న‌టువంటి నిశిత ప్రతిభ మ‌రియు అసాధార‌ణ‌మైనటువంటి వాక్చాతుర్యాన్ని నేను మ‌రీ ముఖ్యంగా జ్ఞాప‌కం పెట్టుకొంటాను.

అట‌ల్ గారి నిరంతర శ్రమ, ఇంకా సంఘ‌ర్ష‌ణ‌ ల కార‌ణంగానే ఒక్కొక్క ఇటుకను పేర్చుకొంటూ బిజెపి రూపు దాల్చింది.  బిజెపి యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయ‌డం కోసం భార‌త‌దేశం మూల‌ మూల‌కూ ఆయ‌న ప్ర‌యాణించారు.  ఇది మ‌న దేశ రాజ‌కీయాల‌లో మ‌రియు అనేక రాష్ట్రాల‌లో బిజెపి ఒక బ‌ల‌మైన శ‌క్తి గా మార‌డం లో తోడ్పడింది” అంటూ ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ లో ఒక పరంపరగా రాసిన వాక్యాల ద్వారా త‌న మ‌నోభావాల‌ను వ్యక్తం చేశారు.

అంత‌క్రితం న్యూ ఢిల్లీ లోని అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ ను విడుద‌ల చేస్తూ, పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ సాయంత్రం 5 గంట‌ల 5 నిమిషాల‌కు తుది శ్వాస‌ ను విడిచార‌ని అందులో తెలియ‌ జేసింది.

**