ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా, అత్యవసరంగా స్పందించాలి. ఈ శిఖరాగ్ర సమావేశంలో సమగ్రమైన, ఎలాంటి వివక్షకు తావు లేని, దీర్ఘకాలిక ఒప్పందం చేసుకొని మానవాళికి, ప్రకృతికి మధ్యగల సమన్వయాన్ని తిరిగి నెలకొల్పాలి. మన వారసత్వానికి, మనం నెలకొల్పబోయే వారసత్వానికి మధ్యన కూడా సమన్వయం ఏర్పరుచుకునేలా ఈ ఒప్పందం ఉండాలి. ఇప్పటికే అన్ని విధాలా అభివృధ్ది చెందిన దేశాలు, అన్ని సౌకర్యాలున్న దేశాలు, సాంకేతికంగా సామర్థ్యమున్న దేశాలు ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొని, కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని మరీ తమ కర్బన ఉద్గారాల స్థాయిని గణనీయంగా తగ్గించాలి.
వారు చూపే నిబద్ధత, వారు చేపట్టబోయే కార్యాచరణ వారు ఇంతకాలం వాతావరణంలోకి వదులుతున్న కర్బన స్థాయిలకు అనుగుణంగా ఉండాలి.
అభివృధ్ధి చెందుతున్న దేశాలు త్వరగా వృద్ధి చెందడానికి వీలుగా వారికి కేటాయించిన కర్బన స్థాయిలను తగ్గించే ప్రయత్నాన్ని అభివృద్ది చెందిన దేశాలు చేయకూడదు.
స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో అన్ని విధాలా ముందున్న దేశాలు తమ సాంకేతికతను, వనరులను ఇతర దేశాలు వినియోగించుకునేలా సహాయం చేయాలి. అప్పుడే ఈ విషయంలో ప్రపంచ ఆకాంక్షను అందుకోగలం.
అభివృద్ది చెందుతున్న దేశాలు కూడా బొగ్గు పులుసు వాయువు ఉద్గారాలను వదలడాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ అదే సమయంలో అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఉండాలి.
ప్రపంచమంతా ఏకతాటిపై నిలవాలంటే అన్ని దేశాలు కర్బన ఉద్గార సమస్యల పరిష్కారంపైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. అందుకనుగుణంగా కృషి జరిగితేనే, అందరం విజయం సాధించగలమనే పరిస్థితులుంటేనే ఈ శిఖరాగ్ర సమావేశం లక్ష్యాన్ని చేరుకోగలం.
ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నాననంటే మన ముందున్న సవాళ్లు తీవ్రమైనవి, వాటిని ఎదుర్కోవడానికి అత్యవసరంగా, వేగంగా కృషి చేయాల్సిన తరుణమిది.
స్నేహితులారా,
నేను ప్రస్తావించిన ఈ అంశాలపైన ఈ సమావేశాల్లో అనేక చర్చలు జరుగుతాయి.
ఇక్కడ ఈ ఇండియన్ పెవిలియన్ దగ్గర మీ దగ్గర ప్రస్తావించాల్సిన అంశం మరొకటుంది. నేను ప్రపంచాన్ని ఉద్దేశించి మాత్రమే చెప్పడం లేదు. మన దేశ ప్రజలను ఉద్దేశించి కూడా నేను మాట్లాడుతున్నాను. అభివృద్ధి సాధన అనేది మనం తప్పకుండా చేరుకోవాల్సిన లక్ష్యం. అది మన ప్రజల హక్కు. అయితే ఒక జాతిగా మనం కూడా వాతావరణ మార్పుపైన చేసే యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించాలి.
స్వచ్ఛమైన నీరు, నదులు, ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొనే వ్యవసాయక్షేత్రాలు, ఆరోగ్యకరమైన అలవాట్లు..వృక్షాలు, జంతుజాలంతో నిండుగా ఉండే అడవులు…ఇవన్నీ మన ప్రజలకు కూడా కావాలి.
కేవలం అధిక ఆదాయాలు పొందే లక్ష్యమే కాదు..నాణ్యమైన జీవన ప్రమాణాలు పొందాలనే బలమైన నమ్మకం ఉన్నప్పుడే మనం వాతావరణ మార్పులను ఎదుర్కోగలం.
అంతే కాదు ప్రపంచం పట్ల మనకున్న నిబద్ధత నుంచి ఈ పోరాటం జనించాలి.
అంతే కాదు వేలాది సంవత్సరాలుగా మన దేశంలోని సంప్రదాయాలు, నమ్మకాల నుంచి మన పోరాటం పుట్టాలి.
ప్రజలు ఎన్నుకునే మార్గాలు..వారి సంస్కృతి, నమ్మకాల ద్వారా రూపొందుతాయి.
భారతదేశంలో ఎప్పటినుంచో ప్రకృతిని మాతృమూర్తిగా భావించే సంప్రదాయం ఉంది.
పురాతన కాలంనుంచి మనం మానవాళిని ప్రకృతిలో భాగంగానే చూశాం తప్ప ప్రకృతికంటే మానవాళే గొప్పదని ఎప్పుడూ భావించలేదు. ప్రకృతిలోని వివిధ రూపాల్లో దైవత్వాన్ని మనం చూశాం.
మానవాళికోసం ప్రకృతి లేదనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ నమ్మాము. అంతే కాదు ప్రకృతి లేకపోతే మనం ఒక క్షణం కూడా మనుగడ సాగించలేము. కాబట్టి ప్రకృతి అనేది మనల్ని పోషించే మాతృమూర్తి. అంతే తప్ప దోచుకోవడానికి ఉపయోగపడేది కాదు.
ప్రకృతిలో అన్ని శక్తులు సమన్వయంతో ఉన్నప్పుడే…ఈ ప్రపంచంలో మన జీవితాలు సమన్వయంతో ఉంటాయి.
ఇదే విషయాన్ని మనం రుగ్వేదంలో క్షేత్రపతి సూక్త ద్వారా నేర్చుకోవచ్చు.
క్షేత్రస్య పతె మధుమంత్‌మూర్మీ ధేనురివ్ పయో అస్మాసు ధ్రుక్ష్వ్!
మధుశ్‌చుతమ్ ఘ‌్రుత్‌మివ్ సుపూత్ మ్రుతస్ య న: పతయో మ్రుళయంతు!!
దీని అర్థం..
పృథ్విని పాలించే ఓ దేవుడా, గోవు నుంచి క్షీరాన్ని తీసినట్టుగా ప్రకృతి మాత ఆశీర్వచనాల మధుర తరంగాల సాయంతో క్షేత్రాలను పాలించు
ప్రకృతి మాత ఔదార్యం మాధుర్యమనేదీ, స్వచ్ఛమైన వెన్నలాంటిదీ.. దాని సాయంతో మీరు మమ్మల్ని కనికరించాలి.
భూగోళాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆచరించాల్సిన బాధ్యతని అప్పుడే భూమి మీద జీవన మనుగడ ఉంటుందని అధర్వణ వేదం ఎప్పుడో ఘనంగా చాటింది.
మహాత్మాగాంధీ జీవితంలోనూ ఆయన ఇచ్చిన సందేశంలోనూ ప్రకృతిపట్ల మనం ఆచరించాల్సిన అనేక ధర్మాలున్నాయి. ఈ భూమిమీద ప్రతి ఒక్కరి అవసరాలకు కావలసిన వనరులున్నాయి…అంతే తప్ప అవి మనిషి అత్యాశకు బలైపోకూడదని ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి.
ఈ రోజు విడుదలైన పరంపర పుస్తకంలోనూ మనం ఇదే విషయాన్ని స్పష్టం చేశాం.
ప్రకృతి సంరక్షణ, పునర్వినియోగమనే విలువలు చాలా సహజంగా,వారసత్వంగా మనకు సంక్రమించాయి. దేశ వ్యాప్తంగా మనం పూజించే చెట్లే దీనికి నిదర్శనం.
స్నేహితులారా,
వాతావరణ మార్పులపై చేసే పోరాటానికి మనం ఒక సమగ్రమైన వ్యూహాన్ని తయారు చేసుకోవాలంటే దానికి ఈ తరతరాల స్ఫూర్తియే ఆధారం కావాలి. అదే మనల్ని ఈ విషయంలో ముందుకు నడపాలి. 2022 నాటికి 175 గిగావాట్ల పునర్వినియోగ ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. త్వరలోనే అంటే 2016 నాటికి 12 గిగావాట్ల సామర్థ్యాన్ని నెలకొల్పుకోబోతున్నాం. ఇది ఇప్పుడున్న సామర్థ్యాని కన్నా మూడు రెట్లు అధికం.
గతంలో సెల్యులర్ ఫోన్ల విషయంలో సాధించినట్టుగానే పునర్వినియోగ ఇంధనాన్ని అందరికీ అందించడంలోనూ ప్రగతిని సాధించబోతున్నాం. దేశంలోని 18 వేల గ్రామాలకు స్వచ్ఛమైన పద్ధతులద్వారా, అది కూడా వేగంగా విద్యుత్ ను అందించడానికి పునర్వినియోగ ఇంధనాన్ని ఉపయోగించవచ్చు.
2030 నాటికి భారతదేశం ఉపయోగించే శక్తి వనరుల్లో 40 శాతం శిలాజేతర ఇంధననుంచే ఉండబోతున్నది.
వ్యర్థాలనుంచి ఇంధనాన్ని తయారు చేసుకోబోతున్నాం. అలాగే మన నగరాలను ఆకర్షణీయమైన సుస్థిరమైన నగరాలుగా రూపొందించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 50 కొత్త మెట్రో రైలు ప్రాజెక్టులను నెలకొల్పుకొని, ప్రజా రవాణా వ్యవస్థలో మంచి మార్పులు తేబోతున్నాం.
బొగ్గు ఆధారిత ఇంధన కర్మాగారాల్లో అత్యాధునిక సాంకేతికతను ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని కేటాయిస్తున్నాం. బొగ్గుపైన పన్ను వేశాం, పెట్రోలు ఉత్పత్తులపైన రాయితీలను హేతుబద్ధీకరించాం. వాహనాల్లో ఇంధన వినియోగానికి సరికొత్త ప్రమాణాలు నిర్దేశించుకుంటున్నాం. అలాగే పునర్వినియోగ ఇంధనం కోసం పన్నురహిత బాండ్లను ప్రవేశపెట్టాం.
అటవీ విస్తీర్ణం పెంచడానికి భారీ కార్యక్రమాన్ని చేపట్టాం. తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతాం.
గత కొన్ని నెలుగా దేశంలోని లక్షలాది గృహాల్లో ఎల్ ఈ డీ బల్బుల వినియోగం పెరిగింది. దేశంలోని వేలాది టెలికమ్యూనికేషన్ టవర్లకు విద్యుత్ ను అందించడానికి డీజిల్ బదులుగా ఇంధన బ్యాటరీలను ఉపయోగించడానికిగాను పథకాలను తయారు చేసుకుంటున్నాం.
అంతర్జాతీయ స్థాయి నిర్మాణ కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఈ కార్యక్రమాన్ని జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ (శూన్య లోపం, శూన్య దుష్ప్రభావం) అనే నియమం ఆధారంగా చేపట్టాం. తద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా చూడగలం.
ప్రతి బిందువు సాగునీటితో అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దీని ద్వారా రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా సాగునీటి కొరతను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలం.
అతే కాదు స్వచ్ఛమైన ఇంధన రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు మేం అధిక ప్రాధాన్యతనిస్తున్నాం.
సంప్రదాయ ఇంధన వనరు అయిన బొగ్గునుంచి పర్యావరణానికి హాని లేని ఇంధనాన్ని తయారు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం.
పునర్వినియోగ ఇంధనం అందరికీ చౌకగా లభించేలా ప్రతి ఇంట్లోనూ ఉత్పత్తి చేసుకునేలా చూస్తాం. విద్యుత్ సరఫరా వ్యవస్థలోనికి దీనిని తీసుకొచ్చి ఇది ఆధారపడదగ్గ వనరుగా తీర్చిదిద్దుతాం.
పర్యావరణానికి మేలు జరగడానికిగాను ప్రభుత్వపరంగానూ, ప్రజల పరంగానూ అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మనముందు లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి.
ఈ పర్యావరణ హిత కార్యక్రమాల్లో కొన్నింటిని నా పుస్తకం కన్వీనియంట్ యాక్షన్ (అందరికీ వీలుగా కార్యాచరణ) లో పొందుపరచడానికి ప్రయత్నించాను.
స్నేహితులారా,
ఇది మన ప్రజల ఆకాంక్ష, జాతి ఇస్తున్న పిలుపు. మన రాజకీయ వ్యవస్థ ఏకగ్రీవంగా ఆమోదించిన అంశమిది.
పర్యావరణంకోసం ఎప్పటినుంచో భారతీయ నేతలతోపాటు, దేశంలోని పలు ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించాయి. 1975లో స్టాక్ హోమ్ లో నిర్వహించుకున్న సమావేశంనుంచి 2009లో కోపెన్ హాగెన్ సమావేశం దాకా మన ప్రభుత్వాలు ఎంతో ముందుచూపుతో స్పందించాయి.
ప్రస్తుతం మనం జాతీయ స్థాయలో చేయబోతున్న ఈ కృషిని సరికొత్త స్థాయికి తీసుకుపోతున్నాం. అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంచుకుంటున్నాం. బలోపేతం చేసుకుంటున్నాం. అందుకోసమే మనం పారిస్ కు నిబద్ధతతో వచ్చాం, అంతే కాదు మరెంతో ఆశతో ఇక్కడ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నాం.
వాతావరణ మార్పుపైన ఐక్యరాజ్యసమితి కార్యాచరణ సమావేశం మార్గదర్శకాల ప్రకారం భాగస్వామ్య స్ఫూర్తితో ఇక్కడ చర్చలు కొనసాగాలి. ఈ చర్చలు సమానత్వం, ఉమ్మడి బాధ్యత అనే నియమాలపైన ఆధారపడి ఉండాలి. అయితే అదే సమయంలో ఆ యా దేశాల బాధ్యతలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల నేతలతో కలసి ఆవిష్కరణలకు సంబంధించిన సమావేశంలో మరికాసేపట్లో పాల్గొనబోతున్నాను. ఆవిష్కరణ, సాంకేతికత అనేవి మనం ఉమ్మడిగా సాధించాల్సిన విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి కాబట్టే నేను ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాను.
ప్రపంచంలోని 121 దేశాల్లో సౌర శక్తి వనరులు అపారంగా ఉన్నాయి. ఈ దేశాల్లో సౌర ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకుగాను ఒక అంతర్జాతీయ సౌర వేదికను ఏర్పాటు చేయాలని నేను ఎప్పటినుంచో కలలు కంటూ ఉన్నాను. అది మరికాసేపట్లో సాకారం కాబోతున్నది. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్‌తో కలసి సహ అధ్యక్షత వహించే సమావేశంలో ఈ నూతన వేదికను ఆవిష్కరించబోతున్నాం.
ప్రపంచ నాగరికతలు, సంస్కృతులు, మతాలలో విలువైన పురాతన జ్ఞానం ఎంతో ఉంది. ఇది ప్రపంచానికంతటికీ అర్థం కావడానికి వీలుగా ఈ జ్ఞానానికి సంబంధించిన స్మరణీయ వాక్యాల( మంచి మాటలు) పుస్తకాన్ని ముద్రించమని ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలెండ్ ను నేను గతంలో అభ్యర్థించాను. మరికాసేపట్లో ఆ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాం.
మన జీవన శైలిలోనూ మార్పులు చేర్పులు చేసుకొని భూమిమీద పడుతున్న భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మనం చేపట్టబోయే కార్యక్రమాల విజయమనేది మన జీవనశైలిపైనా, ఆలోచనా విధానంపైనా ఆధారపడి ఉంటుంది.
చివరగా భారతదేశంలో మనల్ని నిర్వచించే అంశాన్ని మరోసారి మీ ముందుంచుతాను. భాగస్వామ్య స్ఫూర్తి, ప్రకృతితో మమేకమయిపోయే ఏకత్వం ఈ అంశాల్ని మనందరం గుర్తు పెట్టుకోవాలి.
భారతీయ ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన స్నేహితులను నేను అభ్యర్థిస్తున్నాను..లోకాస్సమస్త సుఖినోభవంతు అనే నిబద్ధతే మన ఆదర్శం కావాలి.
శాంతి సౌభాగ్యాలతో అందరం కలసి జీవించడమంటే మరేమిటో కాదు. భూగోళం, ప్రకృతి, అన్ని దేశాలు, సమస్త మానవాళి శాంతి సౌభాగ్యాలతో తులతూగడమే.
మన ఆలోచనా విధానం సరైనదే అయితే మనం చిత్తశుద్ధితో అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పరుచుకొని అందుకనుగుణంగా సామర్థ్యాలను సాధిస్తాం. ప్రజల అవసరాలను తీర్చగలుగుతాం. అప్పుడే అతి తక్కువ కర్బన ఉద్గారాల యుగం మన ముందు ఆవిష్కృతం అవుతుంది.
అందరికీ కృతజ్ఞతాభినందనలు
PM @narendramodi at the India Pavilion. @India4Climate pic.twitter.com/NApuNn7U1k
— PMO India (@PMOIndia) November 30, 2015
The India Pavilion @ COP21 Paris is a display of India's harmony with Nature and Environment. @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
India pavilion also seeks to demonstrate the strong belief that the world needs to look beyond climate change & focus on Climate Justice.
— PMO India (@PMOIndia) November 30, 2015
The India Pavilion at @COP21 has used technology to showcase India's commitment to climate change & focus on climate justice. @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
This pavilion shows our diversity: Environment Minister @PrakashJavdekar at @COP21 #COP21 @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
Delighted to inaugurate the pavilion. This is the 1st day of a historic summit: PM begins his remarks https://t.co/IFQDXd626I @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
Summit is of great significance to India's future. It is a window to our tradition, progress, aspirations & achievements: PM @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
Climate change is a major global challenge: PM @narendramodi #COP21
— PMO India (@PMOIndia) November 30, 2015
We want the world to act with urgency. Agreement must lead us to restore balance between humanity & nature: PM @narendramodi @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
India's progress is our destiny & right of our people. But we must also lead in combatting climate change: PM @narendramodi @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
Research & innovation in clean energy is a high priority. Want to make conventional energy cleaner & renewable energy cheaper: PM
— PMO India (@PMOIndia) November 30, 2015