Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ఎంపి మ‌రియు స‌భాప‌తి శ్రీ సోమ్‌నాథ్ చ‌ట‌ర్జీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


పార్ల‌మెంటు లో పూర్వ స‌భ్యుడు మ‌రియు లోక్ స‌భ పూర్వ సభాపతి శ్రీ సోమ్‌నాథ్ చ‌ట‌ర్జీ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“పూర్వ ఎంపి మ‌రియు పూర్వ సభాపతి శ్రీ సోమ్‌నాథ్ చ‌ట‌ర్జీ భార‌త‌దేశ రాజ‌కీయాలలో ప్ర‌సిద్ధులైన వారిలో ఒకరు. మ‌న పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యాన్ని ఆయ‌న సుసంపన్నం చేశారు; అంతేకాక పేద‌ల అభ్యున్నతి కై, అణ‌గారిన వ‌ర్గాల వారి అభ్యున్న‌తి కై త‌న వాణి ని బిగ్గ‌ర‌గా వినిపించారు కూడా. ఆయ‌న మ‌ర‌ణం మానసికంగా న‌న్ను వ్యథాభరితుడిని చేసింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల మ‌రియు మ‌ద్ద‌తుదారుల శోకం లో నేనూ పాలుపంచుకొంటున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

*****