Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కలైజ్ఞర్ క‌రుణానిధి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


కలైజ్ఞర్ క‌రుణానిధి క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

‘‘క‌రుణానిధి గారి క‌న్నుమూత తో తీవ్ర దుఃఖానికి లోన‌య్యాను. ఆయ‌న భార‌త‌దేశం లో అత్యంత సీనియ‌ర్ నేతల లో ఒక‌రు. గొప్ప ప్ర‌జాబలం సంపాదించుకొన్న నేత‌ ను, శక్తిమంతుడైన ఆలోచనపరుడి ని, చేయి తిరిగిన ర‌చ‌యిత ను, పేద‌ల మ‌రియు అణ‌గారిన వర్గాల‌ సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక ప్ర‌ముఖుడి ని మనం కోల్పోయాం.

కలైజ్ఞర్ క‌రుణానిధి గారు ప్రాంతీయ ఆకాంక్ష‌లతో పాటే జాతీయ పురోగ‌తి విషయంలోనూ సదా తత్పరుడై నిలిచారు. త‌మిళుల సంక్షేమానికి ఆయ‌న కంక‌ణం క‌ట్టుకున్నారు. అంతే కాకుండా త‌మిళ నాడు యొక్క వాణి బిగ్గ‌ర‌గా విన‌ప‌డే విధంగా శ్ర‌ద్ధ తీసుకున్నారు.

నాకు అనేక సంద‌ర్భాల‌లో క‌రుణానిధి గారితో సంభాషించే అవ‌కాశం ల‌భించింది. రాజనీతి పట్ల ఆయనకు ఉన్న అవగాహన, సామాజిక శ్రేయంతో ముడిపడ్డ పనులకు పెద్ద పీట వేయాలన్న ఆయన ఆలోచనల సరళి మిగతా వారందరి కన్నా ప్ర‌త్యేక‌ంగా ఉండేది. వారు పూర్తిగా ప్ర‌జాస్వామిక ఆద‌ర్శాల‌కు నిబ‌ద్ధుడై నడుచుకొన్నారు; అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ని ఆయన తీవ్రంగా వ్య‌తిరేకించ‌డాన్ని ఎప్ప‌టికీ గుర్తు కు తెచ్చుకొంటూనేవుంటాం.

ఈ శోక ఘ‌డియ‌ ల‌లో క‌రుణానిధి గారి కుటుంబ సభ్యుల, కరుణానిధి గారి అసంఖ్యాక మ‌ద్దతుదారుల దు:ఖం లో నేనూ పాలుపంచుకొంటున్నాను. భార‌త‌దేశానికి, అందులో మరీ ముఖ్యంగా త‌మిళ నాడు కు ఆయ‌న లేని లోటు ఎప్పటికీ భర్తీ చేయలేనటువంటిది. కరుణానిధి గారి ఆత్మ‌ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.