Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మైలాన్ లాబోరేటరీస్ లిమిటెడ్.. మైలాన్ లగ్జంబర్గ్ ఎస్ఏఆర్ ఐ లగ్జంబర్గ్ మరియు/లేదా మైలాన్ గ్రూపు బీవీ నెదర్లాండ్స్ కంపెనీలు ఈక్విటీ షేర్లు మరియు/లేదా కంపల్సరీ కన్వర్టెబుల్ డిబెంచర్స్ ద్వారా తమ కంపెనీలో విదేశీ పెట్టుబడులను 750 మిలియన్ల అమెరికా డాలర్లకు (దాదాపు 5వేల కోట్ల రూపాయలు) పెంచుకుని జేపీఎల్లోని అన్ని షేర్ హోల్టింగ్స్ను సొంతం చేసుకునేందుకు.. అంతకుముందున్న షేర్ హోల్డర్లనుంచి విడిపోయేందుకు పెట్టుకున్న ప్రతిపాదన.


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. మైలాన్ లాబోరేటరీస్ లిమిటెడ్.. మైలాన్ లగ్జంబర్గ్ ఎస్ఏఆర్ ఐ లగ్జంబర్గ్ మరియు/లేదా మైలాన్ గ్రూపు బీవీ నెదర్లాండ్స్ కంపెనీలు ఈక్విటీ షేర్లు మరియు/లేదా కంపల్సరీ కన్వర్టెబుల్ డిబెంచర్స్ ద్వారా తమ కంపెనీలో విదేశీ పెట్టుబడులను 750 మిలియన్ల అమెరికా డాలర్లకు (దాదాపు 5వేల కోట్ల రూపాయలు) పెంచుకుని.. జేపీఎల్లోని అన్ని షేర్ హోల్టింగ్స్ను సొంతం చేసుకునేందుకు.. అంతకుముందున్న షేర్ హోల్డర్ల (ఒరిజాబా మరియు రెసిడెంట్ ఇండియన్ షేర్ హోల్టర్స్) నుంచి విడిపోయేందుకు పెట్టుకున్న ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ చేసిన సూచనలకు అనుగుణంగా ఆమోదముద్ర వేసింది.
ఈ ఆమోద ముద్రతో 750 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడి దేశంలోకి రానుంది.

కింది అధికారిక విషయాల ద్వారా ఈ ఎఫ్డీఐకి ఆమోదం లభించింది:

1. ఎఫ్డీఐల ప్రవాహం మొదలైనప్పటినుంచి వచ్చే ఐదేళ్ల వరకు దేశీయ మార్కెట్లోకి వచ్చే ఆహార యోగ్యమైన మరియు ఎన్ఎల్ఈఎమ్ డ్రగ్స్ ల ఉత్పత్తి స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలి. ఈ ప్రమాణాలను.. ఆహార యోగ్యమైన మరియు/లేదా ఎన్ఎల్ఈఎమ్ డ్రగ్స్ ల తయారీలో ఎఫ్డీఐల ప్రవాహం మొదలు పెట్టక మూడేళ్ల ముందునుంచి ఆ సంస్థ ఉత్పత్తి స్థాయికి అనుగుణంగా నిర్ణయిస్తారు. ఇందులోనూ ఎక్కువ ఉత్పత్తి చేసిన ఏడాదినే ప్రామాణికంగా తీసుకుంటారు.

2. ఎఫ్డీఐల ప్రవాహం మొదలైనప్పటినుంచి పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ) విభాగంలో పెట్టిన ఖర్చుల వివరాలను కూడా ఐదేళ్ల కోసారి ప్రామాణికంగా తీసుకోవాలి. . ఈ ప్రమాణాలను కూడా.. ఎఫ్డీఐల ప్రవాహం మొదలు పెట్టక మూడేళ్ల ముందునుంచి ఆ సంస్థ ఉత్పత్తి స్థాయికి అనుగుణంగా.. ఎక్కువ ఉత్పత్తి చేసిన ఏడాదినే ప్రామాణికంగా తీసుకుంటారు.

3. విదేశీ పెట్టుబడుల ప్రవేశంతో పాటుగా ఏమైనా కొత్త సాంకేతికతను కూడా పెట్టుబడిదారుడు ప్రవేశపెట్టదలిస్తే.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఎఫ్ఐపీబీ సెక్రటేరియట్తోపాటు సదరు మంత్రిత్వశాఖ అధికారులు అందిస్తారు.

4. విదేశీ పెట్టుబడులను స్వీకరిస్తున్న కంపెనీ ఎన్ఎల్ఈఎమ్ ప్రకారం గత మూడేళ్లలో ఉత్పత్తి చేసినట్లే.. వచ్చే ఐదేళ్లపాటు ఇదే ప్రామాణికంగా దేశీయ రేట్లకే అందుబాటులో ఉంచాలి.

5. ఎఫ్డీఐల ప్రవాహం మొదలు పెట్టక మూడేళ్ల ముందునుంచి ఆ సంస్థ పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ) విభాగంలో పెట్టిన ఖర్చును పెట్టుబడులను స్వీకరిస్తున్న కంపెనీ కూడా ఐదేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది.

6. విదేశీ పెట్టుబడుల ప్రవేశంతో పాటుగా ఏమైనా కొత్త సాంకేతికతను కూడా పెట్టుబడిదారుడు ప్రవేశపెట్టదలిస్తే.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఎఫ్ఐపీబీ సెక్రటేరియట్తోపాటు సదరు మంత్రిత్వశాఖ అధికారులు అందిస్తుంది.

7. భావి పెట్టుబడిదారుడు మరియు భావి స్వీకర్త విషయంలో పోటీకి ఎటువంటి నిబంధనలు లేవు

8. మైలాన్ గ్రూపు జై ఫార్మా నిధులను కొనుగోలు చేస్తున్నప్పుడు రెండో విడత లావాదేవీల నుంచి విదేశీ పెట్టుబడుల ప్రవాహం మొదలవ్వాలి. ఈ లావాదేవీలకు సంబంధించిన పన్నుల వివరాలు క్షేత్ర స్థాయిలోనే పరీక్షించబడతాయి.

9. భారత ఆదాయపు పన్ను చట్టం 1961, డీటీటీఏ చట్టం ఆధారంగా.. విదేశీ పెట్టుబడిదారుడు తీసుకున్న షేర్లపై ఆదాయం, ఆదాయ పన్నుపై డివిడెండ్, ఫూచర్ కేపిటల్లను క్షేత్ర స్థాయిలో నిర్ణయిస్తారు.

10. భారత ఆదాయపు పన్ను చట్టం 1961, డీటీటీఏ చట్టం కింద పన్ను మినహాయింపును కోరుకుంటే.. దీన్ని ఐటీ అధికార వర్గాలు స్వతంత్రంగా విచారించి.. అర్హత ఆధారంగా ఎంతవరకు మినహాయింపు ఇవ్వవచ్చు అనే దానిపై నిర్ణయం తీసుకుంటాయి.

11. కేంద్రం విదేశీ పెట్టుబడులకు ఆమోదముద్ర వేసిందంటే.. పన్ను విషయంలో సదరు సంస్థకు భద్రత మినహాయింపు ఇచ్చినట్లు కాదు. అందరికీ వర్తించిన సూత్రాలే వీరికి కూడా వర్తిస్తాయి. అందులో మార్పు లేదు.

12. వివిధ చెల్లింపులు, సేవలు, ఆస్తులు, షేర్ల మొదలైన వాటి విషయంలో ఎఫ్ఐపీబీ మార్గదర్శకాలకు అనుగుణంగానే.. ఐటీ అధికారులు చట్టాలను అనుసరించి విచారణ జరిపి నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకుంటారు.