వ్యూహాత్మక సహకారం కోసం ఇండియా-ఆఫ్రికా నిర్మాణాత్మక విధివిధానాల వ్యవస్థ
ఉపోద్ఘాతం
1. ఆఫ్రికా దేశాల ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వ సంస్థల అధిపతులు, ఆఫ్రికా యూనియన్ (ఏయు) ప్రతినిధుల నేతలతో భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 29, 2015న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. మూడవ ఇండియా ఆఫ్రికా ఫోరమ్ శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటయ్యాయి.
2. 2011 మే నెలలో అడిస్ అబబాలో రెండవ ఆఫ్రికా ఇండియా ఫోరమ్ శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సహకార పెంపుదలకు సంబంధించిన రూపకల్పన ఈ సమావేశంలో జరిగింది. దీని అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపైన సమీక్ష, దానికి సంబంధించిన కార్యాచరణపైన శిఖరాగ్ర సమావేశంలో ఓ అంగీకారానికి వచ్చారు.
3. ఆఫ్రికా దేశాలు, భారతదేశం మధ్య గల ప్రధాన ఉమ్మడి అంశాల్లో కలసి పని చేసే వాటిని గుర్తించడం జరిగింది. దీని వలన ఆఫ్రికా అజెండా 2063లో నిర్వించిన పలు అంశాలు కార్యాచరణలోకి వస్తాయి. పేదరిక నిర్మూలనకోసం పటిష్టమైన ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సాధించడానికి కావలసిన నిధుల కేటాయింపు ఈ అజెండాలో ఉన్నాయి. ఈ అజెండాకు సంబంధించి మొదటి పది సంవత్సరాల అమలు కార్యాచరణ, 2030 అజెండా ప్రకారం సుస్థిరాభివృద్ధి సాధించడం, భారత దేశ ప్రాధాన్యతలు శిఖరాగ్ర సమావేశంలో గుర్తించడం జరిగింది.
4. ఆఫ్రికా దేశాలు, భారతదేశానికి మధ్యన గల ఉమ్మడి ప్రాధాన్యతా అంశాల విషయంలో ముందస్తుగానే సరైన సహకారాన్ని నిర్మించుకునే దిశగా శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆఫ్రికా దేశాలతో భాగస్వామ్యాన్ని పటిష్టపరచాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆఫ్రికా, భారతదేశ ప్రజల ఆకాంక్షలకు నిదర్శనంగా నిలిచింది. ఆఫ్రికా యూనియన్ అజెండా 2063లో సూచించిన అభివృద్ధి, ఐక్యత, ఆనందంగా జీవించడం అనే వాటిని దృష్టిలోపెట్టుకున్నారు. ఈ అజెండాకు సంబంధించిన మొదటి పది సంవత్సరాల అమలు కార్యాచరణను నిర్మించడం, 2030 అజెండా ప్రకారం సుస్థిరాభివృద్ధి సాధన , భారత దేశ ప్రాధాన్యతలు ముఖ్యమైనవి.
5. ఇంతవరకూ ఎదుర్కొనని సవాళ్ల ప్రాధాన్యతను గుర్తించారు. గుణాత్మకమైన విద్య, నైపుణ్యాల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, అందరికీ అందుబాటులో ఆరోగ్య భద్రత, స్వచ్ఛమైన ఆధునిక శక్తి వనరులు, ప్రాథమికసౌకర్యాల కల్పన, పలు ఆర్థిక రంగాల అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన ఈ సవాళ్లలో ముఖ్యమైనవి. వ్యవసాయం,
వస్తువుల తయారీ- సేవల రంగం, జోడించిన విలువను పొందడం, సంబంధాల మెరుగుదల, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, అననుకూల
వాతావరణం లేకుండా చేయడం, సముద్ర వాణిజ్యం, సంక్షోభాల నిర్వహణ, సంక్షోభ ప్రమాదాల తగ్గింపు మొదలైన రంగాల ద్వారా ఉపాధిని పెంచవచ్చని గుర్తించారు.
6. ఆఫ్రికా-ఇండియాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి. వైవిధ్యమైన ఈ సంబంధ బాంధవ్యాలవల్ల ఇరువురి మధ్య అభివృద్ధి భాగస్వామ్యం నెలకొల్పబడింది. ఇది దక్షిణాది దక్షిణాది – సహకారానికి సంబంధించిన అన్ని కోణాలను ప్రతిబింబిస్తూ సమానత్వం, స్నేహం, పరస్పర ప్రయోజనాలు, సౌభ్రాతృత్వం ఆధారంగా నెలకొల్పబడింది. ఈ భాగస్వామ్యం మానవవనరుల అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఉపకార వేతనాలు, శిక్షణ, సామర్థ్య నిర్మాణం,
గ్రాంటులద్వారా ఆర్థిక సాయం అందించి మానవవనరులను అభివృద్ధి చేసుకుంటున్నాం. రాయితీ రుణాలను అందించడం ద్వారా పలు ప్రజా ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నాం. విద్య, ఆరోగ్య రంగం, సౌకర్యాల కల్పన, వ్యాపార ప్రాధాన్యతలు, సాంకేతికరంగంలో సంబంధాలు, అత్యవవసర పరిస్థితుల్లో అన్ని విధాల సాయం, శాంతి దళాలను అందుబాటులోకి తేవడం మొదలైన విషయాల్లో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాం.
7. ఆఫ్రికా, ఇండియా ఈ రెండూ వ్యూహాత్మక సహకారం కోసం ఒక నిర్మాణాత్మక విధివిధానాల వ్యవస్థను తయారు చేసుకున్నాయి. ఇది అమలయ్యే రంగాలు ఏవేవో చూద్దాం. సహకారానికి వీలున్న సాధారణ రంగాలు
8. ఆఫ్రికా, ఇండియా సమాజాల మధ్య అనేక ఉమ్మడి లక్షణాలున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఉన్నట్టే భారతదేశంలోనూ అనేక జాతులు, మతాలున్నాయి. సమాజ విలువల్లో అనేక సారూప్యతలున్నాయి. దాంతో సహజంగానే గత కొన్ని శతాబ్దాలుగా ఆఫ్రికా దేశాల ప్రజలకు, భారతదేశ ప్రజలకు మధ్య స్నేహం బలపడింది.
9. లింగ వివక్ష లేని సమాజంవల్లనే ముందుకు వెళ్లగలుగుతామని, అప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందనే కీలకమైన విషయాన్ని ఆఫ్రికా దేశాలు, ఇండియా గుర్తించాయి. ఆఫ్రికా దేశాలు, ఇండియా మహిళా సాధికారితకు పెద్దపీట వేశాయి. దీనివల్ల పేదరిక నిర్మూలన, మానవ హక్కుల రక్షణ జరిగి హింసలేని, పర్యావరణ పరంగా ఆరోగ్యంగా ఉండే సమాజాలు రూపొందుతాయి.
10. ఆఫ్రికా ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బహుపార్శ్వాలున్న దక్షిణాది – దక్షిణాది సహకారానికి ప్రతినిధిగా పరిగణించవచ్చు. దీన్ని మరింత బలోపేతం చేస్తే చక్కటి ఫలిలు వస్తాయి.
11. ఇందుకోసం ఆఫ్రికా, ఇండియా చేయాల్సిందేమంటే…
ఆఫ్రికా, ఇండియా సంస్కృతులు, సంప్రదాయాలు, వారసత్వాలపై మరింత విస్తృతమైన పరస్పర అవగాహన కోసం చర్యలు చేపట్టాలి. వివిధ దశల్లో ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఆఫ్రికా, భారతదేశ ప్రజలను మరింత దగ్గరివాళ్లను చేయాలి.
స్త్రీ పురుష సమానత్వాన్ని, మహిళల సాధికారతను మరింతగా ప్రచారం చేయాలి. దీనివల్ల పేదరిక నిర్మూలన వేగవంతమవుతుంది. మానవ హక్కుల రక్షణ,
చైతన్యం పెరుగుతాయి. తద్వారా హింసకు తావులేని, పర్యావరణ హితమైన సుస్థిర సమాజాలు రూపొందుతాయి.
పరస్పర ప్రాధాన్యతలున్న సమాజాలను నిర్మించుకోవడానికిగాను ఆధునిక సామాజిక వ్యవస్థలను ప్రోత్సహించాలి. విద్యారంగ నిపుణులు, పత్రికా రచయితలు, మీడియా సంస్థలు, పౌర సమాజాల మధ్య సంబంధాలను ప్రోత్సహించాలి. ఈ పని చేయడానికి ఇప్పటికే చేపట్టిన చర్యలతోపాటు భారత అభివృద్ధి సహకార వేదిక ద్వారా కూడా కృషి చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధి సాధన కోసం పౌర సమాజం ఇప్పటికే విజయవంతంగా చేపట్టిన కార్యక్రమాల్ని ఒక చోట పొందుపరచడానికిగాను ఈ కృషి చేయాలి.
ఎలక్ట్రానిక్ పరిపాలనలోని నూతన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా సుపరిపాలనను ప్రోత్సహించాలి. డిజిటలీకరణ ద్వారా సంబంధబాంధవ్యాలను పెంచడంవలన ప్రజల్లో సాధికారత పెరుగుతుంది. తద్వారా ఆర్థికరంగానికి సంబంధించిన అన్నివిభాగాల్లోని సాంకేతికతలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సామాన్య ప్రజలకు అందే మేళ్లు డిజిటలీకరణ వలన సులువుగా అందుతాయి. సేవలు మరింత సమర్థవంతంగా చేరుతాయి. అభివృద్ధి వేగవంతమవుతుంది. పరిపాలనలో పౌరుల భాగస్వామ్యం పెరుగుతుంది. బ్యాంకులతో ప్రజల లావాదేవీలు పెరిగి ఆర్థికంగా బలోపేతమవుతారు. రుణాలు త్వరగా అందుతాయి. రోగాలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలను ఆదుకునే సామాజిక బీమా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థలోను, దాని భద్రతా మండలిలోను సమగ్రమైన సంస్కరణలు తేవాలనే బలమైన ఆకాంక్షను నిబద్ధతతో ముందుకు తీసుకుపోవాలి. మనం ఆశించిన సంస్కరణలు జరిగితే ఐక్యరాజ్యసమితిలో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం ఉంటుంది. అది మరింత ప్రజాస్వామికంగా, బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పని చేస్తుంది.
పార్లమెంటరీ విధానాలు, ఎన్నికల ప్రక్రియలను స్వేచ్ఛగా, నిక్కచ్చిగా, పారదర్శకంగా అనుసరించడానికి వీలుగా ఆఫ్రికా, భారతదేశాల అనుభవాలను పంచుకోవడంలోను, వాటి విషయంలో సహకరించుకోవడంలోనూ ఇప్పటికే సహకారం ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. ఇప్పటికే అంతర్జాతీయంగా అమలులో ఉన్న ఉత్తమమైన విధానాలకు అనుగుణంగా శిక్షణను కొనసాగించాలి. సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
విమానయానం, సముద్రయానం ఈ రెండింటి ద్వారా పర్యాటకరంగాన్ని, వాణిజ్యాన్ని, ప్రజల సంబంధబాంధవ్యాలను పెంచడానికిగాను చర్యలు చేపట్టాలి. ఇందుకోసం వీసా నిబంధనల్ని సరళీకరించాలి. వీసా రాయితీలను ఇవ్వాలి.
ఆఫ్రికా ఖండంలో పలు చిన్న ద్వీప దేశాలున్నాయి. ఇవి ఇప్పుడు వాతావరణ మార్పులతో వచ్చే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటిని
పరిష్కరించడానికిగాను, ఆ దేశాలకు ఆఫ్రికాలోని ప్రధాన ప్రాంతాలతో సంబంధాలు ఏర్పడేందుకుగాను కృషి చేయాలి.
ఆర్థిక రంగంలో సహకారం
12. సుస్థిరమైన అభివృద్ధిని సాధించడానికిగాను ఆఫ్రికా, భారత్‌లు ఒక నిబద్ధతతో పని చేస్తున్నాయి. ఆర్థికరంగ సహకారానికి ఇవి రెండూ మరింత ప్రాధాన్యతనివ్వాలి. సుస్థిరమైన, పటిష్టమైన అభివృద్ధి సాధనకోసం ఆఫ్రికా, భారత్‌లు రెండూ చేపట్టాల్సిన చర్యలను మరింత ముందుకు తీసుకుపోవాలి. తద్వారా ఆఫ్రికా, భారతదేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
13. వాణిజ్య, ఆర్థిక బంధాల విస్తరణ సుస్థిరమైన వృద్ధి, ఆర్థికాభివృద్ధికి మరింతగా దోహదం చేస్తాయనే విషయాన్ని ఆఫ్రికా, భారత్ లు స్పష్టంగా అంగీకరించాలి. విలువ జోడింపునిచ్చే ప్రాసెసింగ్ సౌకర్యాలను ఆఫ్రికాలో ఏర్పాటు చేయడంలో భారతదేశం చొరవను ఆఫ్రికా స్వాగతించాలి.
14. గత పదిహేను సంవత్సరాల్లో ఆఫ్రికా-భారత్ వాణిజ్యం చాలా రెట్లు పెరిగింది. గత ఐదు సంవత్సరాలను తీసుకుంటే ఆఫ్రికా-ఇండియా వాణిజ్య విలువ రెండింతలు పెరిగింది. ఇది 2014-2015 నాటికి 72 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుంది. బారతీయ కంపెనీలు అనేకం ఆఫ్రికాలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సంఖ్య నానాటికీ అధికమవుతోంది. భారతీయ బహుళజాతి కంపెనీలు, చిన్న మధ్య తరహా కంపెనీలు అనేక ఆఫ్రికా దేశాల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. టెలీ కమ్యూనికేషన్, హైడ్రోకార్బన్ల అన్వేషణ, వ్యవసాయం, చిన్నతరహా వస్తువుల తయారీ, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఐటీ విద్య , నీటి శుద్ధి, నీటి సరఫరా నిర్వహణ, పెట్రోలియం శుద్ధి, రీటెయిల్ రంగంలో అమ్మకం, రసాయనాలు, మందులు, ఔషధాల తయారీ, బొగ్గు, ఆటోమొబైల్స్, పూలపంటలు, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ-నిర్వహణ, పేపరు, బట్టల తయారీ మొదలైన రంగాల్లో మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులవల్ల ఆయా దేశాల్లో కంపెనీలకు మూలధనం, సాంకేతికత చేకూరుతాయి. విలువ జోడింపు వస్తుంది. పారిశ్రామికీకరణ జరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం ఆయా దేశాల్లో ఉపాధి పెరుగుతుంది. స్థానిక ప్రజల నైపుణ్యాలు అభివృద్ధిచెందుతాయి.
15. వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలనే తీసుకుంటే వీటిలో కొన్ని… అభివృద్ధి అంతంతమాత్రమే ఉన్న దేశాలను (ఎల్ డి సి..లెస్ డెవలప్ డ్ కంట్రీస్) ఆదుకోవడానికి పన్ను రహిత మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. హాంగ్ కాంగ్ మంత్రిత్వ స్థాయి ప్రకటన- 2005ను అనుసరించి అలా పన్ను రహిత మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చినవాటిలో భారత్ మొదటి వరసలో ఉన్నది. ఆఫ్రికా, భారత్ ఈ విషయాన్ని గుర్తించాలి. ఎల్ డి సిలకోసం 2014లో భారతదేశం డ్యూటీ ఫ్రీ ట్రేడ్ ప్రిఫరెన్స్ స్కీమ్ (డిఎఫ్ టిపి)ను విస్తరించింది. దీన్ని 2008లో భారత్ ప్రవేశపెట్టింది. 2012లో ఇది పూర్తిగా అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది 98 శాతం పన్ను విభాగాలను కలిగి ఉంది. భారతదేశానికి ఆఫ్రికాలోని 34 దేశాలు ఎగుమతులు పెంచడానికి వీలుగా ఈ స్కీమ్ ను వర్తింపచేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న దేశాలకు సాంకేతికపరమైన సహాయాన్ని భారతదేశం అందించాలని ఆఫ్రికా ఇదివరకే విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఈ డిఎఫ్‌టిపి స్కీమ్ ను అమలు చేస్తోంది.
16. ఎల్ డి సి లలో (అంతంతమాత్రం అభివృద్ధయిన దేశాల్లో) డ్యూటీ ఫ్రీ ట్రేడ్ ప్రిఫరెన్స్ స్కీమ్ (డి ఎఫ్‌టిపి)ను విస్తరించాలని ఆఫ్రికా చేసిన విజ్ఞప్తిని భారతదేశం పరిగణలోకి తీసుకుంది. మరిన్ని రంగాలకు అవకాశం ఇవ్వాలని ఆఫ్రికా కోరింది. ఆఫ్రికా దేశాల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు మన దేశంలో పెంచడానికి వీలుగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
17. చిన్న, మధ్య , సూక్ష్మ తరహా పరిశ్రమల నిర్వహణలో భారతదేశం మేలైన అనుభవాన్ని కలిగి ఉంది. ఈ విషయాన్ని ఆఫ్రికా, భారత్ లు గుర్తించాలి. ఆఫ్రికాలో పారిశ్రామికీకరణ సహకారానికి ఈ అనుభవాన్ని ఉపయోగించవచ్చు. తద్వారా ఉపాధి పెంచవచ్చు. స్థానిక ప్రజల సామర్థ్యాలు మెరుగవుతాయి. ముఖ్యంగా పారిశ్రామిక విభాగాల నిర్వహణలోను, వాటిని మాతృసంస్థలతో కలపడంలోనూ ఈ అనుభవం చక్కగా పనికొస్తుంది.
18. ప్రతి సంవత్సరం భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), భారతీయ ఎగుమతుల దిగుమతుల బ్యాంక్ (ఎగ్జి మ్ బ్యాంక్) కలిసి నిర్వహించే ఆఫ్రికా-భారత్ ప్రాజెక్ట్ పార్టనర్ షిప్ కాంక్లేవ్ ను (సమావేశాన్ని) ఆఫ్రికా, భారత్ స్వాగతించాలి. ఇలాంటి సమావేశాలు ఆఫ్రికా, భారత్ లలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, విధాన నిర్ణయకర్తలను ఒకే వేదికపైకి తేవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి సమావేశాలు ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యేలా చూడాలి.
19. ఆఫ్రికా ఇండియా భాగస్వామ్యంలోని ముఖ్యమైన అంశం ఇండియన్ డెవలప్ మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ (ఐడియాస్) కింద రాయితీతో కూడిన రుణ పరపతి మంజూరు. దీని ద్వారా ఆఫ్రికా దేశాలు…వారి వారి ఆర్థిక, సామాజిక ప్రాధాన్యతలకనుగుణంగా భారతీయ కంపెనీలకు అనుభవమున్న రంగాలలో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. గత దశాబ్దంలో 40కి పైగా ఆఫ్రికా దేశాలలో దాదాపుగా 9 బిలియన్ డాలర్ల విలువైన రాయితీతో కూడిన రుణ పరపతి సౌకర్యాన్ని 140 ప్రాజెక్టులకోసం భారత్ కల్పించింది. వీటిలో వివిధ రంగాలకు చెందిన 60 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
20. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ఆఫ్రికా, భారత్ లకు ఉమ్మడిగా ఉన్న పలు సవాళ్లు పరిష్కరించుకోవచ్చనే విషయాన్ని ఇరువురు గుర్తించాలి. కాబట్టి ఇరువురు కలసి తక్కువ ఖర్చుకే లభించే సాంకేతికతలను విస్తరించుకోవడానికి ప్రయత్నించాలి. అంతే కాదు కొత్తగా వస్తున్న అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి.
21. ఆఫ్రికా, ఇండియా సహకారంలో ఇంధనం, ప్రాథమిక సౌకర్యాలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ సహకారంలో శిక్షణ, సామర్థ్య నిర్మాణం ఉన్నాయి. నీటి సరఫరా, నీటి నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, రోడ్లు, రైల్వే రంగాల్లో నిర్మాణాలు, ఆధునీకరణ, హైడ్రోకార్బన్ల అన్వేషణ మొదలైన రంగాల్లో కన్సెల్టెన్సీ, ప్రాజెక్టుల అమలుకుగాను రాయితీతో కూడిన రుణ పరపతి సౌకర్యాన్ని కల్పించడం ఈ సహకారంలో ముఖ్యమైనవి.
22. సుస్థిరమైన, పటిష్టమైన ఆర్థికాభివృద్ధిని సాధించడానికిగాను ప్రైవేటు పెట్టుబడుల ప్రాధాన్యతను గుర్తిస్తూనే ఆఫ్రికా, భారత్ లు రెండూ తమ తమ అనుభవాలను, విజ్ఞానాన్ని పంచుకోవాలి..ఇందుకోసం భారతదేశం అందిస్తున్న డిఎఫ్ టిపి స్కీముపై ఆఫ్రికా దేశాల్లో సరైన చైతన్యాన్ని కలిగించాలి. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అంతే కాదు ఈ స్కీమును ఆఫ్రికాలోని అన్ని దేశాలకు విస్తరించడానికి చర్యలు తీసుకోవాలి.
భారతీయ ప్రభుత్వ ప్రతినిధులు, ఆఫ్రికా దేశాల దౌత్య కార్యాలయాల ప్రతినిధులు సభ్యులుగా ఒక సమన్వయ వ్యవస్థను తయారు చేసుకొని దాని ద్వారా ఆఫ్రికా, భారత్ ల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేయాలి. తద్వారా ఆఫ్రికా దేశాలనుంచి మన భారతదేశంలోకి పెట్టుబడులు పెరుగుతాయి. అంతే కాదు దీని వల్ల ఆఫ్రికా దేశాల వ్యాపార సంస్థల కార్యకలాపాలు పెరుగుతాయి. ఆఫ్రికా దేశాలు, భారత్…. ఈ రెండూ సాంకేతికత ప్రదర్శన, బదిలీకోసం కృషి చేయాలి. ఈ రంగంలో శిక్షణ, ఉమ్మడి పరిశోధన, ప్రత్యేకమైన అప్లికేషన్ల అభివృద్ధి పెంపుదల కోసం ఇరు పక్షాల పని చేయాలి.
అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఆఫ్రికా దేశాలు, భారత్ కలసి పని చేయడానికి వీలుందేమో చూడాలి. అంతరిక్ష సాంకేతికత ద్వారా రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలు వేగవంతం చేయవచ్చు. సహజ వనరులను ముఖ్యంగా నీరు, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం, ఖనిజ వనరులు, సముద్ర వనరులను పసిగట్టగవచ్చు. అంతే కాదు దీని ద్వారా వాతావరణ అంచనాలు వెలువరించవచ్చు. సంక్షోభాల నిర్వహణ, సంక్షోభ ప్రమాదాల తగ్గింపు, ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టడానికి అంతరిక్ష సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇక అణు సాంకేతికత ద్వారా మందులు, వ్యవసాయం, నీటి విజ్ఞాన రంగాల్లో పలు ప్రయోజనాలు పొంది ఆఫ్రికా, భారతదేశ ప్రజలకు అనేక విధాలుగా లబ్ధి చేకూరేలా చూడవచ్చు.
వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో సహకారం
23. ఆఫ్రికా దేశాలు, భారత్‌లో ఉన్న ప్రజలే ప్రాధమికమైన వనరుగా భావించి ఆఫ్రికా – భారత్ భాగస్వామ్యం ప్రారంభమైంది. సమర్థవంతమైన, నైపుణ్యమైన మానవవనరులే పునాదిగా అందరి సంక్షేమాన్ని, భవిష్యత్తును నిర్మించవచ్చు.
24. ఆఫ్రికా, ఇండియా ఈ రెండూ ఒక విషయాన్ని గుర్తించాలి. అదేమంటే ఆఫ్రికా, ఇండియాలలోని ప్రజల సాంకేతిక సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. దీనివల్ల ఆయా దేశాల్లోని వనరులకు విలువ జోడింపు చేకూరుతుంది. తద్వారా అందరికీ మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
25. సామర్థ్యాన్ని నిర్మించే సంస్థల ప్రాధాన్యతను ఆఫ్రికా, భారత్ లు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సంస్థలను ఆఫ్రికాలోని వివిధ రంగాలలో భారత్ స్థాపిస్తోంది. భారత్ కొనసాగిస్తున్న ఈ కృషిని ఆయా ఆఫ్రికా దేశాలు గుర్తించాలి. అప్పుడే ఆఫ్రికా పరిశ్రమలకు, సేవా రంగాలకు మేలు జరుగుతుంది. అలా చేస్తే భవిష్యత్ లో అది ఆఫ్రికా ఖండం అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది.
26. పారిశ్రామికీకరణకు మద్దతు పలికే సామర్థ్య నిర్మాణ ప్రాముఖ్యతను ఆఫ్రికా, భారత్ లు పరిగణనలోకి తీసుకోవాలి. అందుకోసం నెలకొల్పాల్సిన సంబంధిత సంస్థల అవసరాన్ని ఇరువురు తెలుసుకోవాలి.
27. ఈ విషయంలో ఆఫ్రికా, భారత్ ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి చిన్న, మధ్య తరహా కంపెనీలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకోసం కృషి చేయాలి. తద్వారా ఆఫ్రికా, భారత్ లలో ఉద్యోగాలు పెరుగుతాయి. ఆయా దేశాల ప్రజల ఆదాయవనరులు వృద్ధి చెందుతాయి.
భారతీయ వ్యాపారాలను ఆఫ్రికా దేశాలలో ప్రోత్సహించడం ద్వారా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వృద్ధి చేయవచ్చు. ఇందుకోసం ఆప్రికా పారిశ్రామిక మండళ్లలో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను స్థాపించి వాటి ద్వారా ఆఫ్రికా ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు, మేనేజర్లకు, కార్మికులకు శిక్షణ ఇవ్వవచ్చు. వీరితోపాటు ఆహార భద్రత, సౌర విద్యుత్ తదితర రంగాలలో పని చేసే నిపుణులకు కూడా శిక్షణ ఇవ్వవచ్చు.
ఇప్పటికే పని చేస్తున్న వ్యవస్థల పని విధానాన్ని సమీక్షించాలి. వాటి స్థాపనకు అవసరమైన అన్ని విధానాలు సక్రమంగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. వాటికి కావల్సిన వస్తువులు, మానవ, ఆర్థిక వనరులు, నిర్వహణ సరిగా ఉన్నాయా, వాటికి తగిన మద్దతు ఉన్నదా అనేది ఈ సమీక్ష ద్వారా తెలుసుకోవాలి.
ఉత్పత్తి రంగంలో ఉన్న మహిళా సంఘాలకు పరపతి సౌకర్యం అందుబాటులోకి తెచ్చే వ్యవస్థను స్థాపించాలి. వారి ఉత్పత్తులకు తగిన మార్కెట్లు వచ్చేలా ఈ వ్యవస్థ ద్వారా కృషి చేయాలి.
అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా అదే స్థాయిలోనే వాణిజ్య సమస్యలు వస్తుంటాయి. వీటి పరిష్కారానికిగాను సమైక్యంగా నిలిచి చర్చలు జరిగేలా చూడాలి.
ఇందుకోసం అవసరమైతే తగిన శిక్షణ అందించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థతోనూ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల న్యాయమైన ప్రాధాన్యతలకు ఎలాంటి విఘాతం కలగదు. వాటి భద్రతకు ఢోకా ఉండదు. ముఖ్యంగా అంతంతమాత్రం అభివృద్ధయిన దేశాల విషయంలో దీనికి మరింత ప్రాధాన్యత నివ్వాలి.
వ్యవసాయరంగంలో సహకారం
28. ఆఫ్రికా దేశాల్లోనూ, భారత్ లోనూ అత్యధికశాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడే జీవిస్తున్నారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత మెరుగయితే ఆహార
భద్రత లభించడమే కాకుండా అందరికీ పోషక ఆహారం లభిస్తుంది. ఇందుకోసం పంటల పెంపకం, పశుగణాభివృద్ధి, నీటి నిర్వహణ అనే అంశాలను సుస్థిరమైన, మేలైన
విధానాల ద్వారా అభివృద్ధి చేసుకోవాలి. ఈ విషయంలో అవకాశాలతోపాటు, సవాళ్లు కూడా ఉన్నాయి.
29. వ్యవసాయరంగంలో ఆఫ్రికా, భారతదేశాల మధ్యన విస్తారమైన సహకారం కొనసాగుతోంది. అనుభవాలను పంచుకోవడం, శిక్షణ కార్యక్రమాలు, సంస్థల ఏర్పాటు
ద్వారా సామర్థ్య నిర్మాణం, వ్యవసాయ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి రాయితీతో కూడిన రుణ పరపతి విధానంద్వారా సాయం, సాగునీటి విధానాలు, భూసార
అంచనా, వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తేవడం, వాటిని మెరుగైనవాటిగా తీర్చిదిద్దడం మొదలైన అంశాల్లో ఇరువురూ కృషి చేస్తున్నారు.
30 పర్యాటకరంగం, వ్యవసాయం, మత్స్యసంపద, అటవీశాఖ, శక్తి ఉత్పత్తి మొదలైన రంగాలన్నీ చాలా సున్నితమైనవనే విషయాన్ని ఆఫ్రికా, భారత్ లు రెండూ పూర్తిగా గ్రహించాయి. వాతావరణ మార్పుల ప్రభావం ఈ రంగాలపైనే అధికంగా ఉంటుందని ఆఫ్రికా, భారత్ లకు బాగా తెలుసు.
31. ఈ విషయంలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
అందరికీ అందుబాటులో ఉండే సాంకేతికత ద్వారా వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేసుకోవడంలో సహకారాన్ని మరింత ఎక్కువగా కొనసాగించాలి. సేంద్రీయ వ్యవసాయం, పంటల వైవిధ్యాన్ని పెంచడం, మేలైన విత్తనాలను తయారు చేసుకోవడం, ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించడం మొదలైన చర్యలను చేపట్టాలి.
నీటి వనరులను సమర్థవంతంగా, ప్రభావవంతంగా నిర్వహించడానికిగాను ఆఫ్రికా, భారత్ లు ఉమ్మడిగా చేస్తున్నకృషిని మరింతగా పెంచాలి. మెరుగైన నీటి పారుదల విధానాలను, విజ్ఞానాన్ని సాంకతికత బదిలీ ద్వారా అందిపుచ్చుకోవాలి.
ఆఫ్రికాలో ఇప్పటికీ చాలా దేశాల్లో చేతి పనిముట్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. ఇది ఆ దేశంలోని వ్యవసాయ వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపుతోంది.. ఈ పరికరాలను ఎంత వీలైతే అంత తొందరగా మ్యూజియానికి పంపించేసి ఆధునిక వ్యవసాయ పరికరాలను అందిపుచ్చుకోవాలని ఆఫ్రికా ఎంతో నిబద్ధతతో పని చేస్తోంది.
ఆఫ్రికా లక్ష్యం నెరవేరడానికి కావాల్సిన మద్దతును భారత దేశం అందించాల్సి ఉంటుంది. అంతే కాదు ఆఫ్రికా దేశాల్లోని మహిళల్లో అత్యధికులు వ్యవసాయ కూలీలు.
వీరు తరతరాలుగా అన్ని విధాలుగా నిరాదరణకు గురై ఉన్నారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లను తక్కువ ధరలకే ఆఫ్రికాకు అందివ్వడానికి భారత్ కృషి చేయాలి. అంతేకాదు వ్యవసాయ సాంకేతికతలను బదిలీ చేస్తే ఆఫ్రికా దేశాల అన్నదాతలకు తగిన సాధికారత వస్తుంది.
వ్యవసాయ వాణిజ్యంలోనూ, ఆహార పదార్థాల తయారీ రంగంలోనూ భారత్ పెట్టుబడులు పెట్టాలి. తద్వారా ఆ దేశాలలో ఉద్యోగాలు పెరిగి ప్రజల ఆదాయాలు మెరుగవుతాయి.
ప్రభుత్వ పెట్టుబడులు, సేవలు, వ్యవసాయ విధానాలు సక్రమంగా ఉండడానికిగాను ఆయా దేశాలు పరస్పరం సహకరించుకోవడం కొనసాగించాలి. చిన్న తరహా సంస్థల పెట్టుబడికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. ఆహారోత్పత్తిరంగంలో పని చేస్తున్న మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకొని ఈ సహకారం కొనసాగాలి.
వ్యవసాయపరంగా ఆఫ్రికా దేశాలకు భారత్ అందించే సహకారం ఆరోగ్యకరంగా ఉండేలా చూడాలి. ఆహార ఉత్పత్తికి ప్రాధాన్యతనిచ్చేలా, ఆ ఆహారం పోషక విలువలతో కూడినదై ఉండేలా చూడాలి. స్థానిక సంప్రదాయ ఆహార వ్యవస్థలకు, జీవ వైవిధ్యానికి ఎలాంటి లోటు లేకుండా వ్యవసాయ సహకారం కొనసాగాలి.
వాతావరణ మార్పులపైన ఆధారపడే రంగం వ్యవసాయ రంగం. వాతావరణ మార్పులపైన వ్యవసాయరంగానికి సంబంధమున్నవారిలో తగిన అవగాహన కల్పించడానికి పనికొచ్చే వ్యవస్థలను తగినన్ని తయారు చేసుకునేలా ఆర్థిక స్థోమతల్నిపెంచాలి. తద్వారా ఎలాంటి అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వ్యవసాయరంగం నిలదొక్కుకుంటుంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో సిఓపి 21 పేరు మీద చర్చలు జరగనున్నాయి. ఇందులో సమగ్రమైన వాతావరణ మార్పు ఒడంబడికను ప్రవేశపెడతారు. దీనికి తుదిరూపు నివ్వడానికిగాను ఆఫ్రికా, భారత్ ల సహకారం, సమన్వయం మరింత మెరుగవ్వాలి.
పునర్వినియోగ ఇంధన రంగంలో సహకారం
32. ఆఫ్రికా, భారత్ ల మధ్యన పునర్వినియోగ ఇంధనోత్పత్తిలో కొనసాగుతున్న సహకారాన్ని మరింత ఎక్కువ చేయాలి. సౌర, పవన, జల, బొగ్గు, బయో మాస్ ఇంధన శక్తుల ఉత్పత్తి వాటి సరఫరా వ్యవస్థల నిర్మాణంలో ఈ సహకారాన్నిమరింత మెరుగు పరచాలి.
33. సముద్ర జలాల ఆర్థిక రంగంలో సహకారం
ఆఫ్రికా దేశాల్లోనూ, భారత్ లోనూ భారీ సంఖ్యలో ప్రజలు సముద్ర సంపదపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఆఫ్రికా, భారత్ ప్రజల అభివృద్ధికి సముద్ర సంపద ఎంతగానో దోహదం చేస్తోంది. ఈ మధ్యకాలంలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. దేశాల మధ్యగానీ, దేశంలోని ప్రాంతాల మధ్యగానీ వాణిజ్యానికి సముద్రాలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. సముద్ర సంపద ద్వారా ఆయా దేశాల ప్రజలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు.
34 ఈ విషయంలో ఆఫ్రికా, భారత్… కలిసి చేపట్టాల్సిన అంశాలపైన ఒక అంగీకారానికి వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి.
ఈ విషయంలో ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకొని ఆఫ్రికా, ఇండియా సహకారాన్ని మెరుగుపరచాలి. ఇందుకుగాను శిక్షణ, సామర్థ్య నిర్మాణ పనులు ఉమ్మడిగా చేపట్టాలి. సుస్థిరంగా జలసంపదను పొందడం, సముద్ర సంబంధ కార్యక్రమాల ద్వారా సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం, సముద్ర వనరులను అందుబాటులోకి తెచ్చుకోవడం,
సముద్రేతర వనరుల అన్వేషణ, పర్యావరణ అనుకూల పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడం, పునర్వినియోగ ఇంధన తయారీ, ఆధునిక హెచ్చరిక పరికరాల ద్వారా విపత్తు ప్రమాదాలను తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఇంకా ఇతర తీరప్రాంత, సముద్ర అధ్యయనాల్లో ఈ సహకారం కొనసాగాలి.
నౌకాశ్రయాల కార్యకలాపాల్లనూ, సముద్ర రవాణాలోనూ సహకరించుకోవాలి. చట్ట వ్యతిరేకంగా, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేపల వేట జరగకుండా చూడడంలనూ, హైడ్రోగ్రఫీ సర్వేలల్లో ఆఫ్రికా, భారత్ లు సహకరించుకోవాలి.
ప్రాథమిక సౌకర్యాల కల్పన రంగంలో సహకారం
35. ఈ రంగంలో ఇప్పటికే కొనసాగుతున్న సహకారాన్ని అధికం చేయాలి. శిక్షణ, సామర్థ్య నిర్మాణం, రాయితీతో కూడిన పరపతి సౌకర్యంద్వారా కన్సల్టెన్సీతోపాటు ప్రాజెక్టు అమలును చేపట్టడం, నీటి సరఫరా నిర్వహణ, సముద్ర జలాలపైన సంబంధబాంధవ్యాలను కొనసాగించడం, రోడ్లు, రైల్వేల నిర్మాణం, వాటిని ఆధునీకరరించడంలోనూ ఈ సహకారాన్ని మరింతగా మెరుగుపరచాలిజ. విద్య, నైపుణ్యాల అభివృద్ధిలో సహకారం
36. ఆఫ్రికా ఇండియా ఫోరం శిఖరాగ్ర సమావేశం 2011లో జరిగిన తర్వాతనుంచి ఆఫ్రికా దేశాలకు చెందిన 24 వేలమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది. ఆఫ్రికా దేశాల్లోని 60 శిక్షణా కేంద్రాల్లో 300 శిక్షణా సంబంధిత కోర్సులను నిర్వహించారు. ఐటీ, పునర్వినియోగ ఇంధనరంగం, వ్యవసాయం, మెరైన్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, మెరైన్ హైడ్రోగ్రఫీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వహణ, గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు, లాజిస్టిక్స్ అండ్ మేనేజ్ మెంట్, వాతావరణ మార్పుల అధ్యయనం, విపత్తు నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, నేరపరిశోధనా శాస్త్రం (ఫోరెన్సిక్ సైన్స్) , రక్షణ మరియు భద్రత మొదలైన విభాగాల్లో శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించారు.
37. ఆఫ్రికా, భారత్ విద్యారంగంలో సహకారానికిగల ప్రాథమిక ప్రాధాన్యతను గుర్తించాలి. నైపుణ్యాల బదిలీ ద్వారా ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా ఆర్థికరంగం, శాస్త్ర సాంకేతిక రంగం, సామాజిక అభివృద్ధికి యువత సేవలు అధికమవుతాయి. అజెండా 2063లో ప్రత్యేకంగా ప్రస్తావించినట్టుగా కీలకమైన రంగాల్లో తలెత్తే అవకాశాలు, సవాళ్లకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల్ని విస్తరించుకోవచ్చు. ఈ అవసరాన్ని ఆఫ్రికా, భారత్ గుర్తించాలి.
38. శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశోధన, అన్వేషణా రంగాల అభివృద్ధిని ఆఫ్రికా, భారత్ అర్థం చేసుకోవాలి. ఇది మొత్తం అభివృద్ధికి కీలకమని తెలుసుకోవాలి.
39. విద్యాసంస్థల్లో ప్రాథమిక స్థాయిల్లోనే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సాంకేతిక శాస్త్రాలను (ఐసిటి) పరిచయం చేయాల్సి ఉంటుంది. ఈ విషయానికి గల ప్రాధాన్యతను ఆఫ్రికా దేశాలు, ఇండియా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఐసిటి వల్ల సామర్థ్య నిర్మాణం జరుగుతుంది. విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక రంగాలు లబ్ధి పొందుతాయి. పేదరిక నిర్మూలన జరుగుతుంది. ప్రజలకు అందాల్సిన సేవలు మెరుగవుతాయి.
40. ఆఫ్రికాలో పాన్ ఆఫ్రికన్ ఇ నెట్ వర్క్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలుకావడం ఎంత ముఖ్యమో ఆఫ్రికా దేశాలు, ఇండియా గుర్తించాలి. డిజిటల్ పరంగా ఆఫ్రికా దేశాల్లో ఉన్న అంతరాలు తగ్గడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కృషి చేయడానికి అవకాశముంది. గుణాత్మకమైన విద్య, ఆరోగ్యరంగాల సేవలు ఆఫ్రికా ప్రజలకు సులువుగా అందుబాటులోకి రావడానికి ఈ ప్రాజెక్ట్ దోహదం చేస్తుంది.
41. ఈ నేపథ్యంలో ఆఫ్రికా, భారత్ అంగీకారానికి వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలోనూ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలోనూ సహకారాన్ని కొనసాగించాలి.
పటిష్టమైన, విశ్వసనీయత కలిగిన, అందరికీ అందుబాటులోకి రాగల ఫైబర్ ఆప్టిక్ మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఉమ్మడి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి. ఫైబర్ ఆప్టిక్ మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటే మేలైన ఆఫ్రికా సమాచార సమాజం రూపుదిద్దుకుంటుంది. అంతే కాదు సంకలిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధితులందరికీ విశ్వసనీయమైన ఐసీటీ నెట్ వర్క్స్, సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఆఫ్రికా దేశాల్లోనూ, భారత్ లోనూ… వినియోగదారులకు అందుబాటులో ఉన్న సంస్థల మధ్య పరస్పర చర్చా వాతావరణం, ఇచ్చిపుచ్చుకోవడం, భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ఇప్పటికే అమలులో ఉన్న పాన్ ఆఫ్రికన్ ఇ -నెట్ వర్క్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక వసతులను పునరుద్ధరించాలి. విస్తరించాలి. అంతేకాదు వాటిని అప్ గ్రేడ్ చేయాలి కూడా. తద్వారా ఇ నెట్ వర్క్ ప్రాజెక్టును సమర్థవంతంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. తద్వారా పరస్పరం ప్రాధాన్యతనిచ్చే కొత్త రంగాలను ఈ ఇ-నెట్ వర్క్ ప్రాజెక్టులో కలుపునే దిశగా మౌలిక వసతులుండాలి.
ఒకరి అనుభవాలను మరొకరు పంచుకోవడం మరింత అధికం చేయాలి. లింగ వివక్షత లేని కోర్సులను అందించాలి. నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలాంటి చర్యలను చేపట్టడంద్వారా సామర్థ్య నిర్మాణాన్ని చేపట్టాలి.
ఇంజినీరింగ్, వైద్యం, సాంకేతిక రంగం, వ్యవసాయంతోపాటు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న పలు రంగాల్లో ఆఫ్రికా సామర్థ్యం పెరగడానికి వీలుగా భారతదేశం కొన్ని విద్యాపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫ్రికా విద్యార్థులు, విద్యారంగంలో పనిచేస్తున్నవారికి భారతదేశ ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకోవడానికి, శిక్షణ తీసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి. అందుకనుగుణమైన సౌకర్యాలు కల్పించాలి.
ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ – 111 ప్రకారం గుర్తింపు పొందిన, సామర్థ్యాన్ని నిర్మించే సంస్థల సేవలను కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వేగంగా అమలు చేయాలి. సామర్థ్య నిర్మాణం, ఉమ్మడిగా పరిశోధన, పునర్వినియోగ ఇంధనాల వనరుల రంగాలలో సహకారాన్ని అధికం చేయాలి. సౌర, పవన, జల విద్యుత్ శక్తుల ఉత్పత్తిలో ఆఫ్రికా, భారత్ ల సహకారం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగాలి. అంతే కాదు సమర్థవంతమైన సరఫరా వ్యవస్థలను నెలకొల్పుకోవడానికి వీలుగా ఈ సహకారం ఉండాలి.
ఆరోగ్యరంగంలో సహకారం
42. మానవ వనరుల అభివృద్ధికి ఆరోగ్యరంగం అభివృద్ధి చెందడం కీలకమనే విషయాన్ని ఆఫ్రికా దేశాలు, భారత్ గుర్తించాలి. ఆరోగ్యరంగం అభివృద్ధి చెందినప్పుడే సామాజిక ఆర్థిక రంగాలు అభివృద్ధి చెందుతాయి.
43. హెచ్ఐవి, టీబీ, మలేరియా, ఎబోలా, పోలియో లాంటి వ్యాధులను అరికట్టడానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ, పరిశోధన, శిక్షణాభివృద్ధి రంగాల్లోనూ ప్రగతి చాలా అవసరం. ఇందులో సాధించిన అనుభవాలను ఆయా దేశాలు కలసి పనిచేయడం ద్వారా పంచుకోవాలి. కలసి పనిచేయాలని ఇప్పటికే ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయం అమలులో వాటికున్న నిబద్ధతను మరోసారి స్పష్టంగా చాటాలి.
44. తమ ప్రజలకు ఆహారభద్రతను కలిగించడం ఆయా దేశాల బాధ్యత. అంతేకాదు పోషకాహారం అందరికీ అందేలా చూడాలి. ఆహార భదత్ర, పోషకాహార భద్రతలను అందించడంలో మరింత చొరవ అవసరమనే విషయాన్ని ఆయా దేశాలు గుర్తించాలి. ఆయా దేశాలు తమ ప్రజలకు వాసిపరంగానూ, రాశిపరంగానూ తగినంత ఆహారాన్ని అందించి వారి ఆహారపు అలవాట్లకు ఎలాంటి కొరత లేకుండా చూడాలి.
45. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు, భారత్ అంగీకారానికి వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి…
అన్ని రకాల వైద్యసేవలు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఆయా దేశాలు కలసి పని చేయడానికి వీలుగా చర్యలు చేపట్టాలి. తద్వారా ప్రపంచాన్ని వణికిస్తున్న అంటువ్యాధులను అరికట్టడానికి కావలసిన సామర్థ్యం ఆయా దేశాల్లో మెరుగవుతుంది. అంతేకాదు ఎంతకూ లొంగని రోగాలను నియంత్రించడానికి వైద్య,
ఆరోగ్య రంగంలో విద్యాపరమైన కార్యక్రమాలను అమలు చేయాలి. ఆయా దేశాలు ఇందుకోసం అమలు చేయాల్సిన విధానాలను సూచించాలి. సేవల నిర్వహణ,
పరిశోధనలు చేయడం తదితర కార్యక్రమాలద్వారా చాలావరకు ఈ రంగంలో అభివృద్ధిని సాధించవచ్చు.
ప్రసవ సమయంలో మరణాలను తగ్గించడానికిగాను ఆఫ్రికాలో చైతన్యపూరిత కార్యక్రమం నడుస్తోంది. దీన్ని క్యాంపెయిన్ ఆన్ ఆక్సిలరేటెడ్ రిడక్షన్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ ఆఫ్రికా (సిఏఆర్ ఎంఎంఏ) అని అంటారు. ఇది మరింత మెరుగ్గా అమలు కావడానికి భారత్ మరింత మద్దతునివ్వాలి. ఆరోగ్యరంగంలో పనిచేసే వారికి శిక్షణ, విద్యను అందించడంద్వారా భారతదేశం సహకారం కొనసాగాలి.
మేలైన మందులు, చికిత్స అందరికీ అందుబాటులోకి వచ్చేలా ముఖ్యంగా జనరిక్ మందులు ఎలాంటి అడ్డంకులు లేకుండా అందుబాటులోకి వచ్చేలా చూడాలి.
ఈ విషయంలో సహకారం కొనసాగడానికిగాను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు టివో ) అమలు చేస్తున్న ట్రిప్ప్ (ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ )
ఒప్పందం ప్రకారం ఆయా దేశాలు నడుచుకోవచ్చు. అందుకోసం ఆయా దేశాలకు సంక్రమించిన హక్కులను పూర్తిగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని అందరూ గుర్తించాలి.
వైద్యులకు, ఆరోగ్యరంగ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలద్వారా టెలీ మెడిసిన్, ఇ- హెల్త్ అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించడానికి వీలుగా ఈ శిక్షణ కొనసాగాలి.
మందుల తయారీ, సేకరణ రంగంలో ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ఫార్మాసూటికల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాన్ ఫర్ ఆఫ్రికా (ఆఫ్రికా కోసం మందుల తయారీ పథకం) కింద తయారు చేసుకున్న విధివిధానాలప్రకారమే ఆఫ్రికా, భారత్ లలో ఈ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
సంప్రదాయ మందుల రంగంలో అభివృద్ధి, ఆ మందులు అందరికీ అందుబాటులోకి తేవడానికి, వాటి విషయంలో పరిశోధన జరగడానికిగాను ఆయా దేశాలు తగిన చర్యలు చేపట్టాలి. మేధోపరమైన హక్కులు, నియంత్రణ చర్యల విషయంలో ఆయా దేశాలు చర్చలు కొనసాగించాలి.
ఆరోగ్యరంగ వ్యవస్థల్లోను, కమ్యూనిటీ ఆరోగ్యకార్యక్రమాల్లో అభివృద్ధిని సాధించడానికి ఆయా దేశాలు తమ అనుభవాలను, ప్రత్యేక నైపుణ్యాలను ఒకరితో మరొకరు పంచుకోవాలి.
ఆహార ఉత్పత్తిలో సహకారం, ఇచ్చిపుచ్చుకోవడం జరిగితే ఆయా దేశాల ప్రజలకు ఆహార లభ్యత పెరుగుతుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అందుతుంది.
శాంతి భద్రతల రంగంలో సహకారం
46.ఆయా దేశాలు అభివృద్ధి చెందాలంటే ప్రాథమికమైన నియమం ఒకటి ఉంది. అది శాంతి, భద్రత, సుస్థిరత చాలా ముఖ్యమైన అంశాలనే విషయాన్ని ఆఫ్రికాదేశాలు, భారత్ లు గుర్తించడం.
47. మాలి, సోమాలియా మొదలైన దేశాల్లో ఆఫ్రికా యూనియన్ చేపట్టిన కార్యక్రమాలకు భారతదేశం నిబద్ధతతో కూడిన మద్దతును అందిస్తోంది. ఈ విషయాన్ని ఆఫ్రికా ప్రశంసించింది.
48. ఈ విషయంలో ఆఫ్రికా, భారత్ అంగీకరించిన అంశాలు ఇలా ఉన్నాయి.
ఆఫ్రికా శాంతి, భద్రతల విధివిధానాలకనుగుణంగా చేపట్టిన ఆఫ్రికా యూనియన్ శాంతి, భ్రదతా కార్యక్రమానికి మద్దతు పలకాలి.
ఘర్షణ నివారణ, నివారణ నిర్వహణ, తీసుకున్న నిర్ణయాల అమలుకోసం చేపట్టే కార్యక్రమాలకు మద్దతు పలకాలి.
సముద్ర జలాలపైన భద్రతా సమస్యల పరిష్కారంలో సహకారం నిరంతరం కొనసాగాలి. ఇందుకోసం శిక్షణ, సామర్థ్య నిర్మాణం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం,
నిఘాలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. సముద్ర జలాలపైన కమ్యూనికేషన్ లైన్లు భద్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ సముద్ర నేరాల నివారణ,
ఉగ్రవాదంపై పోరాటం, చట్టవ్యతిరేకంగా జరిగే చేపలవేటను అడ్డుకోవడం, మత్తుమందులు, ఆయుధాలు, ఇంకా ఇతర మానవుల అక్రమ చేరవేత పైన నిఘా, హైడ్రోగ్రఫీ సర్వే కార్యక్రమాలు చేపట్టాలి.
ఉగ్రవాదాన్ని దాని యొక్క అన్ని రూపాలపై పోరాటానికిగాను ఆఫ్రికా, భారత్ మధ్య సరైన సమన్వయం, సహకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
హింసాత్మకమైన తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం అంతర్జాతీయ ఉగ్రవాదంపైన సమగ్రమైన సమావేశాన్ని ఎంతవీలైతే అంత తొందరగా ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా చర్యలు చేపట్టాలి.
సైబర్ సెక్యూరిటీ విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న అత్యున్నతమైన విధానాల్ని ఆయా దేశాలు పంచుకోవాలి. సైబర్ నేరాలను అరికట్టడానికి, ఉగ్రవాద కార్యక్రమాలకోసం ఇంటర్ నెట్ ను ఉపయోగించేవారిపై ఉక్కుపాదం మోపడానికి ఈ సహకారం చాలా అవసరం.
స్థానికంగానూ, ఇంకా ఇతర రూపాల్లోని సహకారం
49. ఆఫ్రికా యూనియన్ స్థానిక ఆర్థిక సమాజాల(రీజనల్ ఎకనమిక్ కమ్యూనిటీస్..ఆర్ ఇ సి)కు, ఇండియాకు మధ్యన ఫలప్రదంగా కొనసాగుతున్న సహకారాన్ని
అభినందించాలి.
50. 2014 ఆగస్టు నెలలో న్యూఢిల్లీలో భారత్ కు, ఎనిమిది స్థానిక ఆర్థిక సమాజాలకు (ఆర్ ఇసిలు) మధ్య జరిగిన మూడో సమావేశాన్ని అభినందనపూర్వకంగా గుర్తించే పని చేయాలి. భారత్ కు, ఆఫ్రికా దేశాలకు మధ్యన వ్యాపార, వాణిజ్యాలు అభివృద్ధి కావడానికి వీలుగా ఈ ఆర్ ఇ సీలు పని చేశాయి. ప్రమాణాలలు, నియమనిబంధనలు సాఫీగా కొనసాగడానికి వీలుగా అవి పని చేశాయి. ఆఫ్రికా, భారత్ లు ఉమ్మడిగా మార్కెట్లను నెలకొల్పడానికి ఆర్ ఇ సిలు కృషి చేశాయి.
51. ఈ విషయంలో ఆఫ్రికా, భారత్ లు అంగీకారానికి వచ్చిన అంశాలు..
ఇప్పటికే కొనసాగుతున్న సహకారాన్ని భారత్, ఆఫ్రికా యూనియన్, ఆర్ ఇ సీలు మరింత అధికం చేయాలి. సామర్థ్య నిర్మాణం, మానవవనరుల అభివృద్ధి, ఆహార, వ్యవసాయ రంగాల్లో ప్రాసెసింగ్, నియమనిబంధనలు సడలించి రుణాలు ఇవ్వడం ద్వారా స్థానిక ప్రాజెక్టుల నిర్మాణం తదితర చర్యల్ని చేపట్టాలి.
పర్యవేక్షణ వ్యవస్థ
52. ఆఫ్రికా, భారత్ ల మధ్య సహకారం విషయంలో కుదిరిన అంగీకార అంశాల అమలును, గుర్తించిన ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలను సమీక్షించడానికి ఒక అధికారపూర్వకమైన నిరంతరం పని చేసే వ్యవస్థ ఉండాలి. ఆయా దేశాలకు చెందిన సమర్థవంతమైన సంస్థలతో ఈ వ్యవస్థను తయారు చేసుకోవాలి. పర్యవేక్షణ వ్యవస్థ విధివిధానాలను, దానికి సంబంధించిన వివరణాత్మకమైన కార్యచరణను మూడు నెలల్లోపు అందరూ కలసి అభివృద్ధి చేయాలి.
After the rallies in Bihar, headed to Hyderabad House for 12 bilateral meetings with African leaders. @indiafrica2015 #IAFS
— Narendra Modi (@narendramodi) October 30, 2015
Bilaterals continue. The first one with President Omer Hassan Ahmed Elbashir of South Sudan. @indiafrica2015 #IAFS pic.twitter.com/goRynVkcoV
— PMO India (@PMOIndia) October 30, 2015
PM @narendramodi holds talks with Mr.Ernest BaiKoroma, President of Sierra Leone. @indiafrica2015 #IAFS pic.twitter.com/YaSrdJKUko
— PMO India (@PMOIndia) October 30, 2015