విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల రంగంలో సహకారం అనే అంశం పై భారతదేశం, డెన్మార్క్ ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది.
భారతదేశం మరియు డెన్మార్క్ ల మధ్య విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధాలలో ఒక చరిత్రాత్మకమైన మైలు రాయిని విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల రంగంలో సహకారం అనే అంశం పై ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం పై 2018 మే నెల 22వ తేదీన సంతకాలు చేయడం ద్వారా అందుకోవడమైంది.
ప్రయోజనాలు:
ఇది ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల రంగాలలో రెండు దేశాల ప్రయోజనాల యొక్క మేలు కలయిక ద్వారా పరస్పర బలాలకు ఒక నూతనోత్తేజం లభించనుంది. ఈ మూడు రంగాల లోను ఉమ్మడి ప్రయోజనాలను పొందేందుకు గాను భారతదేశం మరియు డెన్మార్క్ ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడంతో పాటు సమన్వయాన్ని ఏర్పరచడం కూడా ఈ ఒప్పందం యొక్క ధ్యేయం. ఇందులో పాలుపంచుకొనే వారిలో భారతదేశం మరియు డెన్మార్క్ లకు చెందిన విజ్ఞాన శాస్త్ర సంస్థలు, విద్యారంగ నిపుణులు, పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) లేబొరేటరీ లు, ఇంకా కంపెనీ లు ఉంటాయి. తక్షణ సమన్వయానికి అవకాశం ఉన్న రంగాలుగా నవీకరణ యోగ్య శక్తి, జలం, మెటీరియల్ సైన్స్, తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలు, సింథెటిక్ బయోలజి, ఇంకా నీలి ఆర్థిక వ్యవస్థ లను గుర్తించడమైంది.
***