Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐసిఎమ్ఆర్ కు మ‌రియు ఫ్రాన్స్ కు చెందిన ఐఎన్ఎస్ఇఆర్ఎమ్‌ కు మ‌ధ్య కుదిరిన ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసిఎమ్ఆర్) కు మ‌రియు ఫ్రాన్స్ కు చెందిన ఇన్‌స్టిట్యూట్ నేశ‌న‌ల్ ద లా శాన్‌టీట్ డీ లా రిస‌ర్చ్ మెడికాలే (ఐఎన్ఎస్ఇఆర్ఎమ్‌) కు మ‌ధ్య 2018 వ సంవ‌త్స‌రం మార్చి నెల లో కుదిరినటువంటి ఒక‌ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాన్ని (ఎమ్ఒయు) గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం దృష్టికి తీసుకు వ‌చ్చారు.

ముఖ్యాంశాలు:

ఈ ఎమ్ఒయు చికిత్స, జీవ శాస్త్ర విజ్ఞానం మ‌రియు ఆరోగ్య ప‌రిశోధ‌క రంగాల‌లో ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల సంబంధిత అంశాల‌పై స‌హ‌కారానికి ఉద్దేశించింది. ఇరు ప‌క్షాల‌ యొక్క ఉత్తమ విజ్ఞాన సంబంధ ప్రావీణ్యాల ప్రాతిప‌దిక‌న..

i. మ‌ధుమేహం ఇంకా మెట‌బాలిక్ అనారోగ్యాలు;

ii. బ‌యో-ఎథిక్స్, ఇంకా జీన్ ఎడిటింగ్ టెక్నిక్ లు,

iii. అరుదైన వ్యాధుల తో పాటు

iv. ఇరు ప‌క్షాల‌కు మ‌ధ్య చ‌ర్చ‌ల అనంత‌రం ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ఇమిడివుండ‌గ‌ల మ‌రే ఇత‌ర రంగాల‌లో అయినా..
ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను వ‌హించడాన్ని గురించి పరిశీలించేందుకు రెండు పక్షాలు సమ్మతించాయి.

ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడిప‌డిన రంగాల‌లో ఐసిఎమ్ఆర్ మ‌రియు ఐఎన్ఎస్ఇఆర్ఎమ్ ల మ‌ధ్య సంబంధాల‌ను అంత‌ర్జాతీయ శాస్త్ర విజ్ఞానం మ‌రియు సాంకేతిక విజ్ఞాన సంబంధ స‌హ‌కారం చ‌ట్రం పరిధిలో ఈ ఎమ్ఒయు మ‌రింత బ‌లోపేతం చేయనుంది. నిర్ధిష్ట రంగాల‌లో వైద్య ప‌రిశోధ‌నకు సంబంధించిన ప‌నుల‌ను ముందుకు తీసుకు పోవ‌డానికి ఉభ‌య ప‌క్షాల శాస్త్ర విజ్ఞాన సంబంధ ప్రావీణ్యం తోడ్పడనుంది.

***