Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూమితో సమానంగా తిరిగే ఉపగ్రహ వాహక నౌక మార్క్-III కార్యక్రమ కొనసాగింపుకు మంత్రిమండలి ఆమోదం


భూమితో సమానంగా తిరిగే ఉపగ్రహ వాహక నౌక మార్క్-III (జి ఎస్ ఎల్ వి ఎంకే-III) కార్యక్రమ కొనసాగింపు (మొదటి దశ) కు అవసరమైన నిధులు సమకూర్చడానికి – ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో 10 జి ఎస్ ఎల్ వి (ఎంకే-III) అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి మొత్తం అంచనా వ్యయం రూ. 4338.20 కోట్లు. ఈ వ్యయంలో 10 జి ఎస్ ఎల్ వి (ఎంకే-III) అంతరిక్ష నౌకల వ్యయం, అవసరమైన సదుపాయాల కల్పన, కార్యక్రమ యాజమాన్యం, ప్రయోగ ప్రచారం మొదలైన ఖర్చులు కూడా ఇమిడి ఉన్నాయి.

జి ఎస్ ఎల్ వి ఎంకే-III) కార్యక్రమ కొనసాగింపు – పేజ్ 1 – దేశ ఉపగ్రహ సమాచార అవసరాలకోసం ప్రయోగించే 4 టన్నుల సమాచార ఉపగ్రహ ప్రయోగానికి అవసరమైన వాహక నౌకల మొదటి దశ.

జి ఎస్ ఎల్ వి ఎంకే-III వినియోగంలోకి వస్తే – 4 టన్నుల సమాచార ఉపగ్రహం ప్రయోగానికి, అంతరిక్ష మౌలిక సదుపాయాలను స్థిరీకరించుకోడానికీ, పటిష్ట పరచుకోడానికీ, విదేశాలనుండి అంతరిక్ష ప్రయోగాల కోసం ఆధారపడకుండా దేశం స్వయం సమృద్ధి సాధించినట్లవుతుంది.

గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, డి టి హెచ్, వి శాట్ మరియు టెలివిజన్ ప్రసారాలకు అవసరమైన ట్రాన్స్ పాండర్ల లభ్యతను పెంపొందించడానికీ, కొనసాగించడానికీ ఉపయోగపడే అత్యున్నత శ్రేణి ఉపగ్రహాలకు ఉన్న జాతీయ డిమాండ్ చేరుకోడానికీ – సమాచార ఉపగ్రహాల ప్రయోగ అవసరాలను జి ఎస్ ఎల్ వి ఎంకే-III కొనసాగింపు కార్యక్రమం – పేజ్ 1 తీరుస్తుంది.

ఈ జి ఎస్ ఎల్ వి ఎంకే-III కొనసాగింపు కార్యక్రమం – పేజ్ 1 – జి ఎస్ ఎల్ వి ఎంకే-III వాహక నౌకల ప్రయోగానికి – మొదటి దశగా ఉంటుంది. ఈ అనుమతి వల్ల 2019-2024 మధ్య కాలంలో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడానికి వీలు కలుగుతుంది.

నేపధ్యం :

భూమితో సమానంగా తిరిగే కక్ష్య (జిటిఓ) లోకి 4 టన్నుల తరగతి ఉపగ్రహాలను ప్రయోగించే సామర్ధ్యాన్ని దేశీయంగా సాధించడం కోసం – భూమితో సమానంగా తిరిగే ఉపగ్రహ వాహక నౌక మార్క్-III (జి ఎస్ ఎల్ వి ఎంకే-III) ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది 2014 లో ఒక ప్రయోగాత్మక నౌక (ఎల్ వి ఎమ్ 3 – X) ను, మరియు 2017 లో ఒక అభివృద్ధి నౌక (జి ఎస్ ఎల్ వి ఎంకెIII -డి1) ను పూర్తిచేసింది. రెండవ అభివృద్ధి నౌక ఈ ఏడాది 2018-19 రెండవ త్రైమాసికంలో పూర్తవుతుంది. 4 టన్నుల తరగతి సమాచార ఉపగ్రహాలను స్వతంత్రంగా అంతరిక్షంలోకి పంపడానికి ఈ మొదటి దశ కొనసాగింపు కార్యక్రమం తోడ్పడుతుంది. అలాగే ఉపగ్రహ ప్రయోగ సేవలకు ఉన్న అంతర్జాతీయ మార్కెట్లో మన వాణిజ్య సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు – 4 టన్నుల తరగతి సమాచార ఉపగ్రహాలను ప్రయోగించడంలో – జి ఎస్ ఎల్ వి ఎంకె-III తక్కువ ఖర్చు తో పనిచేసే వ్యవస్థగా నిలుస్తుంది.

*****