భారతదేశం మరియు ఈక్వటోరియల్ గినియ కు మధ్య సాంప్రదాయక వైద్య పద్ధతుల రంగంలో సహకారానికి ఉద్దేశించినటువంటి అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు పై 2018 ఏప్రిల్ 8వ తేదీన సంతకాలు అయ్యాయి.
సాంప్రదాయక వైద్య పద్ధతుల రంగంలో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని ఈ ఎమ్ఒయు ప్రోత్సహిస్తుంది.
పరిశోధన, శిక్షణ కోర్సులు, సమావేశాలు మరియు నిపుణుల డిప్యుటేషన్ లను నిర్వహించడానికి అవసరమైన ఆర్థిక వనరులను ఆయుష్ మంత్రిత్వ శాఖ కు కేటాయించిన బడ్జెట్ మరియు ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రణాళికా పథకాల నుండి వెచ్చించడం జరుగుతుంది.