Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో పిఎమ్ఎన్‌సిహెచ్ ప్ర‌తినిధివ‌ర్గం భేటీ; 2018 పార్ట్‌న‌ర్స్ ఫోర‌మ్ యొక్క గుర్తింపు చిహ్నం అంద‌జేత‌

ప్ర‌ధాన మంత్రి తో పిఎమ్ఎన్‌సిహెచ్ ప్ర‌తినిధివ‌ర్గం భేటీ; 2018 పార్ట్‌న‌ర్స్ ఫోర‌మ్ యొక్క గుర్తింపు చిహ్నం అంద‌జేత‌

ప్ర‌ధాన మంత్రి తో పిఎమ్ఎన్‌సిహెచ్ ప్ర‌తినిధివ‌ర్గం భేటీ; 2018 పార్ట్‌న‌ర్స్ ఫోర‌మ్ యొక్క గుర్తింపు చిహ్నం అంద‌జేత‌


ది పార్ట్‌ న‌ర్ షిప్ ఫ‌ర్ మేట‌ర్న‌ల్‌, న్యూ బార్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పిఎమ్ఎన్‌సిహెచ్‌) యొక్క ప్ర‌తినిధివ‌ర్గం ప్ర‌ధాన మంతి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు స‌మావేశ‌మైంది. పిఎమ్ఎన్‌సిహెచ్ పార్ట్‌న‌ర్స్ ఫోర‌మ్ ముగ్గురు చాంపియ‌న్ లు కేంద్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా, చిలీ పూర్వ అధ్యక్షురాలు మ‌రియు పిఎమ్ఎన్‌సిహెచ్ బోర్డు కు ఇన్ కమింగ్ చైర్ డాక్టర్ మిశెల్ బచెలట్, ప్ర‌ముఖ సినీ న‌టి మ‌రియు యుఎన్ఐసిఇఎఫ్ సౌహార్ద రాయ‌బారి మిజ్ ప్రియాంక చోప్డా లతో పాటు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి ఎ.కె. చౌబే మరియు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి మిజ్ ప్రీతి సూద‌న్ లు ఈ ప్ర‌తినిధివ‌ర్గం వెంట ఉన్నారు. న్యూ ఢిల్లీ లో 2018 డిసెంబ‌ర్ 12-13 తేదీల‌లో జ‌రుగ‌నున్న పార్ట్‌ న‌ర్స్ ఫోర‌మ్ 2018 స‌మావేశాల‌కు ప్ర‌ధాన మంత్రి ని ఆహ్వానించేందుకు గాను ఆయ‌న తో ప్ర‌తినిధి వ‌ర్గం భేటీ అయింది. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌భుత్వ అధినేత‌లు మ‌రియు ఆరోగ్య మంత్రులు, ఇంకా 1200 మంది ప్ర‌తినిధులు ఈ స‌మావేశాల‌లో పాలుపంచుకోనున్నారు. పిఎమ్ఎన్‌సిహెచ్ అనేది 92 దేశాలు, ఇంకా 1000 కి పైగా సంస్థ‌ల‌తో కూడిన ఒక ప్ర‌పంచ స్థాయి భాగ‌స్వామ్య సంస్థ‌. పిఎమ్ఎన్‌సిహెచ్ ఫోర‌మ్ కు పేట్ర‌న్‌ గా ఉండేందుకు ప్ర‌ధాన మంత్రి ద‌య‌ తో అంగీక‌రించారు; ఫోర‌మ్ యొక్క గుర్తింపు చిహ్నాన్ని ఆయ‌న స్వీక‌రించారు.

పార్ట్‌న‌ర్ శిప్ చేప‌ట్టవలసివున్న కార్య‌క్ర‌మాల‌ను గురించి ఇన్ క‌మింగ్ చైర్ డాక్టర్ మిశెల్ బచెలట్ ప్ర‌ధాన మంత్రి కి వివ‌రించి, మ‌హిళ‌ల, బాల‌ల మ‌రియు యువ‌జ‌నుల సాధికారిత‌ స‌వాలును ఎలా అధిగ‌మించాలనే అంశం పై ప్ర‌ధాన మంత్రి యొక్క అభిప్రాయాల‌ను కూడా తెలుసుకో గోరారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి పేద‌ల మ‌రియు గ‌ర్భ‌వ‌తుల పోష‌కాహార సంబంధ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు వారికి సాముదాయిక ఆహార పంపిణీ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం కోసం ప్రైవేటు రంగం యొక్క భాగ‌స్వామ్యం ద్వారా సంస్థాగ‌త బ‌ట్వ‌ాడాల‌ను పెంచేందుకు గుజ‌రాత్ లో చేపట్టిన కార్యక్రమాల తాలూకు త‌న స్వీయ అనుభ‌వాల‌ను ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యుల దృష్టికి తీసుకు వ‌చ్చారు. దీటైన క‌మ్యూనికేష‌న్ వ్యూహాన్ని అనుసరించాల‌ని ఆయ‌న నొక్కిపలికారు. ‘పాలుపంచుకోవ‌డ‌మే భాగ‌స్వామ్యం’ అని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పౌష్టికాహారం, వివాహ‌ యుక్త వ‌య‌స్సు, ప్రసవానికి ముందు- ప్ర‌స‌వానికి త‌రువాత తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తదితర ముఖ్య‌ విష‌యాల‌పై ప్ర‌చారంలో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను, ప్ర‌త్యేకించి యువ‌త‌ను భాగ‌స్తుల‌ను చేయాల‌ని, మ‌హిళ‌లు, బాల‌లు మ‌రియు య‌వ్వ‌న ద‌శ‌లో ఉన్న వారి కోసం ఉద్దేశించిన కార్య‌క్ర‌మాలపై స‌మ‌ర్ధ‌మైన రీతిలో క‌మ్యూనికేష‌న్‌, ఇంకా ఈ కార్య‌క్ర‌మాల అమ‌లు కు సంబంధించి ఉపాయాల‌ను ఆహ్వానించాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కోవ‌కు చెందిన ఇతివృత్తాల‌పై ఒక ఆన్ లైన్ క్విజ్ పోటీని మ‌నం నిర్వ‌హించ‌వ‌చ్చని, బ‌హుమ‌తులు గెలుచుకొన్న‌ వారికి పుర‌స్కారాల‌ను 2018 డిసెంబ‌ర్ లో జ‌రుగ‌నున్న పార్ట్ న‌ర్స్ ఫోర‌మ్ స‌మావేశంలో అందించ‌వ‌చ్చ‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.