జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.80 వేల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి..
వరద సహాయ చర్యలు, పునర్ నిర్మాణానికి, వరదల నిర్వహణ కోసం – రూ. 7854 కోట్లు
వరదల ధాటికి దెబ్బతిన్న ఇళ్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు చిన్న వ్యాపారులు తిరిగి నిలదొక్కుకోవడానికి వీలుగా సహాయం. జీలం నది, దాని ఉప నదుల ద్వారా వచ్చే వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం, జీలం-తావి వరద పునర్ నిర్మాణ ప్రాజెక్టు మొదలైన వాటి కోసం ఈ నిధుల్ని ఖర్చు చేస్తారు.
రోడ్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి – రూ.42,611 కోట్లు
జోజిలా టన్నెల్ నిర్మాణం, జమ్మూకశ్మీర్ లో పాక్షికంగా రింగురోడ్ల నిర్మాణం, భారత్ మాల పేరిట ఆయా ప్రదేశాలను కలిపే ప్రాజెక్టులు, ప్రధాన రహదారులను ఆధునీకరించడం, ఇంకా ఇతర ప్రాజెక్టుల కోసం ఈ నిధుల్ని ఖర్చు చేస్తారు.
విద్యుత్, పునఃవినియోగ ఇంధన రంగాల కోసం రూ.11708 కోట్లు
విద్యుత్ రంగ మౌలిక వసతుల నిర్మాణం, పంపిణీ వ్యవస్థలను విస్తరించడానికి, సౌరవిద్యుత్, చిన్న తరహా జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైనవాటికి ఈ నిధుల్ని ఖర్చు చేస్తారు.
ఆరోగ్య రంగానికి రూ.4900 కోట్లు
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్-ఏఐఐఎంఎస్) స్థాయిగల సంస్థల్ని రాష్ట్ర రాజధాని నగరాల్లో నిర్మించడానికి, రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన మొదలైన వాటికి ఈ నిధుల్ని ఖర్చు చేస్తారు.
మానవ వనరుల అభివృద్ధికి, నైపుణ్యాల అభివృద్ధికి, క్రీడల కోసం …రూ.2600 కోట్లు
జమ్మూలో ఐఐటీ, ఐఐఎం సంస్థలను నెలకొల్పుతారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో హిమాయత్ పథకం కింద ఒక లక్ష మంది యువతీ యువకులకు శిక్షణ ఇస్తారు. క్రీడారంగానికి చెందిన మౌలిక వసతుల్ని విస్తరిస్తారు.
వ్యవసాయం, ఆహార పదార్థాల తయారీ రంగాలకు రూ.529 కోట్లు
ఉద్యానవన పంటల రంగం అభివృద్ధికి, శీతలీకరణ గిడ్డంగుల సౌకర్యాల కల్పన మొదలైన వాటికి ఈ నిధులను ఖర్చు చేస్తారు.
పర్యాటకరంగానికి రూ.2241 కోట్ల కేటాయింపు
రాష్ట్రంలో యాభై పర్యాటక గ్రామాలను నెలొకొల్పుతారు. ఇంకా కొత్త ప్రాజెక్టులు, నూతన పర్యాటక ప్రాంతాల్ని నెలకొల్పడం మొదలైనవాటికి ఈ నిధుల్ని వినియోగిస్తారు.
పట్టణాభివృద్ధికి రూ.2312 కోట్ల రూపాయల కేటాయింపు
ఆధునిక నగరాల కోసం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం ఇందులోనుంచి నిధుల్ని కేటాయిస్తారు. జమ్మూకశ్మీర్ లోని పలు నగరాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు వినియోగిస్తారు.
పునరావాస ప్రజల భద్రత, సంక్షేమంకోసం రూ.5263 కోట్లు
కశ్మీరి శరణార్థులకు ఉద్యోగాలను ఇవ్వడానికి, ఛాంబ్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన కుటుంబాలకు పునరావాసాన్ని కల్పించడానికి, గృహాల నిర్మాణానికి, ఇండియా రిజర్వ్ బెటాలియన్ల ఏర్పాటుకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఇండియా రిజర్వ్ బెటాలియన్లను తయారు చేసుకోవడం ద్వారా నాలుగు వేల మంది జమ్మూకశ్మీర్ యువకులకు ఉద్యోగాలు వస్తాయి.
నాణ్యమైన గొర్రె ఉన్ని తయారీని ప్రోత్సహించే ప్రాజెక్టు కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తారు
ప్యాకేజీ మొత్తం విలువ ..రూ.80, 068 కోట్లు
ప్రధాని జాతీయ సహాయనిధి కింద ఇది వరకే జమ్మూకశ్మీర్ కు కేటాయించిన రూ.837 కోట్ల రూపాయలు, వరద సహాయ చర్యల కోసం గత సంవత్సరం వెచ్చించిన వేయి కోట్ల రూపాయలను ఈ ప్యాకేజీలో కలపరు.
At the public meeting at SherE Kashmir Stadium reiterated the message that India is incomplete without Kashmiriyat. https://t.co/jWcby9yzRj
— NarendraModi(@narendramodi) November 7, 2015
The package for J&Kannounced today will give a boost to all-round development of the state & give wings to the aspirations of the youth.
— NarendraModi(@narendramodi) November 7, 2015
Guided by Mantra of 'Sabka Saath, SabkaVikas' our Govt. is ensuring that the fruits of progress reach every person in every part of India.
— NarendraModi(@narendramodi) November 7, 2015
Development projects that will contribute to the progress of J&K& the nation. pic.twitter.com/aymQlTvAjF
— NarendraModi(@narendramodi) November 7, 2015
There is something special about J&Kthat draws me there so often. Always a delight to visit & my gratitude to the people for the warmth.
— NarendraModi(@narendramodi) November 7, 2015