Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశానికి, జోర్డాన్ కు మ‌ధ్య గని తవ్వకాలకు మరియు ఎమ్ఒపి & రాక్ ఫాస్పేట్ బెనిఫీసియేశన్ కోసం ఉద్దేశించిన ఎమ్ఒయుకు, అలాగే జోర్డాన్ లో ఫాస్పారిక్ యాసిడ్‌/డిఎపి/ఎన్‌పికె ఎరువుల ఉత్పాద‌క స‌దుపాయం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


భార‌త‌దేశానికి, జోర్డాన్ కు మ‌ధ్య గని తవ్వకాలకు మరియు ఎమ్ఒపి & రాక్ ఫాస్పేట్ బెనిఫీసియేశన్ కోసం ఉద్దేశించిన ఎమ్ఒయు పై సంతకాలకు, అలాగే జోర్డాన్ లో ఫాస్పారిక్ యాసిడ్‌/డిఎపి/ఎన్‌పికె ఎరువుల ఉత్పాద‌క స‌దుపాయాన్ని ఏర్పాటు చేసి అక్కడి ఉత్పత్తులను 100 శాతం ప్రాతిపదికన భారతదేశానికి పంపించే దీర్ఘకాలిక ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు దేశం అవసరాలను తీర్చడం కోసం ముడి ప‌దార్థాలు, మ‌ధ్య‌స్థ సామ‌గ్రి, తుది స్థాయి పి & కె ఎరువులు స‌హేతుక ధ‌ర‌ల‌లో నిరంత‌రాయంగా స‌ర‌ఫ‌రా అయ్యేట‌ట్లుగా దోహ‌ద‌ం చేయనుంది.

****