Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో రేపు ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయన ఈటాన‌గ‌ర్ లో ఒక కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొని, దోర్ జీ ఖాండూ స్టేట్ క‌న్వెన్శన్ సెంట‌ర్ ను ప్రారంభిస్తారు. ఈ క‌న్వెన్శన్ సెంట‌ర్ లో ఒక స‌భా భ‌వ‌నం, స‌మావేశ మందిరాలు, ఇంకా ఒక ప్ర‌ద‌ర్శ‌న మందిరం కూడా ఉన్నాయి. ఇది ఈటాన‌గ‌ర్ లో ఒక ప్ర‌ముఖ‌మైన ఆర్ష‌ణ బిందువు కాగలదని భావిస్తున్నారు.

ప్ర‌ధాన మంత్రి స్టేట్ సివిల్ సెక్ర‌టేరియ‌ట్ బిల్డింగ్ ను కూడా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు. అలాగే, తోమొ రీబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ యొక్క అకాడ‌మీ బ్లాకు కు పునాది రాయిని కూడా వేయ‌నున్నారు.

అరుణాచల్ ప్ర‌దేశ్ నుండి ప్ర‌ధాన మంత్రి ఒక అన‌ధికార ప‌ర్య‌ట‌న నిమిత్తం త్రిపుర కు వెళ్తారు.

***