Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన‌ ఇండోనేశియా రాజ‌కీయ సంబంధ, శాసన సంబంధ మ‌రియు భ‌ద్ర‌త సంబంధ వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య శాఖ మంత్రి డాక్ట‌ర్ హెచ్‌. విరాంతో


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఇండోనేశియా రాజ‌కీయ సంబంధ, శాసన సంబంధ మ‌రియు భ‌ద్ర‌త సంబంధ వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య శాఖ మంత్రి డాక్ట‌ర్ హెచ్‌. విరాంతోఈ రోజు స‌మావేశమ‌య్యారు.

ప్ర‌ధాన మంత్రి 2016 డిసెంబ‌ర్ లో అధ్య‌క్షులు శ్రీ జోకో విడోడో భార‌త‌దేశంలో జ‌రిపిన ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావ‌డాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ నెలలోనే ఆసియాన్‌-ఇండియా కమెమరేటివ్ సమిట్ లో పాలుపంచుకోవ‌డానికి ఆసియాన్ దేశాల నేత‌లు భార‌త‌దేశానికి విచ్చేసే సందర్భంగా మ‌రోమారు అధ్య‌క్షులు శ్రీ‌ జోకో విడోడో కు స్వాగ‌తం ప‌లికేందుకు తాను ఎదురు చూస్తున్నాన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆయా నేత‌లు ఆ త‌రువాత జ‌రిగే గ‌ణ‌తంత్ర దిన వేడుకల‌కు కూడా ముఖ్య అతిథులుగా ఉంటారు.

స‌ముద్ర సంబంధ ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్నటువంటి భార‌త‌దేశం మ‌రియు ఇండోనేశియాల మ‌ధ్య నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో పాటు స‌ముద్ర సంబంధ భ‌ద్ర‌త రంగంలో స‌హ‌కారానికి విస్తృత‌మైన అవకాశాలు ఉన్నట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ప్ర‌ధాన మంత్రి ఈ సందర్భంగా భార‌త‌దేశానికి, ఇండోనేశియా కు మ‌ధ్య భ‌ద్ర‌తా సంబంధ చ‌ర్చ‌ల ఒక‌టో స‌మావేశ నిర్వహణను స్వాగ‌తించారు.