Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిలిప్పీన్స్ లో భార‌తీయుల‌ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి

ఫిలిప్పీన్స్ లో భార‌తీయుల‌ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి

ఫిలిప్పీన్స్ లో భార‌తీయుల‌ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి

ఫిలిప్పీన్స్ లో భార‌తీయుల‌ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి


ఫిలిప్పీన్స్ లో నివ‌సిస్తున్న‌ భార‌తీయుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మనీలా లో ప్ర‌సంగించారు.

ఆసియాన్ ప్రాంతం భార‌త‌దేశానికి చాలా ముఖ్య‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆసియాన్ ప్రాంతంతో భార‌త‌దేశానికి మాన‌సిక బంధంతో పాటు దీర్ఘ‌ కాలంగా ఉమ్మ‌డి వార‌స‌త్వం కూడా ఉందని ఆయ‌న చెప్పారు. మ‌రీ ముఖ్యంగా బుద్ధుడిని గురించి మ‌రియు రామాయ‌ణం గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ వార‌స‌త్వాన్ని పెంచి పోషించ‌డంలో ఈ ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ భార‌తీయులు ఒక కీల‌కమైన పాత్ర‌ను పోషిస్తున్నారని ఆయ‌న వివ‌రించారు.

ఏ ఇత‌ర దేశానికీ భార‌త‌దేశం ఎప్పుడూ హాని చేయ‌లేద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఒక‌టో ప్ర‌పంచ యుద్ధం లో మ‌రియు రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ కాలంలో ఒక‌టిన్న‌ర ల‌క్ష‌ల మంది భార‌తీయ సైనికులు దూర దేశాల‌లో వారి ప్రాణాల‌ను అర్పించి, త‌ద్వారా చేసిన త్యాగాన్ని గురించి ఆయన చెప్పుకు వ‌చ్చారు.

భార‌త‌దేశం యొక్క వ‌ర్త‌మానం కూడా ప్ర‌కాశ‌వంతంగాను మ‌రియు సంతోష‌క‌రంగాను ఉండి తీరాల‌ని ఆయ‌న అన్నారు. ‘‘ఆసియా యొక్క శ‌తాబ్దం’’గా చెబుతున్నటువంటి 21వ శ‌తాబ్దం ‘‘భార‌త‌దేశం యొక్క శ‌తాబ్ది’’గా మారేట‌ట్లు చూడ‌డానికి మ‌న‌మంతా సాధ్య‌మైన స‌క‌ల య‌త్నాలు చేయాల‌ని ఆయ‌న చెప్పారు.

పేద‌ల‌కు సాధికారితను క‌ల్పించ‌డం కోసం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జ‌న్ ధ‌న్ యోజ‌న మ‌రియు ఉజ్జ్వ‌ల యోజ‌న ల వంటి కార్య‌క్ర‌మాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. స‌బ్సిడీ కి ఆధార్ సంఖ్య‌ను ముడి పెట్ట‌డం ద్వారా పొందిన లాభాల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.