Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫీఫా అండ‌ర్- 17 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడిన భార‌తీయ జ‌ట్టు తో ప్ర‌ధాన మంత్రి భేటీ

ఫీఫా అండ‌ర్- 17 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడిన భార‌తీయ జ‌ట్టు తో ప్ర‌ధాన మంత్రి భేటీ

ఫీఫా అండ‌ర్- 17 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడిన భార‌తీయ జ‌ట్టు తో ప్ర‌ధాన మంత్రి భేటీ


ఇటీవ‌లే ముగిసిన ఫీఫా అండ‌ర్- 17 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడిన భార‌తీయ జ‌ట్టు స‌భ్యుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా క్రీడాకారులు ఫీఫా టోర్నమెంట్ లో భాగంగా మైదానం లోప‌ల మ‌రియు మైదానానికి వెలుప‌ల తాము గ‌డించిన అనుభ‌వాన్ని, తెలుసుకున్న విష‌యాల‌ను ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకు వ‌చ్చారు.

టోర్నమెంట్ ప‌ర్య‌వ‌సానం ప‌ట్ల నిరుత్సాహం చెంద‌వ‌ద్ద‌ని, దీనిని నేర్చుకొనేందుకు ఒక అవ‌కాశంగా ప‌రిగ‌ణించాలంటూ ప్ర‌ధాన మంత్రి ఆట‌గాళ్ళ‌లో ఉత్సాహాన్ని నింపారు. ఉత్సాహంతో, స్ఫూర్తితో పోటీ ప‌డ‌డం విజ‌య ప‌థంలో ఒక‌టో అడుగు అని ఆయ‌న చెప్పారు.

ఫుట్ బాల్ లో భార‌తదేశం ఎంతో సాధించ‌వ‌చ్చ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. క్రీడ‌లు వ్య‌క్తిత్వాన్ని అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డంలో, విశ్వాసాన్ని పెంపొందించుకోవ‌డంలో, ఇంకా వ్య‌క్తి స‌ర్వ‌తోముఖ పురోగ‌తిలో తోడ్ప‌డుతాయ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

యువ‌జ‌న వ్య‌వ‌హారాలు మ‌రియు క్రీడ‌ల శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త‌) శ్రీ క‌ర్న‌ల్ రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాఠౌడ్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

***