Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ‌డోద‌ర‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఆదివారంనాడు వ‌డోద‌ర‌లొ జ‌రిగిన ఒక బ‌హిరంగ స‌భ‌లో వ‌డోద‌ర సిటీ క‌మాండ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను,వాఘోడియా ప్రాంతీయ నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాన్ని, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నూత‌న కేంద్ర కార్యాల‌యభ‌వ‌నాన్ని జాతికి అంకితం చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్‌యోజ‌న ప‌థ‌కం (ప‌ట్ట‌ణ‌,గ్రామీణ‌) కింద ల‌భ్ది దారుల‌కు నిర్మించిన ఇళ్ల‌కు సంబంధించి న తాళాల‌ను ప్ర‌ధాన‌మంత్రి వారికి అంద‌జేశారు. స‌మీకృత ర‌వాణా కేంద్రం, ప్రాంతీయ నీటి స‌ర‌ఫ‌రా కేంద్రం , ఇంటి నిర్మాణ ప్రాజెక్టులు, ఒక ఫ్లై ఓవ‌ర్‌తోపాటు ప‌లు అభివృద్ధి , మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేశారు. ముద్రా – ఢిల్లీ పెట్రోలియం ఉత్ప‌త్తుల పైప్‌లైన్ సామ‌ర్ధ్యం పెంపు, వ‌డోద‌ర‌లో హెచ్‌పిసిఎల్‌కు చెందిన గ్రీన్‌ఫీల్డ్ మార్కెటింగ్ టెర్మిన‌ల్ ప్రాజెక్టుకు ప్ర‌ధాని శంకుస్థాపన చేశారు.

. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ప్ర‌ధాని, ఇవాళ వ‌డోద‌ర‌లో చేప‌డుతున్న‌న్ని అభివృద్ధి ప‌థ‌కాలు ముందెన్న‌డూ లేనంతటి స్థాయిలో ఉన్నాయ‌న్నారు.

ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త అభివృద్ధి అని ఈ విష‌యంలో ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌తో ఉంద‌ని అంటూప్ర‌ధాని, పౌరుల మేలు కోస‌మే నిధులు వినియోగిస్తున్న‌ట్టు ప్ర‌ధాని చెప్పారు.

త‌న చిన్న‌ప్ప‌టి నుంచీ ఘోఘా నుంచి ద‌హేజ్‌కు ఫెర్రీ స‌ర్వీసు గురించి వింటున్నాన‌ని చెబుతూ అది ఇప్పుడు సాకార‌మైంద‌న్నారు. ప్ర‌భుత్వం అన్ని రంగాల‌లో స‌మ‌గ్ర అభివృద్ధిపై దృష్టి పెడుతోంద‌ని చెప్పారు.

గ‌తంలో నిర్వ‌హిస్తూ వ‌చ్చిన‌ట్టుగానే అక్టోబ‌ర్ 31న స‌ర్దార్‌ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా ఐక్య‌త కోసం ప‌రుగును నిర్వహించడం జ‌రుగుతుంద‌ని, ప్ర‌జ‌లు ఇందులో ఉత్సాహ‌వంతంగా పాల్గొనాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.