Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేదార్‌నాథ్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌

కేదార్‌నాథ్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌

కేదార్‌నాథ్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌

కేదార్‌నాథ్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కేదార్‌నాథ్ ను సంద‌ర్శించారు. ఆయ‌న కేదార్‌నాథ్ దేవాల‌యంలో అర్చ‌న‌లో పాలు పంచుకొన్నారు. అవ‌స్థాప‌న మ‌రియు అభివృద్ధి ప‌థ‌కాలు ఐదింటికి పునాది రాయి వేశారు. వీటిలో.. మందాకిని న‌ది తీరంలో గోడ‌ను అభివృద్ధిప‌ర‌చే ప‌థ‌కం; మ‌రియు ఘాట్ అభివృద్ధి; అలాగే స‌ర‌స్వ‌తి న‌ది ఒడ్డున ఒక గోడ‌ను అభివృద్ధి ప‌ర‌చ‌డం మ‌రియు ఘాట్ నిర్మాణం; కేదార్‌నాథ్ దేవాల‌యానికి ప్ర‌ధాన‌ ర‌హ‌దారిని నిర్మించడం; శంక‌రాచార్య కుటీరాన్ని మ‌రియు శంక‌రాచార్య వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న‌శాలను అభివృద్ధిపరచడం; ఇంకా, కేదార్‌నాథ్ పురోహితుల యొక్క గృహాలను అభివృద్ధిపరచే ప‌నులు భాగంగా ఉన్నాయి. కేదార్‌పురి పున‌ర్ నిర్మాణ ప‌థ‌కాన్ని గురించి అధికారులు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

అక్క‌డ గుమికూడిన వారిని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, దీపావ‌ళి ముగిసిన త‌రువాతి రోజున కేదార్‌నాథ్ ను సంద‌ర్శించ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు. ఈ రోజున గుజ‌రాత్‌ లో నూత‌న సంవ‌త్స‌ర ఆరంభ దినాన్ని జ‌రుపుకొంటున్నార‌ని ఆయ‌న చెప్తూ, ప్ర‌పంచం అంత‌టా ఉన్న గుజ‌రాతీయుల‌కు త‌న శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం దైవానికి సేవ చేయ‌డ‌మే అవుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొంటూ మనం స్వాతంత్య్రం సంపాదించుకొని 75 సంవ‌త్స‌రాలు అయ్యే 2022 కల్లా అభివృద్ధి చెందిన భార‌త‌దేశం అన్న స్వప్నాన్ని సాకారం చేసుకోవ‌డానికి త‌న‌ను తాను పూర్తిగా అంకింతం చేసుకొంటున్న‌ట్లు ప్ర‌తిన పూనారు. 2013 లో సంభ‌వించిన ప్ర‌కృతి విప‌త్తును ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొంటూ, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా తాను బాధితుల‌కు చేయ‌గ‌లిగిందల్లా చేయ‌డానికి ఇక్క‌డ‌కు వ‌చ్చినట్లు, పున‌ర్ నిర్మాణ ప్ర‌య‌త్నాల‌కు గుజ‌రాత్ ప్ర‌భుత్వం నుండి మ‌ద్ద‌తు ఇవ్వజూపినట్లు చెప్పారు.

కేదార్‌నాథ్ లో జ‌రుగుతున్న ప‌నులను బ‌ట్టి చూస్తే ఒక ఆద‌ర్శ‌ప్రాయ‌మైన ‘‘తీర్థయాత్ర స్థ‌లం’’.. యాత్రికుల‌ సౌక‌ర్యాల పరంగా లేదా అర్చ‌కుల‌ సంక్షేమం పరంగా.. ఎలా ఉండాలి అనేది గ‌మ‌నించ‌వ‌చ్చున‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. కేదార్‌నాథ్‌లో రూపుదిద్దుకొంటున్న మౌలిక స‌దుపాయాలు చ‌క్క‌టి నాణ్య‌త‌తో, ఆధునికంగా ఉంటూనే సంప్ర‌దాయ నాగ‌ర‌క‌త‌ను ప‌రిర‌క్షిస్తాయ‌ని, అలాగే ప‌ర్యావ‌ర‌ణానికి భంగం వాటిల్లచేయవ‌ని కూడా ఆయ‌న చెప్పారు.

ఆధ్యాత్మిక‌త‌కు, సాహ‌సానికి, ప‌ర్య‌ట‌న‌కు మరియు ప్ర‌కృతి ప్రేమికుల‌కు హిమాల‌యాలు అందించేటటువంటి విశేషాలు అనేకం ఉన్నాయని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఇక్క‌డ‌కు వ‌చ్చి హిమాల‌యాల శోభ‌ను వీక్షించ‌వ‌ల‌సిందిగా ప్ర‌తి ఒక్క‌రిని ఆయ‌న ఆహ్వానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉత్త‌రాఖండ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌ డాక్ట‌ర్ కె.కె. పాల్ మరియు ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావ‌త్ లు కూడా పాల్గొన్నారు.