ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ప్రపంచంలో సరళతరమైన ద్రవ్యరూప సహజ వాయు విఫణిని స్థాపించేందుకు భారత్ మరియు జపాన్ల మధ్య పరస్పర సహకార ఒప్పందాన్ని ఆమోదించింది.
విద్యుత్ రంగంలో భారత్ మరియు జపాన్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది.
భారతదేశంలో గ్యాస్ సరఫరా విస్తరణకు ఈ ఒప్పందం తనవంతు సహకారాన్ని అందిస్తుంది. సహజవనరుల భద్రతను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
ద్రవ్యరూప సహజవాయువుల కాంట్రాక్టులను సరళతరం చేయడంలో, లక్ష్యాలపై ఆంక్షల నింధనల నిర్మూలకు, గ్యాస్ కు నిజమైన డిమాండ్ మరియు సరఫరాల ప్రకారం ధరల నిర్ణయాలను తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయండంలో గల సంభావ్యతలను అన్వేషించేటలో సహకారం అందించుటకు ఈ ఒప్పందం ప్రయోజనకారి.
పూర్వరంగం:
ప్రపంచంలో భారత్ మరియు జపాన్‌లు విద్యుత్తును అత్యధికంగా వినియోగించే దేశాలు కాగా ద్రవ్యరూప సహజ వాయువులను దిగుమతి చేసుకోవడంలో జపాన్ ది మొదటి స్ధానం కాగా భారత్ 4వ స్ధానంలో ఉంది. లక్ష్యాలపై ఆంక్షల నిబంధనలను సడలించడం ద్వారా ద్రవ్యరూప సహజ వాయువుల మార్కెట్‌ను సరళతరంగా, పారదర్శకంగా ఉంచేందుకు ప్రోత్సహించుటకు, సహజ శక్తి వనరుల మార్కెట్ సవ్యంగా నడచుటకు పరస్పరం కలసి పనిచేస్తూ ప్రోత్సహించుకుంటామని జనవరి 2016లో జపాన్-భారత్ విద్యుత్ భాగస్వామ్య కార్యక్రమం క్రింద ఇరుదేశాలూ సంతకాలు చేశాయి.