Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ ప్రారంభం అనంత‌రం 3వ వార్షికోత్స‌వం: స‌్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ మ‌రియు స్వ‌చ్ఛ‌తా హీ సేవ ప‌క్షోత్స‌వం ముగింపు ల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ ప్రారంభం అనంత‌రం 3వ వార్షికోత్స‌వం: స‌్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ మ‌రియు ‘‘స్వ‌చ్ఛ‌తా హీ సేవ’’ ప‌క్షోత్స‌వం ముగింపు ల సంద‌ర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని ప్ర‌సంగించారు.

అక్టోబ‌ర్ 2వ తేదీ మ‌హాత్మ గాంధీ జ‌యంతి తో పాటు శ్రీ లాల్ బ‌హాదుర్ శాస్త్రి జ‌యంతి కూడా అని ఆయ‌న అన్నారు. అంతేకాకుండా, ఇది స్వ‌చ్ఛ భార‌త్ గ‌మ్యం దిశ‌గా మ‌నం ఎంత దూరం ప్ర‌యాణించామో వెనుదిరిగి చూసుకొనే సంద‌ర్భం కూడా అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

మూడు సంవ‌త్స‌రాల క్రితం తీవ్ర విమ‌ర్శ మ‌ధ్య స్వ‌చ్ఛ భార‌త్ ఉద్య‌మాన్ని ఏ విధంగా మొద‌లు పెట్ట‌డం జ‌రిగిందో ఆయ‌న గుర్తు చేశారు. మ‌హాత్మ గాంధీ చూపించిన‌టువంటి మార్గం త‌ప్పు కాదు అని తాను న‌మ్ముతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. స‌వాళ్ళు ఉన్న‌ప్ప‌టికీ కూడా దూరంగా పారిపోవాల‌ని వాటి అర్థం కాదు అని ఆయ‌న చెప్పారు.

ప‌రిశుభ్ర‌త కోసం ప్ర‌జ‌లంతా ప్ర‌స్తుతం ముక్త కంఠంతో వారి అభిమ‌తాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. నాయ‌కులు మ‌రియు ప్ర‌భుత్వాల ప్ర‌య‌త్నాల ద్వారా స్వ‌చ్ఛ‌త‌ను సాధించ‌జాల‌మ‌ని, దీనిని స‌మాజం కృషి ద్వారా మాత్ర‌మే సాధించ‌వ‌చ్చ‌ునని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ రోజు స్వ‌చ్ఛ‌తా అభియాన్ ఒక సామాజిక ఉద్య‌మంగా మారింద‌ని, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని ప్ర‌శంసించి తీరాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ రోజు వ‌ర‌కు కూడా సాధించిన‌దంతా భార‌త‌దేశంలోని స్వ‌చ్ఛాగ్ర‌హి ప్ర‌జ‌లు సాధించినటువంటి విజ‌య‌మే అని కూడా ఆయ‌న అన్నారు.

స‌త్యాగ్ర‌హులు స్వ‌రాజ్యాన్ని సాధిస్తే, స్వ‌చ్ఛాగ్ర‌హులు ‘శ్రేష్ఠ భార‌త్’ ను సాధించ‌గ‌లుగుతార‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

న‌గ‌రాల యొక్క స్వ‌చ్ఛ‌త ర్యాంకింగ్‌ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, అవి ఒక స‌కారాత్మ‌క‌మైన మ‌రియు స్ప‌ర్ధాత్మ‌క‌మైన వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పిన‌ట్లు వివ‌రించారు. స్వ‌చ్ఛ‌త‌కు ఆలోచ‌న‌ల క్రాంతి కూడా అవ‌స‌ర‌ప‌డుతుంద‌ని, పోటీ అనేది స్వ‌చ్ఛ‌త భావ‌న‌కు ఆలోచ‌న‌ల‌ను అందించేటటువంటి వేదిక‌గా నిలుస్తుంద‌ని ఆయన అన్నారు.

‘‘స్వ‌చ్ఛ‌తా హీ సేవ’’ ప‌క్షోత్స‌వం సంద‌ర్భంగా పాటుప‌డిన వారంద‌రికీ ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. అయితే, చేయ‌వ‌ల‌సింది ఇంకా ఎంతో ఉంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

జాతీయ వ్యాస ర‌చ‌న , చిత్ర లేఖ‌నం, ఇంకా ఫిల్మ్ కాంపిటీశ‌న్ ల‌లో విజేత‌లుగా నిలచిన వారికి పుర‌స్కారాల‌ను ప్ర‌ధాన మంత్రి అందజేశారు. అలాగే, ఒక డిజిట‌ల్ డిస్‌ప్లే గ్యాల‌రీని కూడా ఆయన సంద‌ర్శించారు.

****