Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రితో స‌మావేశమైన మ‌హిళా మోటార్ బైక్ రైడ‌ర్ల బృందం ‌‘‘బైకింగ్ క్వీన్స్’’


గుజ‌రాత్ నుండి విచ్చేసిన 50 మంది మ‌హిళా మోటార్ బైక్ రైడ‌ర్ల తో కూడిన బృందం ‘‘ది బైకింగ్ క్వీన్స్‌’’ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు న్యూ ఢిల్లీ లో స‌మావేశమైంది.

ఈ బృందం సభ్యురాళ్లు తాము 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల గుండా 10,000 కిలో మీట‌ర్ల‌కు పైగా దూరం యాత్ర చేసి, ‘భేటీ బ‌చావో – భేటీ ప‌ఢావో’ మ‌రియు ‘స్వ‌చ్ఛ భార‌త్’ ల వంటి సామాజిక కార్య‌క్ర‌మాల‌ గురించి ప్ర‌జ‌ల‌తో మాట్లాడి ఆ పథకాల స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో పాలుపంచుకొన్నట్లు తెలిపారు. 2017 ఆగ‌స్టు 15న ల‌ద్దాఖ్ లోని ఖార్‌ దుంగ్ లా లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన‌ట్లు కూడా వారు ఈ సందర్భంగా వెల్ల‌డించారు.

మహిళా బైక్ రైడర్ల ప్ర‌య‌త్నాన్ని ప్ర‌ధాన మంత్రి అభినందించారు. వారు ఇక ముందు చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.