Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన శ్రీ ఎం. వెంక‌య్య‌నాయుడుకు ప్ర‌ధాని అభినంద‌న‌లు


భార‌త దేశ‌13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన శ్రీ ఎం.వెంక‌య్య‌నాయుడును ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.
శ్రీ వెంక‌య్య‌నాయుడుగారూ, మీరు భార‌త‌దేశ 13వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైనందుకు మీకు నా అభినంద‌న‌లు. మీ ప‌ద‌వీకాలం ఫ‌ల‌వంతం, ప్రేర‌ణాత్మ‌కం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను. అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

శ్రీ వెంకయ్య‌నాయుడుగారితో పార్టీలో ప్ర‌భుత్వంలో క‌ల‌సి ప‌నిచేసిన జ్ఞాప‌కాలతో నా మ‌ది నిండిపోయింది. ఇది మా అనుబంధాన్ని మరింత పెంపొందిస్తుంది.

శ్రీ వెంక‌య్య‌నాయుడుగారు జాతి నిర్మాణ ల‌క్ష్యం గ‌ల చురుకైన , అంకిత‌బావంగ‌ల ఉప‌రాష్ట్ర‌ప‌తిగా దేశానికి సేవ‌లు అందించ‌గ‌ల‌ర‌న్న విశ్వాసం నాకుంది.

******