హాంబర్గ్ లో జి-20 శిఖరాగ్ర సభ సందర్భంగా జపాన్ ప్రధాని శ్రీ శింజో అబే తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరిపారు.
2016 నవంబరులో ప్రధాన మంత్రి జపాన్ లో పర్యటించినప్పుడు శ్రీ అబే తో సమావేశమైన తరువాత నుండి ముఖ్యమైన పథకాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలలో చోటు చేసుకున్న పురోగతిని ఇరువురు నేతలు తాజా భేటీలో సంక్షిప్తంగా సమీక్షించారు. అప్పటి నుండి ద్వైపాక్షిక సంబంధాలలో సంభవించిన పరిణామాల పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ సంతృప్తిని వ్యక్తం చేశారు.
తదుపరి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం త్వరలో భారతదేశానికి రానున్న ప్రధాని శ్రీ అబే కోసం తాను ఎదురుచూస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ అబే భారత పర్యటన ఇరు దేశాల మధ్య నెలకొన్న సహకారాన్ని మరింత బలోపేతం చేయగలదన్న ఆశాభావాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.
Furthering India-Japan ties...Prime Ministers @narendramodi and @AbeShinzo meet on the sidelines of the G20 Summit. pic.twitter.com/MgHnJ9y3Ds
— PMO India (@PMOIndia) July 7, 2017