Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ లంక లో వరదలు మరియు కొండచరియలు విరిగిపడడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ లంక లో వరదల కారణంగాను మరియు కొండచరియలు విరిగిపడటంతోను ప్రాణ నష్టం జరిగినందుకు, ఆస్తి నష్టం సంభవించినందుకు సంతాపం వ్యక్తం చేశారు.

“శ్రీ లంకలో వరదలు రావడం వల్లను, కొండచరియలు విరిగిపడటం తోను ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లడం పట్ల భారతదేశం సంతాపం తెలుపుతోంది.

శ్రీ లంక ఆపత్సమయంలో శ్రీ లంక సోదరులు, సోదరీమణులకు అండగా మేము నిలబడతాము.

సహాయ సామగ్రితో మా నౌకలను పంపిస్తున్నాము. ఒకటో నౌక రేపు ఉదయానికల్లా కొలంబోకు చేరుకొంటుంది.

రెండో నౌక ఆదివారం నాడు చేరుకొంటుంది. మరింత సాయం కూడా రానుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***