Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపిబి) కార్యకలాపాల మూసివేతకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఫారిన్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపిబి) కార్యకలాపాల మూసివేతకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో ఎఫ్ఐపిబి ని రద్దు చేయడంసేందుకు మరియు ప్రభుత్వ ఆమోదం అవసరమయ్యే ఎఫ్ డిఐ సంబంధిత దరఖాస్తులను ప్రాసెస్ చేసేందుకుగాను అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీలు/విభాగాలకు అనుమతిని ఇవ్వడం
అనే అంశాలు చేరి ఉన్నాయి.

ఇక నుండి, ఎఫ్ డిఐ ల దరఖాస్తుల ప్రాసెసింగుకు మరియు ఆ దరఖాస్తులకు ఇప్పటి ఎఫ్ డిఐ విధానంతో పాటు ఎఫ్ఇఎమ్ ఎ ల ప్రకారం ప్రభుత్వ ఆమోదం తెలపడానికి సంబంధించిన పనిని ఆయా మంత్రిత్వ శాఖలు విభాగాలు నడిపిస్తాయి. ఈ క్రమంలో వాణిజ్య శాఖ లోని పారిశ్రామిక విధానం ప్రోత్సాహక విభాగం (డిఐపిపి)ని సంప్రతిస్తాయి. అలాగే దరఖాస్తుల ప్రాసెసింగుకు, ఇప్పటి ఎఫ్ డిఐ విధానం ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపి) ని కూడా జారీ చేస్తాయి.

దీనికి తోడు, విదేశీ పెట్టుబడిదారులు భారతదేశాన్ని మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా గుర్తించనున్నారు. ఫలితంగా మరింత ఎఫ్ డిఐ దేశంలోకి తరలిరాగలదు. ఈ చర్య వ్యాపారాన్ని సులభతరంగా మార్చడానికి తోడ్పడనుంది. అంతే కాక, ఈ నిర్ణయం కనీస స్థాయి ప్రభుత్వం మరియు గరిష్ఠ స్థాయి పాలన సూత్రాన్ని ప్రోత్సహించేదే కానుంది.

పూర్వ రంగం

ఎఫ్ఐపిబిని రద్దు చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం 2017 మే 24వ తేదీ నాడు జరిగిన సమావేశంలో ఆమోదించింది. ప్రస్తుతం, దరఖాస్తులను ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఇఎ)లో భాగంగా ఉన్న ఎఫ్ఐపిబి పరిశీలిస్తోంది. ఎఫ్ఐపిబి లో ఎఫ్ డిఐ దరఖాస్తులపై ఒక సిఫారసును చేయడానికి గాను భారత ప్రభుత్వ వేరు వేరు కార్యదర్శులతో ఏర్పాటైంది. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తరువాత, ఈ పనిని రంగాల వారీ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీలు స్వతంత్రంగా పూర్తి చేయనున్నాయి.

***