Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయిన రష్యా డిప్యూటీ ప్రధాని

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయిన రష్యా డిప్యూటీ ప్రధాని


రష్యా డిప్యూటీ ప్రధాని శ్రీ దిమిత్రి రొగొజిన్ ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శ్రీ దిమిత్రి రొగొజిన్ భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సహ అధ్యక్షతన జరుగుతున్నఇండో-రష్యా గవర్నమెంటల్ కమిషన్ సమావేశంలో పాల్గొనడం కోసం భారతదేశానికి విచ్చేశారు.

భారతదేశం మరియు రష్యాల మధ్య ద్వైపాక్షిక సహకారం సకారాత్మకమైన రీతిలో సర్వతోముఖ పురోగతిని నమోదు చేస్తుండడం పట్ల ప్రధాన మంత్రి ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత ఆ సంబంధాల స్థాపన జరిగి 70 ఏళ్లు అయినందున 70వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం జరుపుకొంటున్న తరుణాన ఉభయ పక్షాల మధ్య ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాలు తరచుగా చోటుచేసుకొంటూ ఉండడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.