Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని ప్రయోగించిన వేళ దక్షిణాసియా దేశాల ప్రభుత్వ అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశం ఆరంభంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని ప్రయోగించిన వేళ దక్షిణాసియా దేశాల ప్రభుత్వ అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశం ఆరంభంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు


శేష్ఠుడైన అఫ్గానిస్తాన్ ప్రెసిడెంట్ శ్రీ అశ్ రఫ్ ఘనీ,

శ్రేష్ఠురాలైన బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు,

శ్రేష్ఠుడైన భూటాన్ ప్రధాని శ్రీ శేరింగ్ టోబ్ గే,

శ్రేష్ఠుడైన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ శ్రీ అబ్దుల్లా యామీన్,

శ్రేష్ఠుడైన నేపాల్ ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహాల్,

శ్రేష్ఠుడైన ప్రెసిడెంట్ శ్రీ మైత్రిపాల సిరిసేన,

సోదర సోదరీమణులారా,

నమస్కారాలు.

శ్రేష్ఠులారా,

దక్షిణాసియాకు ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు.  ఇటువంటి రోజు ఇదివరకు ఎన్నడూ రానటువంటి రోజు.  రెండు సంవత్సరాల కిందట భారతదేశం ఒక వాగ్దానం చేసింది.

అత్యధునాతన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని దక్షిణ ఆసియా లోని మన సోదర సోదరీమణుల వృద్ధి మరియు సమృద్ధి కోసంఅందిస్తామన్న వాగ్దానమది.

దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాం.  ఈ ఉపగ్రహ ప్రయోగంతో మన భాగస్వామ్యం కోసం అత్యంత ఆధునికమైన సీమకు చేరే ప్రయాణాన్ని మనం మొదలుపెట్టినట్లయింది.

దక్షిణ ఆసియా సహకారానికి ఒక ప్రతీక అయిన ఈ ఉపగ్రహం నింగిలో సమున్నత స్థానానికి చేరుకోవడం ద్వారా మన ప్రాంతంలో ఒకటిన్నర బిలియన్ కు పైగా ప్రజల ఆర్థిక అభ్యున్నతిని, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో తోడ్పాటును అందజేయగలుగుతుంది. అంతేకాకుండా మన మధ్య ఉన్న సన్నిహిత బంధాన్ని అంతరిక్షంలోకి విస్తరింప చేస్తుంది కూడాను.

శ్రేష్ఠులారా,

ఈ ప్రయోగ వేడుకను జరుపుకోవడంలో నాతో కలిసి వచ్చిన అఫ్గానిస్తాన్, బాంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్ దీవ్స్ మరియు శ్రీలంకలకు చెందిన నా తోటి అధినేతలకు నేను ఎంతో కృతజ్ఞుడిని.

మీ ప్రభుత్వాలు అందించిన బలమైన, మరియు విలువైన సహాయం లేనిదే ఈ ప్రాజెక్టు సాధ్యపడేదే కాదు. ఇందుకుగాను మిమ్మల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మనం ఒక తాటి మీదకు రావడం మన పౌరుల అవసరాలకు పెద్ద పీట వేయాలన్న మన సంకల్పం తిరుగులేనిదని సూచించే ఒక సంజ్ఞ‌.

ఇది మన ఉమ్మడి ఎంపికలైనటువంటి మన పౌరుల సహకారం (విరోధం కాదు) , అభివృద్ధి (వినాశం కాదు), సమృద్ధి (పేదరికం కాదు) మనని కలిపి ఉంచుతాయని ఈ ఘటన చాటి చెబుతోంది.

శ్రేష్ఠులారా,

దక్షిణ ఆసియాలో ఇటువంటి కోవకు చెందిన మొట్టమొదటి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు ద్వారా అఫ్గానిస్తాన్, బాంగ్లాదేశ్, భూటాన్, మాల్ దీవ్స్, నేపాల్, శ్రీలంక లతో పాటు భారతదేశం

సఫలమైన కమ్యూనికేషన్ వ్యవస్థను;
మెరుగైన పాలనను;
మెరుగైన బ్యాంకింగ్ వ్యవస్థను;
సుదూర ప్రాంతాలలో చక్కటి విద్యావకాశాలను;
వాతావరణ అంచనాలలో మరియు వనరుల అన్వేషణలో సాఫల్యాన్ని సాధించగలుగుతాయి; అంతేకాదు, టెలి మెడిసిన్ ద్వారా ప్రజలకు అగ్ర శ్రేణి వైద్య సేవలను, ప్రకృతి విపత్తుల వేళల్లో సత్వర కార్యాచరణను చేపట్టడానికి కూడా వీలవుతుంది.

అంతరిక్ష సంబంధ సాంకేతిక విజ్ఞానం ఈ ప్రాంతంలో నివసిస్తున్న మన ప్రజల జీవితాలను సుఖమయం చేయగలదు.

ఈ ఉపగ్రహం ఆయా దేశాల నిర్దిష్ట అవసరాలకు మరియు ప్రాధాన్యాలకు తగ్గట్టుగాను మరియు సాధారణ సేవలను కూడా అందించగలదు.

ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారతదేశంలోని అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన నిపుణులకు, మరీ ముఖ్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ) సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని ఈ ప్రాంతం యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీర్చిదిద్దడంలో ఐఎస్ఆర్ఒ జట్టు ముందు నిలబడి పని చేసింది. అంతేకాదు, ఏ లోపం లేకుండా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది కూడా.

శ్రేష్ఠులారా,

ప్రభుత్వాలుగా మన ముందున్న అత్యంత ముఖ్యమైన కర్తవ్యమల్లా మన ప్రజలకు, సముదాయాలకు వారి వృద్ధికి, ఉన్నతికి, శాంతికి పూచీ పడడమే.  అలాగే, మనం మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని, వృద్ధి ఫలాలను ఒకరితో మరొకరం పంచుకోవడానికి ముందుకు వచ్చినప్పడు మన అభివృద్ధి మరియు సమృద్ధి సాధన ప్రక్రియలను వేగవంతంగా మార్చుకోగలుగుతామని నేను నమ్ముతున్నాను.
మీరంతా హాజరైనందుకు మీకు ఇవే నా ధన్యవాదాలు. మనం ఈ విజయాన్ని పరస్పరం ఆస్వాదిస్తున్న తరుణంలో మీకు మరొకసారి ఇవే నా అభినందనలు.

మీకు నా ధన్యవాదాలు; అనేకానేక ధన్యవాదాలు.

***