Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దక్షిణ ఆసియా ఉపగ్రహం– కొన్ని ప్రధానాంశాలు

దక్షిణ ఆసియా ఉపగ్రహం– కొన్ని ప్రధానాంశాలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆసియా లోని ఇరుగుపొరుగు దేశాలకు ఆకాశంలో ఉండి పనిచేసే ఒక అపూర్వ బహుమానాన్ని ఇవ్వడంతో, అంతరిక్ష దౌత్యం నూతన శిఖరాలను అందుకొంది.

ఇరుగుపొరుగు దేశాలు ఉపయోగించుకొనేందుకు అనువుగా కమ్యూనికేషన్స్ శాటిలైట్ ను ఎటువంటి ఖరీదు లేకుండా బహుమానంగా ఇవ్వడమనేది ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినప్పుడు బహుశా ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరిగిన దాఖలా లేదేమో.

ఈ ఉపగ్రహం బరువు 2 టన్నులకు పైగానే ఉంటుంది. దీనిని 230 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించారు.

దీని పాదముద్ర యావత్తు దక్షిణ ఆసియా అంతటా విస్తరిస్తుంది.

దక్షిణ ఆసియా ఉపగ్రహానికి 12 కెయు బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు ఉన్నాయి. వీటిని భారతదేశ ఇరుగుపొరుగు దేశాలు వాటి కమ్యూనికేషన్స్ ను పెంపొందించుకొనేందుకు ఉపయోగించుకోవచ్చు.

ప్రతి దేశానికి కనీసం ఒక ట్రాన్స్ పాండర్ ను ఉపయోగించుకొనే సౌలభ్యం ఉంటుంది. దీని ద్వారా వారు వారి సొంత కార్యక్రమాలను ప్రసారం
చేసుకోవచ్చు.

ఈ ఉపగ్రహం డిటిహెచ్ టెలివిజన్, విఎస్ఎటి లింకులు, టెలి-ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్ మరియు విపత్తుల వేళ నిర్వహణ సంబంధ మద్దతు వంటి సేవలలో తోడ్పడుతుంది. ఇది భూకంపాలు, తుపానులు, వరదలు మరియు సునామీల వంటి విపత్తుల వేళల్లో కీలకమైన కమ్యూనికేషన్ లింకులను అందించగలదు.

దక్షిణ ఆసియా లో ఈ ఉపగ్రహం నుండి లబ్ధిని పొందే ఏడు దేశాల ప్రభుత్వాధినేతలు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కలుసుకొని, మాటామంతీ జరిపారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో, వారు ఇలాగ సంభాషించుకోవడాన్ని అపూర్వ రీతిలో జరిపిన ఒక వేడుకగా చెప్పుకోవచ్చు.