దేశీయంగా తయారైన ఇనుము & ఉక్కు ఉత్పత్తులకు ప్రభుత్వ సేకరణలలో ప్రాధాన్యాన్ని కల్పించే విధానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు జాతి నిర్మాణ లక్ష్యంతో ప్రధాన మంత్రి ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతను సాకారం చేసేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది.
ఈ విధానం ప్రభుత్వ సేకరణలలో దేశీయంగా తయారైన ఇనుము & ఉక్కు ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చేందుకు వీలు కల్పిస్తుంది. ప్రైస్ బిడ్‌లు తెరవాల్సి ఉన్న అన్ని ప్రభుత్వ టెండర్లకు ఇది వర్తిస్తుంది.
ప్రాధాన్యతా సేకరణలో భాగంగా నోటిఫై అయిన ఉక్కు ఉత్పత్తులకు15 శాతం కనీస విలువ జోడింపునకు డిఎంఐ & ఎస్‌పి విధానం వీలు కల్పిస్తుంది. ఈ విషయంలో కాస్త వెసులుబాటును ఇచ్చేందుకు ఉక్కు మంత్రిత్వశాఖ స్పెసిఫైడ్ స్టీల్ ఉత్పత్తులు, కనీస విలువ జోడింపు ప్రాధాన్యాన్ని సమీక్షించవచ్చు.
దీనిని అమలు చేసే సమయంలో ఎవరు ఈ విధానాల వివరాలు వెల్లడించాలన్న దానిపై, దేశీయ ఉత్పత్తిదారులపై ఈ విధానం విశ్వాసం ఉంచింది. తాము సరఫరా చేస్తున్న ఇనుము & ఉక్కు ఉత్పత్తులు దేశీయంగా తయారైనవేనని, ప్రభుత్వ విలువ జోడింపు విధానానికి అనుగుణంగా ఉన్నాయని వారికి వారే స్వీయ ధ్రువీకరణను ప్రభుత్వ ప్రొక్యూరింగ్ ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇది సరైందా కాదా అన్నది సరిచూడడం సాధారణంగా ప్రొక్యూరింగ్ ఏజెన్సీ బాధ్యత కాదు. అయితే కొన్ని సందర్భాలలో అది సరైనదా కాదా అని సరిచూడాల్సిందిగా కోరినపుడు ఈ బాధ్యత బిడ్డర్‌పై ఉంటుంది.
ఏదైనా సందర్భంలో తయారీదారు బాధితుడైతే, స్టీల్ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటయ్యే ఫిర్యాదుల పరిష్కార సంఘం నిర్ణీత కాల వ్యవధిలో నాలుగు వారాల వ్యవధిలో పరిష్కరిస్తుంది.
ఇలాంటి ప్రొక్యూర్‌మెంట్లకు కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. ఏదైనా సందర్భంలో ప్రత్యేక గ్రేడ్ ఉక్కు దేశంలో తయారుకాకపోతేలేదా డిమాండ్ కు తగినంత పరిమాణం దేశీయంగా అందుబాటులో లేకపోతే అందుకు మినహాయింపులు ఉన్నాయి.
మొత్తానికి ఈ విధానం దేశీయ ఉక్కు పరిశ్రమ ప్రగతిని ప్రోత్సహించేందుకు నిర్దేశించింది. అంతేకాకుండా నాసిరకం, తక్కువ ధరపై దిగుమతుల ద్వారా వచ్చిన ఉక్కును ప్రభుత్వం నిధులు సమకూర్చే ప్రాజెక్టులలో వాడకుండా చూడడం దీని ఉద్దేశం. ప్రభుత్వంలోని ప్రతి ఏజెన్సీ ఈ విధానం అమలును బాధ్యతగా స్వీకరించాలి.