ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అనధికారికంగా సంభాషించారు. దేశంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం కృషి చేయాలని వారికి సూచించారు. బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు సాంకేతికతను కూడా అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులు స్వచ్ఛతను పాటించేలా వారిలో గుణగణాలను పెంపొందించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి శ్రీమతి స్మృతీ ఇరానీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి డాక్టర్ రామ్ శంకర్ కతేరియాలు ఈ సందర్భంగా ప్రధాని వెంట ఉన్నారు.
Met teachers who have been conferred National Awards. Our interaction was wonderful. http://t.co/wpuZbK7wjz
— Narendra Modi (@narendramodi) September 4, 2015
I congratulated all teachers conferred the National Awards for their determination & their invaluable service to our nation.
— Narendra Modi (@narendramodi) September 4, 2015